స్పందించని ఉన్నతాధికారులు
నేటి ధాత్రి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ ఈరోజు మొగుళ్లపల్లి మండలంలోని కొరికి శాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను మోడల్ స్కూల్ లో ఉన్నటువంటి సమస్యలను మోడల్ స్కూల్ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని సందర్శించడం జరిగింది…… ఈ సందర్భంగా మాట్లాడుతూ మొగుళ్లపల్లి మండల తాసిల్దార్ గారు ఈ రెండు హాస్టల్లో సందర్శించడం జరిగింది కానీ ఎలాంటి మార్పు జరగలేదు ఉడకని అన్నం నీళ్ల చారు తోటే భోజనం పెడతా ఉన్నారు కూరలలో ఎలాంటిమార్పు జరగడం లేదు ఎప్పటిలాగానే ఒకటే కూర నీళ్ల చారు పెడతా ఉన్నారు మెను ప్రకారం భోజనం పెట్టాలని ప్రభుత్వ నిబంధన ఉన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా మెనూ అమలు చేస్తున్నారు వారంలో ఒక రోజైనా సరైన కూర పెట్టడం లేదని పిల్లలు అంటున్నారు ఆకలి బాధకు తినడం తప్ప మరో మార్గం లేదని మోడల్ స్కూల్ హాస్టల్ లో లోపట విపరీతమైన గడ్డి ఇరువైపులా చెత్త హాస్టల్ ముందు నీరు నిల్వ ఉండే గుంట ఉన్నాయి విపరీతమైన సీజన్ వాదులు వస్తా ఉన్నాయి పిల్లలకు జరాలు వస్తా ఉన్నాయి 100మంది ఉండే హాస్టల్లో 50 మంది మాత్రమే ఉంటున్నారు వర్షాకాల సీజన్లో విపరీతమైన దోమలు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ దోమల మందు కొట్టిన దాఖలు కనడం లేదు గడ్డి మందు కూడా కొట్టిన పరిస్థితులు కానరావడం లేదు హాస్టల్ ఎస్ఓ నిర్లక్ష్యం ఆమెపై చర్యలు తీసుకోవాలి జిల్లాఉన్నత అధికారులు వెంటనే సందర్శించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని హాస్టల్లో ఉన్నటువంటి భోజన మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం