Quality education
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆకునూరు జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ ఆధ్వర్యంలో బడిబాట
చేర్యాల నేటిధాత్రి..
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆకునూరు గ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో అన్ని వార్డులలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు ఉచిత సౌకర్యాలతోపాటు టెక్నాలజీతో బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు వెళ్లి తల్లిదండ్రులు కష్టపడి సంపాందించిన డబ్బులను వృధా చేయవద్దన్నారు. విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని సర్కారు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
