ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్
అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్ గుజ్జుల రాజ్‌కుమార్. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్ రోవర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో 20సార్లు రక్తదానం చేసినట్లు పెద్దల స్ఫూర్తితో, ప్రజాసేవే ధ్యేయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విదేశాల్లో, దేశవ్యాప్తంగా పలు అభివద్ధి, యువజన కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా ప్రభుత్వం డాక్టరేట్ అందించిందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు డీఆర్డీఏ పిడి సంపత్‌రావు, ఏపిడి పరమేష్, డ్వామా ఏపిడి పారిజాతంలు అభినందించి సంబంధిత ధవీకరణ పత్రాన్ని అందించాలని, మరిన్ని రక్తదాన శిబిరాల్లో పాల్గొననున్నట్లు ఏపీఎం రాజ్‌కుమార్ తెలిపారు.