PCC Chief Visits Temple
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న పిసిసి అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న పి.సి.సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముందుగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆలయాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉంది.ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేనీ సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
