
కొత్తగూడ, నేటిధాత్రి :
ములుగు అసెంబ్లీ మహబూబాబాద్ జిల్లా
తేది 11 ఏప్రిల్ గురువారం ఉదయం గం 10:30 ని,లకు కొత్తగూడ మండలo వేలుబెల్లి లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో… కొత్తగూడ & గంగారాం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సమావేశం నిర్వహించబడును అని ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మాజీ సహాయ కేంద్ర మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.
యూత్ కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జి సూర్య పాల్గొంటారు కావున కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అన్ని గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ ఎన్ రోలర్స్, కిసాన్ సెల్ విభాగం నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు … కార్యక్రమం సకాలంలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిస్తూన్నాము అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు