క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది

పీ ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్
కాటారం నేటి దాత్రి క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, క్రీడలు శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పి ఆర్ టి యు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కాటారం గ్రామపంచాయతీలోని టీచర్ కాలనీలో నిర్వహించిన కోకో క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీచర్స్ కాలనీలో గత నెల రోజుల నుండి కురసం అశోక్ కోకో శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోకో వేసవి క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పసుల శంకర్ మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రీడలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తు బాగుపడుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ కు బానిసంగా మారుతున్నారని, క్రీడల యొక్క ఔన్నత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లలను క్రీడలవైపు మళ్లీంచేలా చూడాలని కోరారు. క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిస్తే విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు భాస్కర్, శ్రీనివాస్, సందీప్, ఉపాధ్యాయులు అనిల్, శరత్, మహేష్ నాగరాజు, మోహన్ సీనియర్ కోకో క్రీడాకారుడు మంతెన శ్రీనివాస్, సృజన్ పాల్గొన్నారు

మత సామరస్యంతో ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో హనుమాన్ గుడి దగ్గర హనుమాన్ దీక్ష స్వాములకి ఇందారం గ్రామ నివాసి జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ గురువారం సాయంత్రం అల్పాహారం,పండ్లు, పండ్లరసం అందించడం జరిగింది. అలాగే శుక్రవారం రోజున ఇందారం వేణుగోపాలస్వామి గుడిలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు స్వాములకు చిరుకానుకగా గ్లాసులు ఇవ్వడం జరిగింది. జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇందారం గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉంటామని, రంజాన్ పండుగలకు ఇఫ్తార్ పార్టీలతో మా గ్రామ సహోదరులు మాతో కలిసి ఉంటారని,మేము హనుమాన్ స్వాములకు అయ్యప్ప స్వాములకు, వినాయక నవరాత్రులకు వారితో కలిసి మెలిసి జరుపుకుంటామని ఈ మత సామరస్యం, ఐకమత్యం ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుడితో ప్రార్థిస్తున్నానని అన్నారు. గ్రామంలో ఉన్న సుమారు 20 కులాలు బంధువులాగా, అన్నదమ్ములుగా వరుసలతో కాకా, మామ, బావ అంటూ పిలుచుకుంటూ కలిసిమెలిసి ఉంటారని,అలా ఉంటేనే గ్రామం బాగా అభివృద్ధి చెందుతుందని, గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మా గ్రామ యువత మంచి ఉద్యోగాల్లో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని, హనుమాన్ దీక్ష స్వాములు వారి భక్తితో గ్రామం అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు మరియు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ సర్పంచ్ చిప్ప కుర్తి దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ లు సుంకర శ్రీనివాస్ , లక్ష్మణ్ ,తోకల శ్రీనివాస్, గుడిగందుల లక్ష్మీనారాయణ, సాగర్, గౌసి గయాజ్ మరియు హనుమాన్ భక్తులు,సేవకులు పాల్గొన్నారు.

తెలంగాణ లోగోను మార్చినట్లు అమరవీరుల కుటుంబాల జీవితాలను మార్చి వెలుగులు నింపాలి

జమ్మికుంట (టౌన్): నేటిధాత్రి

*నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు)*

సమైఖ్య ఆంధ్రుల పాలనలో తెలంగాణకు అన్యాయం చేశారని,
నీళ్లు , నిధులు నియామకాలు పై సుదీర్ఘ పోరాటం చేసి స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఆంధ్ర పాలకులతో పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకొని అసువులు బాసిన తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అండగా నిలిచి వారికి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ సాధనలో సుమారు 1200 మంది బలిదానాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు.
జూన్ రెండున జరిగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అధికారిక లోగోను మార్చడమే కాకుండా తెలంగాణ కోసం ప్రాణాలర్పించి అసువులు బాసిన కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా,
ఒక పక్క ఇల్లు ,
అమరులైన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో వీర పోరాటం చేసి పోలీస్ కేసులు అయి నేటికీ కోర్టులో చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకుంటూ నెలకు 20వేల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి

(ఏ డి జె ఎఫ్) జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు

మంచిర్యాల నేటిదాత్రి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గుర్తించాలని (ఏ డి జె ఎఫ్) జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా ఎంతో కృషి చేసింది జర్నలిస్టులు మాత్రమేనని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు,విద్యార్థులు, రచయితలు ఇలా సబ్బండ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం వెనుక జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాల వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాలలో పాల్గొని రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు మర్చిపోవద్దని తీగల శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏండ్లు అయినప్పటికి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల బతుకులు మాత్రం ఏమీ మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నరిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణ లో భాగంగా ఇందుకోసం జర్నలిస్టులు అందరూ కూడా సంఘాలకు అతీతంగా సమాయత్తం కావాలని (ఎ డి జె ఎఫ్ )జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు.

జూన్ 2న జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి;
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం సాధన ఉద్యమంలో సమయంలో ,జయ జయహే తెలంగాణ జనని జయకేతనం పాట జనాల్లోకి ఎంతో బలంగా వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులు వాల్మీకి నేత మండ్ల దేవన్న నాయుడు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జయ జయహే తెలంగాణ జనని జయకేతనం పాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గం రాష్ట్ర గీతంగా ఆమోదించింది అని మలిదశ ఉద్యమకారుల తరఫున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు డిసెంబర్ 9 న 2009 తర్వాత జయ జయహే తెలంగాణ పాట కోట్లాది మందికి చేరువైంది తెలంగాణ రాష్ట్రం సిందించిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని గత తెలంగాణ రాష్ట్ర సాధించాక టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మారి తెలంగాణ ద్రోహులకు అండగా మారి ఉద్యమకారులను పట్టించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండ్ల దేవన్న నాయుడు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింద ని మ oడ్ల అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి శ్రమతి సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేస్తుందని తెలిపారు తెలంజూన్ 2 న జయ జయహే తెలంగాణ పాట సరికొత్తగా రాష్ట్ర ప్రజలకు వినిపించనున్నది అని ఉద్యమకారులకు.విలేకరుల కు మేధావులకు. కళాకారులకు. రాజకీయ నాయకులకు సన్మాన కార్యక్రమ ము ఏర్పాటు చే సి న o దుకు హర్షం వ్యక్తం చేశారు

విత్తన డీలర్ల షాపును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నేటి ధాత్రి యాదాద్రి చౌటుప్పల్ :

మండల కేంద్రంలో విత్తన డీలర్ల షాప్ ను గౌరవ కలెక్టర్ జిల్లా శ్రీ హనుమంతు జె డంగే IAS తనిఖీ చేయడం జరిగినది. విత్తన షాప్ కు సంబంధించిన లైసెన్స్ యొక్క గడువు కాలము స్టాక్ బోర్డ్ వివరాలు మరియు విత్తనాల పంపిణీ చేసిన కంపెనీల యొక్క పత్రాలను మరియు ఇన్వాయిస్ బిల్లును పరిశీలించారు. పత్తి విత్తన ప్యాకెట్ల మీద ఉన్న లేబుళ్లను పరిశీలించి సంబంధించిన వివరాలను డీలర్లను అడిగి అ? రైతు విత్తనం కొన్న తర్వాత ఇచ్చే రసీదును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అది కృత విత్తన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు కొన్న తర్వాత తప్పనిసరిగా రైతు సంతకం తో కూడిన రసీదును తీసుకోవాలని ఖాళీ విత్తన ప్యాకెట్లు కూడా సీజన్ అయ్యేంతవరకు భద్రపరుచుకోవాలని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ తరపున నాలుగు స్క్వాడ్ టీం లు ఏర్పాటు చేశామని తనిఖీ బృందాలకు పత్తి విత్తన షాపును పరిశీలించే రిపోర్టర్ అందజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. అలాగే జై కేశారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మూడు రోజులలో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని మొత్తం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి K అనురాధ మాట్లాడుతూ జిల్లాలో పత్తి విత్తనాలు మరియు ఎరువులు అందుబాటులో ఉన్నాయని కృత్రిమ కొరత సృష్టించే వారిపై పిడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ జిల్లా వెంట జిల్లా వ్యవసాయ అధికారి, డివిజన్ వ్యవసాయ అధికారి బి దేవ్ సింగ్, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, AEOలు మరియు విత్తన డీలర్ దాచేపల్లి శ్రీనివాస్, MRIరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంరక్ష హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ధర్నా

నిర్లక్ష్యానికి నిలువుటద్ధం సంరక్ష హాస్పిటల్ అని ఇటీవలే కథనం ప్రచురించిన “నేటిధాత్రి” పత్రిక

హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నేడు నిండు ప్రాణం బలి అయినట్లు బంధువుల నిరసన

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీశారు అంటూ బంధువుల ఆరోపణ

హాస్పిటల్ యాజమాన్యం, ఐ.ఎం.ఏ డాక్టర్లు చర్చల పేరుతో లోపలికి పిలిసి హేళన చేశారని బంధువుల వాదన?

ఏమి చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అని హాస్పిటల్ వర్గాలు అన్నట్లు బంధువుల ఆవేదన

రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు, ససేమిరా ఒప్పుకోని కుటుంబ సభ్యులు

ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు శూన్యం?, పైగా ఇలాంటి హాస్పిటల్స్ కు ఉత్తమ సేవ అవార్డులు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ తూర్పులోని వెంకట్రామా జంక్షన్ వద్ద గల సంరక్ష హాస్పిటల్లో రోజు రోజుకీ మరణాల సంఖ్య పెరుగుతోంది అని అనడానికి నిదర్శనంగా మరోసారి వరంగల్ కు చెందిన వాణి (42) అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లు బంధువులు మహిళ మృతదేహంతో హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే, వరంగల్ నగరానికి చెందిన వాణి (42) అనే మహిళ, గత కొద్ది సంవత్సరాలుగా సంరక్ష హాస్పిటల్లోనే పని చేసేది, మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, వారు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు చేస్తున్నారు, వారి హెల్త్ కార్డు ద్వారా వాల్ల అమ్మకు, నాన్నకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. ఇటీవల ఆమెకు మూత్ర పిండాల సమస్య రావడంతో పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసి, ఆమె పనిచేస్తున్న సంరక్ష హాస్పిటల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా తన కుటుంబం అడ్మిట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కిడ్నీని తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీతో పాటు కిడ్నీకి ఆనుకొని ఉన్న, కొన్ని నరాలు కట్ కావడంతో, మహిళ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిపారు, అస్వస్థతకు గురైన ఆమెను చూసి, ఆమె భర్తకు టెన్షన్ తో గుండెపోటు రావడం జరిగింది అని. వెంటనే అదే హాస్పిటల్లో అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉండటం వల్ల, డాక్టర్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని తెలిపారు. ఒకే హాస్పిటల్లో అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరు అడ్మిట్ అయి ఉండటం వల్ల దుంఖం, ఆందోళనతో ఉన్న ఇద్దరు అమ్మాయిలకు మీ తల్లి ఆరోగ్యం బాలేదు, హైదరాబాద్ తీసుకెళ్లండి అని డాక్టర్లు చెప్పడంతో వారికి అనుమానం వచ్చి ఏమి ట్రీట్మెంట్ చేశారు ఇన్ని రోజులు? 9 లక్షలు ఎందుకు క్లెయిమ్ చేశారు? ఇప్పుడెందుకు హైదరాబాద్ అంటున్నారు అని గట్టిగా నిలదీశారు. మెడికల్ షాపు బిల్లు మూడు లక్షల రూపాయలు వరకు కడితే చాలు మిగతాది మేము ఇన్సూరెన్స్ కార్డు ద్వారా క్లెయిమ్ చేసుకుంటాం అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే బంధువులు, మిత్రులు హాస్పిటల్ కి చేరుకొని ఆందోళన చేశారు. గడచిన 13 రోజుల నుంచి ఏ ట్రీట్మెంట్ చేశారు ఏమో తెలియదు కానీ, రోగి పరిస్థితి అత్యంత ప్రమాదంలోకి వెళ్లడం గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆసుపత్రి డాక్టర్లను యజమాన్యంను నిలదీయగా వారు ఉస్మానియా ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను సైతం పిలిపించి వైద్యం చేయించాం అని తెలిపిన డాక్టర్లు, అయినా కానీ పేషెంట్ కండీషన్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పగానే, పేషెంట్ తరపున బంధువులు అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఆసుపత్రిలో అని ఆందోళన చేసి. ఆసుపత్రి యజమాన్యంను నిలదీయగా వెంటనే స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ రంగప్రవేశం చేసి దాదాపు గంటన్నర అటు బంధువులతో, ఇటు డాక్టర్లతో చర్చించి, జరిగిన సంఘటనపై వివరాలు ఆరా తీసి, జరిగిన తప్పిదాన్ని వైద్యుల నిర్లక్ష్య నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని, వెంటనే వైద్యులను మందలించి పేషంటుకు న్యాయం చేశారని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం తరపున ఇద్దరు డాక్టర్లు మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని తెలిపి, మీకు హైదరాబాద్ లో జరిగే ట్రీట్మెంట్ కి కూడా మేమే డబ్బులు ఇస్తాం అని, పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే అని, పేషెంట్ కి కావాలసిన ట్రీట్మెంట్ మొత్తం ఖర్చులు, ఇన్సూరెన్స్ బాధ్యత హాస్పిటల్ యాజమాన్యమే బాధ్యత అని పేపర్ రాసి, పేషెంట్ ను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి పంపించారు పోలీసులు. అయినా బంధువులు ఆందోళన చేయగా డాక్టర్లు మా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది కాబట్టి మేమే సహాయం చేస్తామంటూ బంధువులకు మాయమాటలు చెప్పి పంపించేశారు అని, హైదరాబాద్ లో అడ్మిట్ చేసినప్పుడు సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం కొంత డబ్బుని యశోద హాస్పిటల్ వారికి కట్టడం జరిగింది అని, మిగతా డబ్బును కట్టే క్రమంలో సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం ద్వారా, మహిళకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్ వారు ఆపేశారని. అందువల్లే మహిళ మృతి చెందింది అని, మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు మృతదేహంతో సంరక్ష హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. వరంగల్ పోలీసులు, ఐఎంఏ డాక్టర్లు వచ్చి, అటు హాస్పిటల్ యాజమాన్యంతో, ఇటు మహిళ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. హాస్పిటల్ యాజమాన్యం, ఐ.ఎం.ఏ డాక్టర్లు చర్చల పేరుతో లోపలికి పిలిసి హేళన చేశారని బంధువుల వాదన?, ఏమి చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అని హాస్పిటల్ వర్గాలు అన్నట్లు బంధువుల ఆవేదన. రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు, ససేమిరా ఒప్పుకోని కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎది ఏమైనా ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు శూన్యం అనే చెప్పొచ్చు. పైగా ఇలాంటి హాస్పిటల్స్ కు ఉత్తమ సేవ పేరిట అవార్డులు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ ఆవిర్భావ సంబరాలతో పాటు సమస్యల పరిష్కారం కై సమరానికి సిద్ధం కావాలి.

మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు

కారేపల్లి నేటి ధాత్రి

దశాబ్దాల పోరాటం వందలాదిమంది త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళి కార్యక్రమంలో పాల్గొంటూనే ప్రజల దైనందిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై సమరానికి తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు స్థానిక కారేపల్లి మండల కేంద్రంలో జరిగిన కారేపల్లి కామేపల్లి సంయుక్త మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ దశాబ్దం కాలం పాటు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం చూపటంలో విఫలం చెందారని అందువల్లే గడిచిన ఎన్నికల్లో కెసిఆర్ ను ప్రజలు బుద్ధి చెప్పారు అలానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తో కాలం గడపకుండా ఇచ్చిన ఆరు హామీలను అమలకు పూనుకోవాలని ఆయన అన్నారు‌. ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరు అందించేందుకు కృషి చేయాలని బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని అలానే ఆంధ్రలో కలిసిన ఆడు పంచాయతీలు తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్న కు కావలసిన అన్ని రకాల సౌకర్యాలని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అధికారులు ప్రయత్నించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ మండల కార్యదర్శిలు గుమ్మడి సందీప్ ఎన్వి రాకేష్ డివిజన్ నాయకులు గుగులోత్ తేజ నాయక్ మండల నాయకులు భాస్కర్ సత్తిరెడ్డి సక్రు బాలు అనసూర్య సరోజినీ రంగ్య రాజు పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సర దినోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోబాబు జగ్జీవన్ రావ్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండవ కళాశాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యవసాయ విద్య అనుభవాలను రాజకీయ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు ప్రస్తుతం తెలంగాణలో నెంబర్ వన్ డైరీ గా కరీంనగర్ డైరీ ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం అని ధైర్యంతో ముందుకు సాగాలని వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కరీంనగర్ డైరీ రైతులకు అన్ని రకాల ఆర్థిక సహాయం అందిస్తూ పశువులకు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పించామని రైతులకు 65 సంవత్సరాలు పైబడిన రైతులకు పెన్షన్ కూడా అందిస్తున్నామని విద్యార్థులు కూడా బాగా చదివి సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు అగ్రికల్చర్ డాక్టర్ సీమ మాట్లాడుతూ కరీంనగర్ డైరీ చైర్మన్ నాగేశ్వరరావు గారిలా విద్యార్థులు ఎదగాలని విద్యార్థుల వ్యవసాయంలో కొత్త సాంకేతిక ఉపయోగించుకొని అధిగమించాలని విద్యార్థులు సహనంతో విజయం సాధించాలని అన్నారు ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డాక్టర్ శ్రీదేవి కళాశాల విషయాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల మేఘ జైన్ సిటీ ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమానికి వెల్కమ్ అడ్రస్ కళాశాల కుమారస్వామి డాక్టర్ చిరంజీవి కార్యక్రమానికి హాజరై న వారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం వివిధ ఆటోలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులందరూ ఆటపాటలతో కార్యక్రమాన్ని హుషారు సందడిగా ముగింప చేశారు

మాదారం లో ఘనంగా యాదవుల గంగమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో కొలువైన గంగమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ వెలవలపల్లి వెంకట సురేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోరిన వారి కొంగుబంగారంగా పూజలు అందుకుంటూ యాదవుల ఇలవేల్పుగా నిలిచిన గంగమ్మ తల్లికి సహస్ర గట్టాభిషేకం మరియు అమ్మవారి కుంకుమ పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి యాదవుల ప్రతి ఇంటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మంద గంపలు సమర్పించారు . ఆలయ ప్రాంగణంలో మందేచు కథలు చెప్పడం జరిగింది . తదుపరి అమ్మవారికి బోనాలు పోతురాజుకు గొర్రెపోతుల నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లి ఆలయ చైర్మన్ జడ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ భాగం రూప మాదారం పెద్దగోల్ల కంచం కోటయ్య సారగొల్ల మర్లపాటి శ్రీను మాదారం యాదవుల సంఘం ద్వారా అధ్యక్షుడు బట్టు సంగయ్య బట్టు నరసయ్య బట్టు వెంకటేశ్వర్లు లింగయ్య నరేష్ ,సంజీవరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు కుల పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు వినతిపత్రం

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరకాల పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ మున్సిపల్ కమిషనర్ నరసింహకు వినతిపత్రం అందజేశారు.మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు గృహ యజమానులు అనుమతులు తీసుకున్న దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, పరకాల మున్సిపల్ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ కు అనుమతులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్,జి త్రీ ప్లస్ ఫోర్ అంతస్తులు నిర్మించడం,రోడ్లపై సెట్ బ్యాక్ కాకుండానే వాటి మెట్లు రోడ్లమీదనే నిర్మాణం చేయడం,వాహనాలకు ప్రజల రాకపోలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులే మామూళ్ల మత్తుకు అలవాటు పడి ఇలాంటి నిర్మాణాలకు అవకాశం ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అక్రమ భవన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.తప్ప వాటి మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్ హెచ్చరించారు.

నేటి తో ముగియనున్న డిగ్రీ అడ్మిషన్ల మొదటి విడత ప్రక్రియ

కొనసాగుతున్న దోస్త్ హెల్ప్లిన్ సేవలు

పరకాల నేటిధాత్రి
డిగ్రీ ఆన్లైన్ సర్విసెస్ తెలంగాణ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరములో అడ్మిషన్ పొందడానికి గడువు జూన్ 01 వ తారీఖు చివరి తేది అని, వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి జూన్ 02 వ తారీఖు చివరి తేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ తెలియజేశారు.మొదటి సంవత్సరములో చేరేందుకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ ఆన్లైన్ చేసుకునే క్రమములో ఏమైన సందేహాలు ఉంటే హెల్ప్లిన్ సెంటర్ లోసంప్రదించగలరని, కళాశాలలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సంతోష్ కోరారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో బి.ఎ (హెచ్.ఇ.సి,బి.కాం. కంఫ్యూటర్స్,బి.యస్.సి డైరీసైన్స్,బి.జడ్.సి,యం.పి.సి, యం.పి.సియస్,కోర్సులలో సీట్లు ఉన్నాయని పరకాల పరిసర ప్రాంత విద్యార్థులు పరకాల ప్రభుత్వాడిగ్రీ కళాశాల లోనే అడ్మిషన్ పొందాలని కోరారు.హెల్ప్లిన్ సెంటర్ అందుబాటులో ఉందని ఏమైన సందేశాలు ఉంటే 9963929565 నెయిర్ కి ఫోన్ చేసి సమాచారం పొందగలరని తెలిపారు.

శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపు

మంగపేట నేటి ధాత్రి

మండలంలోని మల్లూరు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ పరిశీలకులు కవిత, ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి మే 29వ తేదీ వరకు ఏర్పాటు చేసిన 13 హుండీలను స్వామి వారి కల్యాణ మండపంలో లెక్కింపు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల ధ్వారా రూ.11,62,774 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్ వెల్లడించారు. ఈ లెక్కింపులో అమెరికా డాలర్స్ 15, మలేషియా డాలర్స్ 2 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ పరిశీలకులు కవిత, ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ, రాఘవ చార్యులు, ఈశ్వర్ చంద్ శర్మ, పవన్ కుమార్ చార్యులు, ఆలయ సిబ్బంది, నిమ్మల రాజు జానపద కళాకారుల బృందం పాల్గొన్నారు.

జిల్లా సెక్రెటరీగా సత్తి శ్రీనివాస్ రెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన సత్తు శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గా నియమించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కర్గే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తన నియమాకానికి సహాయపడిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తన నియామకానికి కృషిచేసిన నియోజకవర్గపార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నేత శివప్రసాద్ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి గోనె ఎల్లప్ప భరత్ గౌడ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి 

తేదీ 31-05- 2024 ఉదయం ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు కళ్ళను బట్టి అంధుడు అని తెలియుచున్నది రామగుండం – పెద్దంపేట రైల్వే స్టేషన్లు మధ్య బాహుశ ఏదో రైలుబండి నుండి క్రింద పడుట వలన గాని లేదా ఏదైన కారణంగా గాని చనిపోయి ఉండవచ్చును. మృతుని వద్ద ఎలాంటి అడ్రస్ ఆధారాలు లేవు, తెలుపు బ్లూ బూడిద రంగు నిలువు గీతలు గల డిజైన్ ఫుల్ షర్ట్, నలుపు తేదీ 31-05- 2024 ఉదయం ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు కళ్ళను బట్టి అంధుడు అని తెలియుచున్నది రామగుండం – పెద్దంపేట రైల్వే స్టేషన్లు మధ్య బాహుశ ఏదో రైలుబండి నుండి క్రింద పడుట వలన గాని లేదా ఏదైన కారణంగా గాని చనిపోయి ఉండవచ్చును. మృతుని వద్ద ఎలాంటి అడ్రస్ ఆధారాలు లేవు, తెలుపు బ్లూ బూడిద రంగు నిలువు గీతలు గల డిజైన్ ఫుల్ షర్ట్, నలుపు బ్రౌన్ రంగు చెక్స్ డిజైన్ గల ప్యాంట్ ధరించి ఉన్నాడు. శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మార్చురీ లో భద్ర పర్చనైనది. ఇట్టి కేసు జి.తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం దర్యాప్తు చేస్తున్నారు. ఏమైన వివరాలు తెలిసినచో ఫోన్ నెంబరు 9949304574, 8712658604 కి తెలియ పరుచగలరు.బ్రౌన్ రంగు చెక్స్ డిజైన్ గల ప్యాంట్ ధరించి ఉన్నాడు. శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మార్చురీ లో భద్ర పర్చనైనది. ఇట్టి కేసు జి.తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం దర్యాప్తు చేస్తున్నారు. ఏమైన వివరాలు తెలిసినచో ఫోన్ నెంబరు 9949304574, 8712658604 కి తెలియ పరుచగలరు.

విత్తన షాప్ లను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని విత్తనాల డీలర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి గారు శ్రీమతి E. సురేఖ గారు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రైతు వారి విత్తన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరిగింది. రైతులకు తప్పని సరిగా బిల్స్ ఇవ్వాలని, విత్తనాలు MRP కి మించి అమ్మరాదు అని, అన్ని రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ తనిఖీ లో DAO వెంట మండల వ్యవసాయ అధికారి Ch ప్రభాకర్, పాల్గొనడం జరిగింది.

బస్ షెల్టర్ నిర్మించండి

నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన “పోచంమైదాన్ బస్ షెల్టర్”

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

అసంపూర్తిగా మిగిలిన పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం

అధికారుల అలసత్వమా? నాయకుల జోక్యమా?

మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు?

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ పోచంమైదాన్ సెంటర్ రత్న హోటల్ పక్కన ప్రధాన రహదారి పైన ఉన్న బస్ షెల్టర్ ను గత ఏడాది క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా కూల్చి వేసిన అధికారులు. నూతన బస్ షెల్టర్ కొరకు ఇనుప స్థంబాలు పాతి షెల్టర్ నిర్మించడం మర్చిపోయారు అనేది స్థానికుల వాదన. అసలు కారణమేమిటో తెలియదు గానీ వెనుక ఉన్న వ్యాపార సంస్థలకు బస్ షెల్టర్ అడ్డు వస్తుంది అనే సాకుతో వ్యాపారులు తమ పొలిటికల్ పవర్ ద్వారా షెల్టర్ నిర్మాణం మధ్యలోనే ఆపినట్లు తెలుస్తుంది. “బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ గతంలోనే నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన అధికారులు, ఇనుప స్తంభాలు పాతి, పైకప్పు వేయడం మర్చిపోయారా? లేక వ్యాపార సంస్థల ఇబ్బంది వల్ల ఆపారా అనేది ప్రశ్న? షెల్టర్ లేకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు. ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో కూల్చి వేసిన అధికారులు. గత ఏడాది నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని సామాన్య ప్రజల కోరిక. ఈ విషయమై కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

గండ్ర యువసేన రామప్ప గుడిలో పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వరాజు పల్లి గ్రామానికి చెందిన గండ్ర యువసేన హనుమాన్ మాల దీక్ష లో భాగంగా పాలంపేటలో రామప్ప గుడి శివాలయంలో అర్చకులతో గండ్ర యువసేన 11 రోజుల హనుమాన్ దీక్షను పురస్కరించుకొని చివరి పూజ రామప్ప గుడిలో ఘనంగా పూజలను జరుపుకొని జూన్ ఒకటో తారీకు రోజు హనుమాన్ విరమాలకు సిద్ధమవుతున్న హనుమాన్ మాల ధారణ సాములు మిట్టపల్లి అరవింద స్వామి అఖిల్ స్వామి మహేందర్ స్వామి అశోక్ స్వామి పాల్గొన్నారు

శ్రీ సాయి మందిరానికి రెండు లక్షల విరాళం

భద్రాచలం నేటి ధాత్రి

జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందినది.
భద్రాచలం వాస్తవ్యులు పద్మ క్లాత్ స్టోర్స్ గొండేల రత్నకుమారి w/o లేటు గోండెల వెంకటేశ్వరరావు పేరు మీదుగా వారి మనుమడు, కోడలు కలిసి

శ్రీ సాయిబాబా వారికి చేయించనున్న స్వర్ణ సింహాసనమునకు (బంగారు పూతతో ) రెండు లక్షల విరాళమును ఆలయ అధ్యక్షులు, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కుంచాల రమేష్ లకు అందజేశారు. అనంతరం దాతలను శాలువాతో సత్కరించి బాబా వారి మేమెంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు మందరపు నాగరాజు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఇప్పటికే మన చరిత్ర మరుగున పడుతుంది అనే దానిని ఇంకా కనుమరుగు చేయాలి అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదు..
గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఖ్యాతిని ఖండంతరాలు దాటించారు.. ఇలాంటి చరిత్ర ఆనవాలను తుడిచివేయాలనేది మంచిది కాదు…

కాకతీయులు అనుసరించిన పాలన విధానం గొలుసుకట్టు చెరువులు , ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించడం , వారు గ్రామాలలో అభివృద్ధి చేసి వ్యవసాయ విధానం పైనా వారు అందించిన సుపరిపాలన ఆదర్శనీయం
ప్రపంచ దేశాలు తమ యొక్క చరిత్రని వెలికితీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మనం మాత్రం ఉన్న చరిత్రని కనపడకుండా చేస్తున్నాం
మన కాకతీయ చరిత్ర గురించి ఇతర రాష్ట్రాలు , ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటుంటే మనం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు
ఇటలీ యాత్రికుడు అయిన మార్కోపోలో మన కాకతీయ పాలన గురించి తన గ్రంథంలో పొందుపరిచిన చరిత్ర మనది అలాంటి చరిత్రని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయడం చాల బాధాకరం
ఇది ఓరుగల్లు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లోగో మార్పు చేయడం తెలంగాణ ఉద్యమనేతగా ఖండిస్తున్నాను ఇది చాలా బాధాకరం….
ఈ విధమైన ఆత్మగౌరవానికి సంబంధించిన అనైతిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ.. ఖండిస్తున్నాను..

error: Content is protected !!
Exit mobile version