పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరకాల పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ మున్సిపల్ కమిషనర్ నరసింహకు వినతిపత్రం అందజేశారు.మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు గృహ యజమానులు అనుమతులు తీసుకున్న దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, పరకాల మున్సిపల్ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ కు అనుమతులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్,జి త్రీ ప్లస్ ఫోర్ అంతస్తులు నిర్మించడం,రోడ్లపై సెట్ బ్యాక్ కాకుండానే వాటి మెట్లు రోడ్లమీదనే నిర్మాణం చేయడం,వాహనాలకు ప్రజల రాకపోలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులే మామూళ్ల మత్తుకు అలవాటు పడి ఇలాంటి నిర్మాణాలకు అవకాశం ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అక్రమ భవన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.తప్ప వాటి మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్ హెచ్చరించారు.
