రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి 

తేదీ 31-05- 2024 ఉదయం ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు కళ్ళను బట్టి అంధుడు అని తెలియుచున్నది రామగుండం – పెద్దంపేట రైల్వే స్టేషన్లు మధ్య బాహుశ ఏదో రైలుబండి నుండి క్రింద పడుట వలన గాని లేదా ఏదైన కారణంగా గాని చనిపోయి ఉండవచ్చును. మృతుని వద్ద ఎలాంటి అడ్రస్ ఆధారాలు లేవు, తెలుపు బ్లూ బూడిద రంగు నిలువు గీతలు గల డిజైన్ ఫుల్ షర్ట్, నలుపు తేదీ 31-05- 2024 ఉదయం ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు కళ్ళను బట్టి అంధుడు అని తెలియుచున్నది రామగుండం – పెద్దంపేట రైల్వే స్టేషన్లు మధ్య బాహుశ ఏదో రైలుబండి నుండి క్రింద పడుట వలన గాని లేదా ఏదైన కారణంగా గాని చనిపోయి ఉండవచ్చును. మృతుని వద్ద ఎలాంటి అడ్రస్ ఆధారాలు లేవు, తెలుపు బ్లూ బూడిద రంగు నిలువు గీతలు గల డిజైన్ ఫుల్ షర్ట్, నలుపు బ్రౌన్ రంగు చెక్స్ డిజైన్ గల ప్యాంట్ ధరించి ఉన్నాడు. శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మార్చురీ లో భద్ర పర్చనైనది. ఇట్టి కేసు జి.తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం దర్యాప్తు చేస్తున్నారు. ఏమైన వివరాలు తెలిసినచో ఫోన్ నెంబరు 9949304574, 8712658604 కి తెలియ పరుచగలరు.బ్రౌన్ రంగు చెక్స్ డిజైన్ గల ప్యాంట్ ధరించి ఉన్నాడు. శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి మార్చురీ లో భద్ర పర్చనైనది. ఇట్టి కేసు జి.తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం దర్యాప్తు చేస్తున్నారు. ఏమైన వివరాలు తెలిసినచో ఫోన్ నెంబరు 9949304574, 8712658604 కి తెలియ పరుచగలరు.

విత్తన షాప్ లను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని విత్తనాల డీలర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి గారు శ్రీమతి E. సురేఖ గారు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రైతు వారి విత్తన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరిగింది. రైతులకు తప్పని సరిగా బిల్స్ ఇవ్వాలని, విత్తనాలు MRP కి మించి అమ్మరాదు అని, అన్ని రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ తనిఖీ లో DAO వెంట మండల వ్యవసాయ అధికారి Ch ప్రభాకర్, పాల్గొనడం జరిగింది.

బస్ షెల్టర్ నిర్మించండి

నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన “పోచంమైదాన్ బస్ షెల్టర్”

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

అసంపూర్తిగా మిగిలిన పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం

అధికారుల అలసత్వమా? నాయకుల జోక్యమా?

మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు?

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

వరంగల్ పోచంమైదాన్ సెంటర్ రత్న హోటల్ పక్కన ప్రధాన రహదారి పైన ఉన్న బస్ షెల్టర్ ను గత ఏడాది క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా కూల్చి వేసిన అధికారులు. నూతన బస్ షెల్టర్ కొరకు ఇనుప స్థంబాలు పాతి షెల్టర్ నిర్మించడం మర్చిపోయారు అనేది స్థానికుల వాదన. అసలు కారణమేమిటో తెలియదు గానీ వెనుక ఉన్న వ్యాపార సంస్థలకు బస్ షెల్టర్ అడ్డు వస్తుంది అనే సాకుతో వ్యాపారులు తమ పొలిటికల్ పవర్ ద్వారా షెల్టర్ నిర్మాణం మధ్యలోనే ఆపినట్లు తెలుస్తుంది. “బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ గతంలోనే నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన అధికారులు, ఇనుప స్తంభాలు పాతి, పైకప్పు వేయడం మర్చిపోయారా? లేక వ్యాపార సంస్థల ఇబ్బంది వల్ల ఆపారా అనేది ప్రశ్న? షెల్టర్ లేకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు. ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో కూల్చి వేసిన అధికారులు. గత ఏడాది నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని సామాన్య ప్రజల కోరిక. ఈ విషయమై కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

గండ్ర యువసేన రామప్ప గుడిలో పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వరాజు పల్లి గ్రామానికి చెందిన గండ్ర యువసేన హనుమాన్ మాల దీక్ష లో భాగంగా పాలంపేటలో రామప్ప గుడి శివాలయంలో అర్చకులతో గండ్ర యువసేన 11 రోజుల హనుమాన్ దీక్షను పురస్కరించుకొని చివరి పూజ రామప్ప గుడిలో ఘనంగా పూజలను జరుపుకొని జూన్ ఒకటో తారీకు రోజు హనుమాన్ విరమాలకు సిద్ధమవుతున్న హనుమాన్ మాల ధారణ సాములు మిట్టపల్లి అరవింద స్వామి అఖిల్ స్వామి మహేందర్ స్వామి అశోక్ స్వామి పాల్గొన్నారు

శ్రీ సాయి మందిరానికి రెండు లక్షల విరాళం

భద్రాచలం నేటి ధాత్రి

జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందినది.
భద్రాచలం వాస్తవ్యులు పద్మ క్లాత్ స్టోర్స్ గొండేల రత్నకుమారి w/o లేటు గోండెల వెంకటేశ్వరరావు పేరు మీదుగా వారి మనుమడు, కోడలు కలిసి

శ్రీ సాయిబాబా వారికి చేయించనున్న స్వర్ణ సింహాసనమునకు (బంగారు పూతతో ) రెండు లక్షల విరాళమును ఆలయ అధ్యక్షులు, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కుంచాల రమేష్ లకు అందజేశారు. అనంతరం దాతలను శాలువాతో సత్కరించి బాబా వారి మేమెంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు మందరపు నాగరాజు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఇప్పటికే మన చరిత్ర మరుగున పడుతుంది అనే దానిని ఇంకా కనుమరుగు చేయాలి అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదు..
గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఖ్యాతిని ఖండంతరాలు దాటించారు.. ఇలాంటి చరిత్ర ఆనవాలను తుడిచివేయాలనేది మంచిది కాదు…

కాకతీయులు అనుసరించిన పాలన విధానం గొలుసుకట్టు చెరువులు , ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించడం , వారు గ్రామాలలో అభివృద్ధి చేసి వ్యవసాయ విధానం పైనా వారు అందించిన సుపరిపాలన ఆదర్శనీయం
ప్రపంచ దేశాలు తమ యొక్క చరిత్రని వెలికితీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మనం మాత్రం ఉన్న చరిత్రని కనపడకుండా చేస్తున్నాం
మన కాకతీయ చరిత్ర గురించి ఇతర రాష్ట్రాలు , ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటుంటే మనం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు
ఇటలీ యాత్రికుడు అయిన మార్కోపోలో మన కాకతీయ పాలన గురించి తన గ్రంథంలో పొందుపరిచిన చరిత్ర మనది అలాంటి చరిత్రని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయడం చాల బాధాకరం
ఇది ఓరుగల్లు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లోగో మార్పు చేయడం తెలంగాణ ఉద్యమనేతగా ఖండిస్తున్నాను ఇది చాలా బాధాకరం….
ఈ విధమైన ఆత్మగౌరవానికి సంబంధించిన అనైతిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ.. ఖండిస్తున్నాను..

ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరణ

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం నియోజకవర్గం.
భద్రాచలంలో జీవిత బీమా సంస్థకు నూతన బ్రాంచ్ మేనేజర్ గా శుక్రవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మేనేజర్ చక్రవర్తి .కి LIAFI–1964 శాలువా. పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది
ఈ సందర్భంగా ఏజెంట్లను ఉద్దేశించి మేనేజర్ మాట్లాడుతూ. తగిన సూచనలు సలహాలు ఇస్తూ అందరు సహకారంతో బ్రాంచ్ మొదటి స్థానంలో ఉంచుటకు నా వంతు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు. పరిమి శ్రీనివాసరావు. గాదే వెంకటరెడ్డి . సీనియర్ ఏజెంట్ గోపాలరాజు అధ్యక్షులు.బి.ఎం.వి ఆర్ ఎస్ వర్మ .సెక్రటరీ. ఎం నరసింహ రావు. ఓ కృష్ణార్జున రావు. కోశాధికారి. సాయి. కె సురేష్. పి. ఉపేంద్ర. పూస సాయిబాబు. స్వతంత్ర రెడ్డి. కాశీ విశ్వనాథ్. వంశీ సాయి .బాలచందర్ రెడ్డి. ఎస్కే పాషా. రాజేశ్వరి. నరేందర్ రెడ్డి. రాములు. ఖగేంద్ర రెడ్డి. వై గణపతి. సిహెచ్ వెంకన్న.
తదితరులు పాల్గొన్నారు

ఫర్టీలైజర్ దుకాణలలో తనిఖీలు

కొత్తగూడ, నేటిధాత్రి

మహబుబాబాద్ జిల్లా :కొత్తగూడ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపు లపై పోలీసుల తనిఖీలు చేసిన ఎస్సై దిలీప్ నిర్వహించరు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బిల్లులు లేకుండా రైతులకు విత్తనాలు మందులు ఇవ్వకూడదు అలాగే మందులు విక్రయించే ముందు వారు నిజంగా వ్యవసాయం చేస్తున్నారా లేదా అని తెలుసుకొని విక్రయంచాలని
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలని రైతులకు కౌన్సిలింగ్ చేస్తున్న ఎస్ఐ దిలీప్

జవాబు పత్రాలు అమ్ముకుంటున్న వారి పైన చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్

కాకతీయ యూనివర్సిటీలో జవాబు పత్రాలు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న వారి పైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జవాబు పత్రాలు అమ్ముకుంటున్న వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా పరీక్షల జవాబు పత్రాలు అమ్ముకుంటూ యూనివర్సిటీ పరువు తీస్తున్న కాకతీయ యూనివర్సిటీ దినసరి కూలీల పైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తుంటే కొంతమంది విద్యార్థులు అడ్డదారిగా పాస్ కావాలని చూస్తున్నా వారికి దినసరి కూలీలు డబ్బుల కోసం జవాబు పత్రాలు అమ్ముకుంటూ నిజాయితీగల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం జరిగిందని ఒక జవాబు పత్రం ఐదు వేయిల రూపాయలకు అమ్ముకోవడంతో నిజాయితీగల విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు ఇన్చార్జి విసి మరియు రిజిస్ట్రార్ స్పందించి జవాబు పత్రం నమ్ముకున్న వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థులు న్యాయం చేయాలని అన్నారు లేనియెడల యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుద్దామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ కేయూ ఇన్చార్జి మచ్చ పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ అధ్యక్షులు దూడపాక నరేందర్ ప్రధాన కార్యదర్శి బండారి పృథ్వీరాజ్ ప్రదీప్ రత్నాకర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

రైతులకు అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వేములవాడలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

వేములవాడ నేటిధాత్రి

జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత విత్తన, ఎరువుల దుకాణ దారులు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం వేములవాడ టౌన్ లో గల మన గ్రోమోర్ సెంటర్, శ్రీ లక్ష్మి ఎరువుల విత్తనాలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విక్రయాల నిర్వహణను, రిజిస్టర్ లను ,స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు.

వానాకాలం 2024 పంటలకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే స్టాక్ పెట్టుకుని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నదని, మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేర ఎరువుల నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.

దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదనీ, అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపోయే పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తే PD చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఓ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

మహా అన్నదాన కార్యక్రమాని హనుమాన్ మాల సాములు విజయవంతం చేయాలి

అన్నదాత బోనాల రాజమౌళి దంపతులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యుల తో బోనాల రాజమౌళి దంపతులు హనుమాన్ విగ్రహానికి చందనంతో జిల్లేడు మాలతో తమలపాకుల పండ్లు తో కలిపి పూజ కార్యక్రమం జరిపిన తర్వాత గుడి ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత బోనాల రాజమౌళి ఉమారాణి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మహా అన్నదాన కార్యక్రమానికి హనుమాన్ స్వాములు గ్రామం లోని ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు

ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రజలు వినియోగించుకోండి

ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం నరసింహ పల్లె గ్రామంలో లయన్స్ క్లబ్ వారిచే మారి ప్రాజెక్ట్ ఎఫ్.పిసిఎల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గ్రామ కార్యదర్శి తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభం అయింది ఉచిత కంటి వైద్య శిబిరంలో 81 మంది కంటి పరీక్షలు చేయగా ఇందులో కంటి సమస్యలకు బాధపడుతున్న వారిని 18 మందిని గుర్తించారు ఉచిత కంటి ఆపరేషన్ లయన్స్ క్లబ్ వారు అందిస్తున్న సేవలకు గ్రామ ప్రజలు అభినందించారు. ప్రజ్వల్ ఎఫ్ పి సీ ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్స చేయించుకోవాలన్నారు ఇందులో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని అందివచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాల న్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్ గుంటోజు వెంకన్న, ఆప్తమిక్ రాజేష్, గ్రామ రైతులు లడే సాంబయ్య, రాజయ్య, సునీత, వీరమనీ గడ్డి సాంబయ్య, ప్రతాప్, రాజిరెడ్డి,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ ఎస్ టి పి పి సందర్శించిన సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. బలరాం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఎస్ టి పి పి ని సందర్శించిన సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. బలరాం వారు మాట్లాడుతూ ప్లాంట్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహించి ఇటీవల కాలంలో స్వర్గస్తులైన కిరీటి ఆత్మకు శాంతిని కోరుతూ సంతాపాన్ని తెలిపారు. ఎస్ టి పి పి అధికారులు అందరితో నిర్వహించిన సమావేశంలో అధికారుల యొక్క మానసిక ప్రశాంతత తోటి వారితో సత్సoబంధాలు మరియు పరస్పర సహకారం అత్యంత అవసరమని తద్వారా ఎస్ టిపిపి యొక్క పురోగతికి దోహదం చేసిన వారు అవుతారని తెలిపారు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా చర్చించి పరిష్కారం కొరకు ప్రయత్నించాలని కోరుతున్నారు. దానికి వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. విలువైన ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యుల వ్యథకి కారణమవ్వడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని అందరూ ఎటువంటి పరిస్థితులలో అయినా దృఢ చిత్తాన్ని అలవర్చుకోవాలని కోరారు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి శివ సాయి కృష్ణ రెడ్డి

కాటారం నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కాటారం మండలం దామరకుంట గ్రామంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి శివ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామరకుంట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో అభిమాన సంపాదించుకున్న నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని కొనియాడారు. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో జీవించాలని శివ సాయి కృష్ణారెడ్డి కోరారు. రానున్న రోజులలో పార్టీలో ఉన్నత పదవులు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ముద్దం బాపు యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల చంద్రశేఖర్, రామగుండం శ్రీనివాసచారి, మాజీ వార్డ్ మెంబర్లు కోడి ప్రవీణ్, ఇండ్ల సందీప్, బాసాని రాజస్వామి, బండం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య

నర్సంపేట,నేటిధాత్రి :

ఎండలో ఆడుతుండగా తల్లి మందలించిందని క్షీణికావేశానికి గురై ఒక బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని మైసంపల్లె గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు,దుగ్గొండి ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం మైసంపల్లె గ్రామానికి చెందిన మోకిడే శాంత చిన్న కుమారుడు మోకిడే సిద్దు (కాంతారావు) 9 సం. తో పాటు మరో 15 సంవత్సరాల వయసుగల కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు 10వ తరగతి కోచింగ్ కోసం పాఠశాలకు వెళ్లాడు.చిన్న కుమారుడు సిద్దు మూడవ తరగతి చదువుతూ వేసవి సెలవుల సందర్భంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. గత వారం రోజులుగా విపరీతమైన ఎండలు ఉండడంతో బయటకు వెళ్ళద్దని తల్లి మందలించింది.క్షిణికావేశానికి గురైన సిద్దు గురువారం ఇంట్లో ఉన్న తల్లి స్లాబ్ పై ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్ళగా ఇంట్లోని ఫ్యాను కొండికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదురుగా ఉన్న ఇంటివాళ్లు గమనించి అరుపులు వేస్తూ సిద్ధుని బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. మేనమామ డోలే యువరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.

ఐ టి శాఖ మంత్రి జన్మదిన సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలు చేసిన పాస్టర్స్

మంథని :- నేటి ధాత్రి

ఐటీ,భారీ పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు ఆధ్వర్యంలో లివింగ్ వాటర్ చర్చ్ లో నిర్వహించారు మంథని డివిజన్ పాస్టర్స్ వారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి కేక్ కట్ చేసి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో డాక్టర్ రెవ ఎలీషా పాస్టర్స్ డేవిడ్ ఆశోక్ కిరణ్ సమూయేలు శుభాకర్ బెంజిమెన్ రమాకాంత్ సతీష్ లు పాల్గొన్నారు..

ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు

ఎల్తూరి సాయికుమార్ స్వేరో

హన్మకొండ, నేటిధాత్రి:

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్న గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ ను గూండాలు గా తయారు చేస్తున్నాడని అనడంతో ఈరోజు మొదటి గేటు వద్ద కే నాగరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరియు కే నాగరాజు వెంటనే ఆర్ఎస్పీకి క్షమాపణ చెప్పి వారు వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని మరియు వరంగల్ జిల్లాలో అడుగడుగునా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ గా తీర్చిదిద్దిన యువకులు ఎంతోమంది ప్రపంచనికే దిక్సూచి ఇలా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సాత్విక్, సాయి, రత్నాకర్, నరేష్ మరియు హర్షవర్ధన్ జరిగింది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఐ టి శాఖ మంత్రి జన్మదిన సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఐటీ,భారీ పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ముత్తారం మండల కేంద్రంలోని హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ లకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబురాల చేసుకుంటూ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు ముత్తారం మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు..

అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీ ప్రభుత్వం లో మీరు చేసిన ఘనకార్యాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి: శైడి సతీష్ రెడ్డి

కూకట్పల్లి, మే 30 న్యూస్ నేస్తం ప్రతినిధి

అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీ ప్రభుత్వం లో మీరు చేసిన ఘనకార్యాలు గుర్తు తెచ్చుకోండి కవితమ్మ బతుకమ్మ పాటలు ఏ ఆర్ రెహమాన్ పాడిస్తే అది ఆంధ్రుడు కాదా చిన్న జీయర్ స్వామి ట్రస్టుకు ఎక రానికి 12 కోట్ల విలువగల భూమిని 16 లక్షలకు కట్టబెట్టినారు వారు ఆంధ్ర ఆయన వారు కాదా కాలేశ్వరం ప్రాజెక్టు
ను లక్షల కోట్ల విలువ గల కాంట్రాక్టును మేఘ కృష్ణా రెడ్డికి ఇచ్చి నారు వారు ఆంధ్ర ఆయన కాదా… యాదగిరిగుట్ట డిజైను ఆనంద్ సాయికి ఇచ్చినారు వారు ఆంధ్ర ఆయన కాదా హీరోయిన్ సమంతకి మన బ్రాండ్ అంబాసిడర్ చేసినారు కోట్ల రూపాయలు ఇచ్చినా
వార ఆంధ్రమే కాదా ? 6.శారదా పీఠా
నికి రెండు కోట్ల విలువ గల చేసే భూమి
ని ఒక రూపాయి కట్టబెట్టింది మీరు వారు ఆంధ్ర కాదా.తెలంగాణకు చెందిన గాయ కుడు అందెశ్రీ పాడిన గేయానికి సంగీతం ఆస్కార్ అవార్డు కీరవాణి అందిస్తే తప్పిం ది గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించ కపో వడం మీకు సిగ్గుచేటు దాన్ని రాష్ట్ర గీతంగా ప్రజాపాలనలో భాగంగా కాం
గ్రెస్ పార్టీ గుర్తించి తీసుకోవడం ద్వారా ఆమోదిం చవలసిన విషయం దానికి గగ్గోలు పెట్టడం మీకు సిగ్గుగా లేదా రాజముద్రలో అమరవీరు స్తూపం ఉంటే తప్పేంది ?…అమరవీరుల త్యాగాల ఫలితం రాష్ట్రం వచ్చింది.

రంగ రంగ వైభవంగా వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం.

భక్తులకు అన్నదానం.

రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-

కోర్కెలు తీర్చే స్వామిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం రంగ రంగ వైభవంగా జరిగింది. రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆలయ అర్చకులు అనిల్ బాబు నేపథ్యంలో పూజారులు వేదమంత్రాల తో కళ్యాణాన్ని జరిపారు. కల్యాణ వేడుకలు గ్రామస్తులతోపాటు వివిధ గ్రామాల చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి ఎంతో వితిష్టత ఉన్నది ,ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కల్యాణ సందర్భంగా అశేష భక్త జనం హాజరై స్వామి వారి కళ్యాణన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోపాల బాబు,మాజీ సర్పంచులు సుల్తాన్ నరసింహారెడ్డి, వల్లాల అశోక్, వల్లాల ఉపేందర్, పెంట సుమన్, ఉపేందర్. తాటికొండ వెంకటేష్ యాదవ్, కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version