మంగపేట నేటి ధాత్రి
మండలంలోని మల్లూరు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ పరిశీలకులు కవిత, ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి మే 29వ తేదీ వరకు ఏర్పాటు చేసిన 13 హుండీలను స్వామి వారి కల్యాణ మండపంలో లెక్కింపు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల ధ్వారా రూ.11,62,774 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్ వెల్లడించారు. ఈ లెక్కింపులో అమెరికా డాలర్స్ 15, మలేషియా డాలర్స్ 2 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మహబూబాబాద్ డివిజన్ పరిశీలకులు కవిత, ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ, రాఘవ చార్యులు, ఈశ్వర్ చంద్ శర్మ, పవన్ కుమార్ చార్యులు, ఆలయ సిబ్బంది, నిమ్మల రాజు జానపద కళాకారుల బృందం పాల్గొన్నారు.