నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన “పోచంమైదాన్ బస్ షెల్టర్”
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
అసంపూర్తిగా మిగిలిన పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం
అధికారుల అలసత్వమా? నాయకుల జోక్యమా?
మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు?
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ పోచంమైదాన్ సెంటర్ రత్న హోటల్ పక్కన ప్రధాన రహదారి పైన ఉన్న బస్ షెల్టర్ ను గత ఏడాది క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా కూల్చి వేసిన అధికారులు. నూతన బస్ షెల్టర్ కొరకు ఇనుప స్థంబాలు పాతి షెల్టర్ నిర్మించడం మర్చిపోయారు అనేది స్థానికుల వాదన. అసలు కారణమేమిటో తెలియదు గానీ వెనుక ఉన్న వ్యాపార సంస్థలకు బస్ షెల్టర్ అడ్డు వస్తుంది అనే సాకుతో వ్యాపారులు తమ పొలిటికల్ పవర్ ద్వారా షెల్టర్ నిర్మాణం మధ్యలోనే ఆపినట్లు తెలుస్తుంది. “బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ గతంలోనే నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన అధికారులు, ఇనుప స్తంభాలు పాతి, పైకప్పు వేయడం మర్చిపోయారా? లేక వ్యాపార సంస్థల ఇబ్బంది వల్ల ఆపారా అనేది ప్రశ్న? షెల్టర్ లేకపోవడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు. ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో కూల్చి వేసిన అధికారులు. గత ఏడాది నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని సామాన్య ప్రజల కోరిక. ఈ విషయమై కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.