
భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాలు చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ,…