
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున బతుకమ్మ వేడుకలను శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల తల్లులు ప్రతి ఒక్కరు బతుకమ్మను తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ అధ్యక్షురాలు వేముల ప్రభావతి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మని, తెలంగాణ ఆడబిడ్డల పండుగని అన్నారు….