అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన మానసిక వికలాంగుడు రహీమ్, రెహమాన్ ల ఆర్థిక పరిస్థితి బాగోలేక తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు వారిని పరామర్శించి 25కిలోల బియ్యం, నెల సరిపడా నిత్యావసరాలను ముచ్చింతల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అందించిన అమ్మచారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్, ఇరుగు ఎల్లేష్, జీడి యశ్వంత్ పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్

లక్షెట్టిపేట మండలం: మంచిర్యాల జిల్లా:నేటి దాత్రి: తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్ ను మంగళవారం లక్షెట్టిపేట రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. నామమాత్రం ఫీజుతో ఆరు రోజులు చికిత్స నిర్వహిస్తామని థెరపిస్ట్ మలాం సింగ్. జేపీ గోస్వామిలు తెలిపారు. ఈ క్యాంపులో అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, అసిడిటీ, మెడనొప్పి కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పి, కంటి సమస్యలు ,గుండె సమస్యలు థైరాయిడ్, చెవి, ముక్కు సంబంధిత వ్యాధుల…

Read More

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు జిల్లా సమీకృత కార్యాలయ భవనము సమావేశ మందిరం లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పీ పుల కరుణాకర్ లతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్…

Read More

గుండాలలో పోలీస్ చెక్ పోస్ట్ ప్రారంభం

  గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విధంగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎస్పి వినీత్ జి ఐ పి ఎస్ ఆదేశాల మేరకు డిఎస్పి రమణమూర్తి సూచనల మేరకు గుండాల మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు చేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా అనుమానితంగా అక్రమ డబ్బు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ…

Read More

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోమన్న

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండలం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న పెనుగొండ సోమన్నకు 2022-23 విద్యా సంవత్సరంకు గాను పాఠశాల విద్యకు విశేష కృషి చేసి, పాఠశాల విద్యార్థులు సుమారు 100 మంది చేరేలా చూసాడు. పక్క గ్రామాలు అయిన విస్నూర్, వడ్డెర కాలనీ, చీమలాభాయ్ తండా, కుంతవత్తు తండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బడికి రావడానికి రవాణా సౌకర్యం కల్పించి దాతల సహకారం తో వాహనం ఏర్పాటు చేసి పిల్లలు ప్రైవేట్…

Read More

ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గుడాడ్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ గండ్ర జ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య విద్య సాగర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.గతంలో ఉండే పాలనకు,నేడు కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఆలోచించాలి.ఎన్నో పోరాటాల నడుమ ప్రత్యేక…

Read More

టీచర్స్ కాలనీకి సి సిరోడ్డు వేయాలి

#నెక్కొండ, నేటి ధాత్రి : నెక్కొండ గ్రామపంచాయతీ లోని 14 వ వార్డులోని సూర్య థియేటర్ వెనుక టీచర్స్ కాలనీ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు జరిగినది దాని పక్కన బీసీ కాలనీ కూడా ఏర్పాటు జరిగినది ఈ రెండు కాలనీలకు నెక్కొండ సూర్య థియేటర్ పక్కన నుండి 21 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దారికి సిసి రోడ్డు వేయాలని అట్టి రోడ్డును కొందరు ప్రైవేటు వ్యక్తులు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు కావున…

Read More

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని సర్ధార్ పాపన్న గౌడ్ సెంటర్ లో బడుగు బలహీన వర్గాల చక్రవర్తి, విప్లవ వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని…

Read More

*అధికారులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి నిజాయితీతో భేదాభావం లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఐ.డి.ఓ.సి ప్రజావాణి హాల్లో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సర్విలియన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారుఅక్టోబర్9 మధ్యాహ్నం నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున వనపర్తి నియోజకవర్గంలో సైతం నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు అధికారులకు మోడల్ కోడ్…

Read More

కేకే ఓసిపిని సందర్శించిన సంస్థ డైరెక్టర్

  మందమర్రి, నేటిధాత్రి:- ఏరియాలోని కేకే ఓసిపిని ఏరియా జిఎం ఏ మనోహర్ తో కలిసి మంగళవారం సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓసిపి కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓసిపి లోని యంత్రాల పనితీరును మెరుగుపరిచి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అందరు కలిసి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా,…

Read More

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

  నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం మంగళవారం మండలంలోని వరంగల్ రోడ్డు మరియు చెన్నారావుపేట రోడ్డు ల పై నెక్కొండ ఎస్సై జానీ పాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

శాయంపేట నేటి ధాత్రి:  శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా ప్రతినిధి శాయంపేట ఏ కృష్ణమూర్తి, ఎస్సై దేవేందర్, ఎంపీఓ రంజిత్, ఏఆర్ఐ హుస్సేన్, బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులు అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరైనారు. అవగాహన సమావేశం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అందుకు…

Read More

సింగరేణి కార్మికుల జనరల్ బాడీ సమావేశం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి డివిజన్ జనరల్ బాడీ సమావేశం చంద్రగిరి శంకర్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది ఈ యొక్క జనరల్ బాడీకి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో 2222 కోట్ల రూపాయలు లాభాలు రావడం జరిగినది దీనికిగాను యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 711 కోట్ల రూపాయలు బోనస్ గా ఇవ్వనున్నది ఈ…

Read More

మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలి

మందమర్రి, నేటిధాత్రి:- సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పదేపదే గొడవలు, అతిగా మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం, ఒంటరితనం, విచిత్రమైన ఆలోచనలు, నిద్రలేమి, తనపై చేతబడి చేస్తున్నారని, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని భయపడటం, ఎవరితోనూ కలవకపోవడం, తనలో తాను మాట్లాడడం, జంతువులను చూసి భయపడడం,…

Read More

ఎమ్మెల్సీ పల్లాను కలిసిన మాజీ సర్పంచి శ్రీనివాస్

  చేర్యాల నేటిధాత్రి… పట్టా బద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసి డైరెక్టర్ వల్లూరు శ్రీనివాస్ హైదరాబాదులోని పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని…

Read More

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం .. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్ అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం…

Read More

విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ 28 సంవత్సరాలు గత వారం రోజుల క్రితం విద్యుత్ ఖాగాతానికి గురై మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రోజు ఉదయం మరణించడం జరిగిన విషయం తెలుసుకొని రమేష్ పార్దివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్…

Read More

అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో చేరి 190/240మస్టర్లు పూర్తి చేసిన కార్మికులు 25వేల రూపాయలు దసరా అడ్వాన్స్ చెల్లిస్తుండగా, నూతనంగా సంస్థలో చేరిన కార్మికులకు 12,500 రూపాయలను అక్టోబర్ 18న కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ అడ్వాన్స్ ను నవంబర్ నెల వేతనం నుండి 10నెలలు సులభ వాయిదాలలో…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

  మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన కొల్లూరి నాగయ్య(68) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈకార్యక్రమంలోఅభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కేసీఆర్ సేవదల్ మండల్ అధ్యక్షు సున్నపు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి,…

Read More

ఆశా వర్కర్ల సమ్మెను స్పందించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

> తెలంగాణలో తాత్కాలికంగా ఆశా వర్కర్ల సమ్మె వాయిదా. > ఆశా వర్కర్ల 18 డిమాండ్లను కమిటీ వేసి పరిష్కరిస్తాం. > హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని హెల్త్ డైరెక్టర్ హామీ ప్రకారం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మంగళవారం రోజు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు…

Read More
error: Content is protected !!