ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ జెండా ఎగరవేసిన డాక్టర్ అఖిల.

చిట్యాల,నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటలో డ్యూటీ డాక్టర్ అఖిల జాతీయ జెండాను ఎగురవేశారు ,ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

అపరాధ రుసుంతో అడ్మిషన్స్ లోకి చివరి తేదీ 30 సెప్టెంబర్ – కె.దేవానంద్ కరెస్పాండంట్

చోప్పదండి, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ఎక్సలెంట్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ అపరాధ రుసుంతో అడ్మిషన్స్ జరుగుచున్నవి అని స్కూల్ కరెస్పాండంట్ కే.దేవానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ చదవలేకపోయామని బాధపడుతున్న వారికీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రవేశల కోసం అదనపు రుసుముతో అడ్మిషన్లు ఈనెల 30 వరకు జరుగుచున్నాయని తెలిపారు. ఈకార్యక్రమం చదువుకునే…

Read More

ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి: హైదరాబాదులోని గాంధీభవన్లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు…

Read More

వరంగల్ ఓ సిటీ గ్రౌండ్లో ప్రజా పాలన వేడుకలు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ ఓ సిటీ ఎదురుగా గల నూతన కలెక్టరేట్ నిర్మాణ మైదానంలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి…

Read More

అమర వీరులకు నివాళులు అర్పించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఖిలా వరంగల్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More

అమరవీరులకి నివాళులర్పించిన న్యూ లయోలా హై స్కూల్ కరస్పాండెంట్

హనుమకొండ, నేటిధాత్రి: హనుమకొండలోని న్యూ లయోలా హైస్కూల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మరియు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరులకు నివాళులర్పిస్తూ, దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కొమరం భీమ్ భాగ్యరెడ్డి వర్మ కాలోజి నారాయణ రావు ప్రో జయశంకర్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది. పిల్లల్ని ఉద్దేశించి కరస్పాండెంట్…

Read More

ఘనంగా “ప్రజాపాలన” దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బందిచే స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేయించారు….

Read More

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముగ్గురికి కారుణ్య నియామక పత్రాల అందజేత టి. ప్రైడ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ సిరిసిల్ల(నేటి ధాత్రి): ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు….

Read More

ఎంపీ వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

*Date 17/09/2024* —————————————- *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,చామకూర మల్లారెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి తదితర ప్రముఖులతో కలిసి తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు* *హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17వతేదీన భారత యూనియన్ లో కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజున బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం…

Read More

విలీమనా! విమోచనా! విద్రోహమా?

https://epaper.netidhatri.com/view/378/netidhathri-e-paper-17th-september-2024%09 `సెప్టెంబరు17 మీద ఇన్ని చిక్కుముడులెందుకు? `ఇన్ని రకాల అభిప్రాయాలెందుకు? `ఏది నిజం ఏది అబద్దం! `విలీనం నిజమే నిజాం రాజప్రముఖ్‌ ఎలా అయ్యారు! `విమోచనం నిజమే అయితే దొరలు, దేశ్‌ ముఖ్‌లు నాయకులు ఎలా అయ్యారు? `విద్రోహం నిజమేనా అంటే నిజాం నుంచి విముక్తి జరగలేదు! `ఒక రకంగా ఈ మూడు నిజమే! `సెప్టెంబరు17 తో తెలంగాణలో వెట్టి చాకిరీకి విమోచనం జరిగింది. `ఇండియన్‌ యూనియన్‌లో తెలంగాణ విలీనమైంది. `తెలంగాణను మళ్ళీ నిజాం చేతిలో పెట్టడంతో…

Read More

State Government orders enquiry on ‘godown danda’!

https://epaper.netidhatri.com/view/378/netidhathri-e-paper-17th-september-2024%09/2 ·Within 12 hours government response after the news published ·Civil Supplies department get shaken with the news ·Commissioner issued orders to Collector ·Collector became serious on civil supplies officials ·Officials are in dilemma ·Previous report turned into bone of contention ·Officials are not in a position either to support their report or to give…

Read More

ఉద్యమకారుల బస్సుయాత్రకు నర్సంపేటలో ఘన స్వాగతం.

# అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఈ నెల 27న సికింద్రాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట,నేటిధాత్రి : దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకోగా నియోజకవర్గ వివిధ మండలల ఉఫ్యామకారులు ఘనస్వాగతం పలికారు.నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షురాలు…

Read More

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

– ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ సౌజన్యంతో – కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ, ఎస్.పి అఖిల్ మహాజన్ – నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ రాష్ట్రంలోనీ అత్యున్నతమైన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ వారి సౌజన్యంతో…

Read More

జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి.

క్యాతం సతీష్ కుమార్. ఐజేయు జిల్లా అధ్యక్షులు. భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయని, యేళ్ళ నాటి శని వదిలిందని ,ప్రతీ జర్నలిస్ట్ తన హక్కులను సాకారం చేసుకోబోయే తరుణం మీడియా అకాడమి చైర్మెన్‌ కె శ్రీనివాసరెడ్డి ద్వారా ఆసన్నమయ్యే సమయం వచ్చేసిందన్నారు. హైదరాబాద్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగిన టియు డబ్ల్యూ జే ఐజేయు స్టేట్ ఎమర్జెన్సీ ఎక్స్టేండేడ్ ఎక్జిక్యూటివ్ కమిటిలో మీడియా అకాడమీ చైర్మేన్ శ్రీనివాసరెడ్డి కి…

Read More

మాల మహానాడు భద్రాచల పట్టణ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశాలు

భద్రాచలం నేటి ధాత్రి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ ముంపు మండలాల ఇన్చార్జ్ డేగల వంశీ భద్రాచలం స్థానిక ఆదర్శ్ నగర్ కాలనిలో పట్టణ అధ్యక్షుడు డేగల శివ అధ్యక్షతన మాల మహానాడు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ హాజరై కార్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు ఆదర్శ్ నగర్ కాలనిలో మాల మహానాడు సమావేశం నిర్వహించడం…

Read More

లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కారల్ మార్క్స్ కాలనీ లో వినాయకుడి ప్రత్యేక పూజలు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా ప్రజలపై గణపతి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆశీస్సు లతోనే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో శివ సాయి గణేష్ మండలి, ఫ్రెండ్స్ యూత్ విగ్రహ దాత ఎర్రం అనూష సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

Read More

నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు నాయకులు నాయకురాళ్లకు తెలియజేయునది ఏమనగా తేదీ 17 09 2024 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భముగా జాతీయ పతాకావిష్కరణ ఉదయం 8:30 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరుగును కావున ఇట్టి కార్యక్రమమును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము

Read More

ఆటో క్యాబ్ ప్రైవేటు మోటార్స్ డ్రైవర్స్, వర్కర్స్ రాష్ట్ర 3వ మహాసభను జయప్రథంచేయండి

భద్రాచలం నేటి ధాత్రి రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య- భద్రాచలంలో ప్రారంభమైన జీపుజాత ఈ నెల 22,23 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో జరిగే ఏఐటియూసి అనుబంధ రాష్ట్ర ఆటో క్యాబ్, ప్రైవేటు మోటార్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభను జయప్రథం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య అన్నారు. మహాసభల విజయవంతాన్ని కోరుతూ సోమవారం బస్టాండ్ అవుట్ గేట్ ఆటో వద్ద పోస్టర్ ఆవిష్కరించి జీపు జాతా ప్రారంభించారు….

Read More

ప్రజా సేవ లో ..కోదండరామ సేవాసమితి

డ్రా తీసిన ఎస్సై రవికుమార్ గంగారం. నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్ల గూడ గ్రామంలో కోదండ రామయ్య దేవాలయంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద లడ్డు లక్కీ డ్రా.లక్కీ డ్రా లో పాల్గొన్న 300 మంది భక్తులు. లక్కీ డ్రా ద్వారా వచ్చిన వచ్చిన మొత్తం 30300 వేల రూపాయలు. ఆ మొత్తాన్ని భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బ తిన్న వారికి సాయం సారయ్య 10 వేలు బిక్షం 5వేలు బాల్క 5వేలు…

Read More

గణపతి నవరాత్రి ఉత్సాహల్లో పాల్గొన్న కొత్తగూడ SI కుశకుమార్

కొత్తగూడ, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ మరియు అధ్యక్షులు మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడ ఎస్సై కుశకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు సందర్భంగా ఎస్ఐ కుషకుమార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను చెరువు వద్దకు తీసుకువెళ్లరాదని ఊరేగింపు సమయంలో డిజె సౌండ్…

Read More