మహిళా సంఘ భవనానికి రక్షణ కరువు?

ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలోని మహిళ సంఘ భవనానికి రక్షణ కరువై, భవనం కు పెట్టిన తలుపులు ఇలా కనిపిస్తున్నాయి,ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారం కోసం కింది స్థాయిలో మహిళలు చర్చించుకోవడం కొరకు అప్పటి ప్రభుత్వం కొన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు చేపట్టింది,అలా చేపట్టిన గ్రామాల్లో చర్లపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పక్కనే ఉన్న మహిళ సంఘభవనం సుమారుగా 10 లక్షలతో నిర్మించారు, కానీ ప్రస్తుతం మహిళా సంఘాల కొరకు నిర్మించిన భవనం తలుపులు పగులగొట్టినట్ల,లేక చెదలు పట్టి పోయినట్ల అని ప్రజలు చర్చిచుకుంటున్నరు, పైగా పక్కనే అక్కడక్కడ మద్యం సీసాలు దర్శనమివ్వడంతో ఎవరైనా ఆకతాయిలు వచ్చి పగల గొట్టారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఏది ఏమైనా ఆ ప్రాంతంలో ఎలాంటి చెడు కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతి రోజూ పోలీస్ వారిచే పెట్రోలింగ్ నిర్వహించాలని , అధికారులు స్పందించి,మహిళా సంఘాల భవనానికి రక్షణ కల్పించేలా, శాశ్వతంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మహిళలు,ప్రజలు కోరుతున్నారు

సాంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు తెలియపరచడం కోసమే ముగ్గుల పోటీలు

మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రవి…

నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీపడుతూ రంగుల హరివిల్లులతో సంక్రాంతి సాంస్కృతులను తెలియపరిచేలా ముగ్గులు వేశారు. ముగ్గులన్నింటినీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు వీక్షించి ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సాంప్రదాయాలను సాంస్కృతులను తెలియజేయడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని అన్నారు.. పట్టణాల కంటే పల్లెలోనే ప్రేమానురాగాలతో పండుగ జరుపుకుంటారన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు.

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులు

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్లపల్లి జర్నలిస్టు సంఘం యూనియన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా మిత్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎస్ఐ మాధవ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, జర్నలిస్టులు వేముల మహేందర్ గౌడ్, మంగళపల్లి శ్రీనివాస్, నిమ్మల భద్రయ్య, వేముల కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆశీర్వచనలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారు అందించిన తీర్థప్రసాదాలు ఎమ్మెల్యే స్వీకరించారు.ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి రోజున సాయిబాబా దేవాలయానికి రావడం ఆనందంగా ఉందని దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సాయిబాబా ఆశీస్సులతో పట్టణ ప్రజలతో పాటు పరకాల నియోజవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించే శక్తిని ప్రసాదించాలని కోరారు.దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

మల్లక్కపేట గ్రామంలో మహిళల రంగవల్లులు అదరహో

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో సంక్రాతి సందర్బంగా మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిముందర ఎంతో అందంగా ఆకర్షనీయంగా ముగ్గులతో వాకిళ్లను పోటా పోటీగా రంగులతో గోబ్బేమ్మలతో అందంగా అలంకరించారు.అవని జగతికి జ్యోతి అని నిరూపించేలా విధంగా గ్రామంలో ఒక మహిళ ది బెస్ట్ అనిపించే విధంగా ముగ్గుకు వాకిలికి అందం తెచ్చేలా రూపుదిద్దింది.

సంక్రాంతి శుభాకాంక్షలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 15

రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి
ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్ ,మహేష్ గౌడ్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్

కాప్రా నేటి ధాత్రి జనవరి 15

సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్సార్ విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం ని మర్యాద పూర్వకముగా కలిసి సంక్రాంతి శుభ కాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు సింగం కిరణ్ రామ లింగం శ్రీనివాస్ గౌడ్ వేణు మహేష్ లు పాల్గొన్నారు.

అనుమానాస్పద వ్యక్తి దగ్గర నుండి నల్లమందు

కాప్రా నేటి ధాత్రి జనవరి 15

సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మశాలి టౌన్షిప్ వెంచర్ , వోల్క్స్ వ్యాలీ స్కూల్ ప్రక్కన ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మొహమ్మద్ రహీం , సన్నాఫ్ మహమ్మద్ ఇజాద్ ,వయసు: 28 సంవత్సరాలు ,వృత్తి బ్యాంగిల్స్ బిజినెస్ ,నివాసం :ఫరూక్నగర్ షాద్నగర్ ,రంగారెడ్డి జిల్లా
స్వస్థలం మోయిన్ నగర్ విలేజ్ ఫరూదాబాద్, యూపీ వ్యక్తి దగ్గర 44 గ్రాముల చరస్( నల్లమందు)లభించినది.అట్టి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పద్మశాలి వెంచర్ లొ వుండగా పోలీసు వారు పట్టుకొన్నారు.
అట్టి వ్యక్తిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు .
పోలీసు వారు కేసు నమోదు చేసుకోవడం జరుగుతుంది
భవిష్యత్తులో ఇలాంటి నల్లమందు గంజాయి కేసులో ఉన్నట్లయితే వారి పైన పీడీ యాక్ట్ వేసి పోలీసు వారు జైలుకు పంపించడం జరుగుతుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు

ములుగు, నేటిధాత్రి:

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలోని పత్తిపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు పోరిక లీల – మోహన్ లాల్ గారి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో ప్రధమ బహుమతిగా అల్లం తేజశ్రీ తండ్రి భాస్కర్ మరియు ఓదెల సృజన తండ్రి అనిల్, రెండవ బహుమతిగా భూక్య రితిక ధర్మ మరియు భూక్య అనుష , శ్రీను తృతీయ బహుమతిగా నిమ్మల రమ్య, భాస్కర్ నీ ఎంపిక చేయడం జరిగింది.
విజేతలకు రాష్ట్ర దనసరి సీతక్క కుమారుడు దనసరి సూర్య మరియు పోరిక లీల- మోహన్ లాల్ చేతులమీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య మాట్లాడుతూ మన గ్రామ అభివృద్ధి కొరకు మంత్రితో మాట్లాడి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోరిక జవహర్ లాల్, ఎలగందుల చంద్రశేఖర్, అక్క సూర్య కిరణ్,అజ్మీర రమేష్, శీలవంతుల రవీంద్ర చారి, ధారావత్ సారయ్య, మూడు ప్రతాప్, కంబాల రవి, నాంపల్లి గణేష్, రెంటాల కుమార్, పోరిక రాజ్ కుమార్, పొడిశెట్టి మహేందర్, టైలర్ రాజన్న, భూక్యా ధర్మ, వేములపల్లి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగే శ్రీకాంత్ కీ సంభందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్. ఈ సందర్బంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సరికొత్త విజయాలను ఇవ్వాలన్నారు. ప్రజలంతా సఖ, సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రతినిధిగా నేనూ సైతం హుజురాబాద్ నియోజకవర్గాన్ని మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేసేందుకు విరామం లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యాక్రమంలో తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్, బిజిగిరీ శ్రీకాంత్, కారింగుల రాజేందర్, బుడిగే శ్రీకాంత్, యేబూషి అజయ్, ఇటుకాల గణేష్, పచ్చిమట్ల భాను, కాసార్ల దిలీప్, జియా, కార్తీక్, పూరెల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవే పత్రికలు

మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15
సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవే పత్రికలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ కేసరి దిన పత్రిక క్యాలెండర్ ను ఆయన మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపే జర్నలిస్టులు అంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కేసరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వేముల మహేందర్ గౌడ్, మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య, మనం రిపోర్టర్ వేముల కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరబాటి మాతాజీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎల్తూరి ఆధ్వర్యంలో ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పరకాల పట్టణంలో సాయి కన్వెన్షన్ లో పరకాల అసెంబ్లీ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జనకళ్యాణ్ దివాస్ బేహన్ జి మాయావతి జన్మదిన వేడుకలు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఎస్పి పరకాల అసెంబ్లీ ఇంచార్జ్ ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్,పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి అంజద్ పాషా ల్,పరకాల మండల బీసీ సంఘం నాయకులు విష్ణు,రాజేందర్ ఎస్టి సంఘం నాయకులు పాలకుర్తి విగ్నేశ్వర్ ల్,అధ్యక్షులు పెండేల మహేందర్,ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి సర్వర్,భాష, ఫాతిమా పాల్గొని మహనీయులకు ఘన నివాళులర్పించారు.

మెరుగైన వైద్యం కోసం ఆర్థికసహాయం చేసిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని మాధారం గ్రామానికి చెందిన సుధమల్ల స్వప్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ స్వప్న తండ్రి రాజయ్య తో పాటు కుటుంబ సబ్యులు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ను ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన స్వప్న పరిస్థితిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి శ్రీనివాస్ తెలుపగా వెంటనే స్పందించి స్వప్న కి వైద్య ఖర్చులకు గాను (250000) రెండు లక్షల యాబది వేల రూపాయల ఎల్ఓసి చెక్కును ప్రభుత్వం నుండి మంజూరు చేయించారు.అట్టి ఎల్ఓసి చెక్కును హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ తో కలిసి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అందించారు.

కాంగ్రెస్‌ హమీలు..అరుంధతి నక్షత్రమే!

https://epaper.netidhatri.com/

నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే..

`పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే!

`పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే.

`మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే!

`కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు!

`సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు.

`రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు.

`రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు.

`ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు.

`అసెంబ్లీ సాక్షిగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చేశారు.

`మహిళలకు అన్ని బస్సు సర్వీసులు ఫ్రీ అన్నారు…పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు పరిమితం చేశారు.

`హైదరాబాద్‌, డిల్లీ యాత్రలకే పుణ్య కాలం పోతోంది.

`చీమ చిటుక్కుమన్నా డిల్లీకే వెళ్లాలి.

`అడుగుముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి.

`సంక్షేమం గాలికి…కాంగ్రెస్‌ నేతల పరుగులు డిల్లీకి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గాలి వానకు గొడుకు పడితే ప్రయోజనం వుంటుందా? ముళ్లకంచెను నీటిలో నాటితే నాటుకుంటుందా? కాంగ్రెస్‌ పరిస్ధితి కూడా అంతే… కాంగ్రెస్‌ను నమ్ముకున్న తెలంగాణ అరవైఏళ్లు గోసపడిపంది. అందుకే తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడిరది. తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో వెలుగులు నింపింది. కొన్ని సార్లు ప్రజలు కూడా మాయలో పడిపోయే అవకాశం వుంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం ప్రజలను ఎవరూ మోసం చేయలేదు. కాంగ్రెస్‌ చేసిన మోసం అధికారంలోకి వచ్చిన మరునాడే తేలిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద సంతకాలన్నారు. తెలంగాణ ప్రజలు కొంత నమ్మారు. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రాలేదు. మారు కావాలని పదే పదే తెలంగాణ ప్రజలకు చెప్పి,నమ్మించిన కాంగ్రెస్‌ పార్టీ మారిందా? అంటే మారలేదు. గతం తాలూకు బాగోతాలు మర్చిపోలేదు. అందుకే తొలి రోజు నుంచే పాలన గాలికొదిలేశారు. రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చామన్న నమ్మకం వారికే లేదు. అందుకే సంక్షేమం గాలికి వదిలేశారు. రైతులకు ఇచ్చిన హమీలు మర్చిపోయారు. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతాంగ సంక్షేమం, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం అన్నది మర్చిపోయింది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్న సమయంలో నీటి పారుదల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే గంగమ్మ ఉరకలెత్తి, పరుగు పరుగున పొలాలకు చేరినట్లు, రైతు బంధు వేయగానే ట్రింగ్‌, ట్రింగ్‌ మంటూ రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం పడేది. మరి ఇప్పుడు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా వేశామంటాడు. మరో మంత్రి రైతు భరోసా వస్తుందంటాడు..మరో మంత్రి వేస్తామంటాడు..ఇందులో ఎవరి మాటలు నిజమో వాళ్లుకే తెలియకుండా పోయింది. తెలంగాణ రైతులకు సంకటంగా మారింది. అంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి, పదే పదే అబద్దాలు వల్లెవేసి, చెప్పిందే చెప్పి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలను మోసం చేస్తున్నారు.
వారి చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌మీద లేని పోని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ నెల రోజులు గడిపేశారు. ఇక ఇంకా ఎలా కాలం గడపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు చెప్పి మరింత కాలం పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తున్నారు. కాని ప్రజలకు మేలు చేసే అంశం మర్చిపోయారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ అంటూ గత ఏడాది కాలంగా ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రజలు కనికరించేట్లు కనిపించలేదు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లేని పోని, అలవి కాని హామీలను గుప్పించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే కాపీ కొట్టి, కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలను ఏదో విధంగా నమ్మించారు. అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ప్రజా గ్రహానికి గురయ్యారు. గతంలో ఇలా పది రోజలకే ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేక ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విధానానికి, అదికారంలోకి వచ్చి అనుసరిస్తున్న ఆచరణకు పొంతన లేదు. అందుకే ప్రజలకు కూడా పది రోజులకే కాంగ్రెస్‌ పాలన ఎలా వుంటుందో అర్ధమైంది. అప్పుడు ప్రజల తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్‌ అంటేనే కరంటు కష్టాలు, ప్రజలకు నష్టాలు..రైతులకు ఆపసోపాలు..అన్ని వర్గాల ప్రజలను అయోమయానికి గురిచేయడమే… గతంలో చూసినవే… యాభై ఏళ్లు ప్రజలు అధికారమిచ్చినా ఎలాంటి సంక్షేమాలు అమలు చేయని, కాంగ్రెస్‌, ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అని వేడుకుంటున్నప్పుడే బిఆర్‌ఎస్‌ చెప్పింది. కాంగ్రెస్‌ మాటలు నయవంచనకు రూపాలని పేర్కొనడం జరిగింది. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కనికరించి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌ హామీలు అరుంధతీ నక్షత్రమే.. పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌ పథకాలు మంగళం సమర్పయామీ! అన్నదే ఇక వినపడేది.. ముమ్మాటికీ నిజమయ్యేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.
ఇచ్చిన హామీలలో రెండిరటిని చూపించి మమ అనిపించడం తప్ప చేసేదేమీ లేదు.
సరిగ్గా పాలనపై దృష్టిపెట్టేది లేదు. పెట్టేంత సమయం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎంత సేపు కుర్చీ కాపాడుకోవడం కోసం ఆరాటం మాత్రమే వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు కూడా వచ్చేందుకు సమయం వుండదు. కుర్చీలో కూర్చునేందుకు ఎలాంటి రాజకీయాలుచేశారో..ఎలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పారో…కుర్చీ కాపాడుకోవడానికి కూడా అవే మాటలు చెబుతారు. కుర్చీలను అంటిపెట్టుకొని వుంటారు. ప్రజలకోసం ఆలోచించే తీరిక చేసుకోరు. పట్టుమని నెల రోజుల కాకముందే లుకలుకలు. కుదురుకోకముందే కుర్చీలాటలు. వాటిని కాపాడుకునేందుకు ఎత్తుగడలు. అనునిత్యం కుర్చీలకు కాపలాలు ..ఇక ప్రజల బాగోగులు ఎలా చూస్తారు.. కుర్చీలాటతో నెంబర్ల లెక్కలు వేసుకుంటున్నారు. పరిపాలన చేస్తామని వేడుకుంటే, అవకాశమిస్తే కుర్చీల కోసం అప్పుడే అంతర్గత కుమ్ములాటలను చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజల మేలు ఏనాడు పట్టించుకోరు..గతం చెప్పిన సత్యమే ఇది…గతంలోకి తొంగిచూస్తే కనిపించే నిజాలివే…
అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశలు కల్పించారు.
ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము నిజాయితీగా చెప్పిన మాటలన్నా, కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్దాలు కొంత మేర నమ్మారు. దాంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. వెళ్లి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొమ్మని చెప్పారు. అయితే రెండులక్షల రుణం ఎలా ఇస్తారన్న సోయి కూడా లేకుండా చెప్పిన కాంగ్రెస్‌ మాటలను రైతులు నమ్మడమే పాపమైంది. నమ్మితేనే కదా! మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటనే పదే పదే చెప్పి గోబెల్స్‌ ప్రచారం చేశారు. జనాన్ని బురిడీ కొట్టించారు. రెండు లక్షల రుణమాపీ సాధ్యం కాదని కాంగ్రెస్‌ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి రావాలంటే ఇలాంటి అబద్దాలు చెబితే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు…అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినన్నీ అలవి కాని హామీలే… చేతులెత్తేసేవే అని మేం మొదటి నుంచి హెచ్చరించినవే..అయినా జనం కాంగ్రెస్‌ను నమ్మారు. ఎలా చెప్పారంటే డిసెంబర్‌ 9 నాడే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. అంతే తప్ప కాంగ్రెస్‌ను పూర్తిగా విశ్వసించలేదు. గత కాంగ్రెస్‌ చరిత్రలు ప్రజలకు బాగాతెలుసు. పల్లె ప్రజానికం కొంత అమయకులు. అందుకే వారిని సులభంగా మోసం చేయగలిగారు. అదే అర్భన్‌ ప్రజలు కాంగ్రెస్‌ను అసలే నమ్మలేదు. బిఆర్‌ఎస్‌ అభివృద్ధి నమూనాను చూశారు. పదేళ్ల క్రితం తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు ఎంత తేడా వుందన్నదానిని గుర్తించారు. ఈ అభివృద్దికి బ్రేక్‌ పడొద్దని విశ్వసించారు. బిఆర్‌ఎస్‌కు అర్భన్‌ ప్రాంతాలు మద్దతుగా నిలిచాయి. కొన్ని విషయాలు తాము కూడా ప్రచారం చేసుకోలేదు. 2019 తర్వాత సుమారు 7లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వడం జరిగింది. కాని కాంగ్రెస్‌ పార్టీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. నెల గడుస్తున్నా రైతు భరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని తేల్చేశారు. ఎన్నికల ముందు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. రెండిరటికి పరిమితం చేశారు. తొలి పధకంలోనే కోత కోశారు. హైదరాబాద్‌ నుంచి డిల్లీకి యాత్రలకే పుణ్యకాలం గడిచిపోతుంది. చీమ చిటుక్కుమన్నా డిల్లీకి వెళ్లాలి. అడుగు ముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి. సంక్షేమంగాలికి..కాంగ్రెస్‌ నాయకుల పరుగులు డిల్లీకి..ఇంతే కాంగ్రెస్‌ పాలన..ఇంతకు మించి ఒక్క అడుగు కూడా వేయలేని అబద్దాల లాలన. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.

కీళ్ల వ్యాధి బాధితుడికి ఎల్వోసి అందజేసిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం, జనవరి, 13:

కీళ్ల వ్యాధి కారణంగా తొంటి ఎముకల ఆపరేషన్ కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితుడికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలో ఎల్వోసి లేఖను అందజేశారు. నగర శివారు ధంసలాపురం కొత్త కాలనీకి చెందిన రవీంద్ర బాబు ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా తొంటి ఎముకలు దెబ్బతిని సక్రమంగా నడవలేని, కూర్చోలేని స్థితికి వచ్చాడు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాధితుడికి పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ అవసరమని సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రవీంద్ర బాబు ఎంపీ రవిచంద్ర ను ఆశ్రయించగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్ ఓసి కొరకు లేఖ రాశారు. ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం రూ. 1 లక్ష మంజూరు చేస్తూ.. ఎల్వోసి జారీ చేసింది. ఈ మేరకు ఆ లేఖను ఎంపీ రవిచంద్ర బాధితుడికి అందజేశారు.

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/

`చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం.

` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు.

`దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు.

`దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు.

`బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌!

`కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి అడ్రస్‌ లేకుండాపోయిన వారున్నారు. అయినా సినీ తరం ఎప్పుటికీ తరంతరం..నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం..ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం.. అలా నిండా మునిగినోళ్లే అనేకం. .అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొమని పెద్దలు చెప్పినట్లే సినిమా నిర్మాణం ఒక జూదం…సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం.. ఇతరలు దృష్టిలో వ్యాపారం.. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం…అయినా దాన్ని ఫ్యాషన్‌ అనే అనుకుంటారు..ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగులుతుంది. కాకపోతే తమకు తెలిసిందిన సినిమా మాత్రమే చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరే…ఓడిన వారే ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం. కాసుల ప్రపంచం..కళ్ల నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరుగెత్తిస్తున్నా వాటిని కూడ లేక్క చేయకుండా బతికే ఏకైక ఆశా జీవి.. సీనీ జీవి…నిర్మాత..! నటులౌదామని వచ్చి దర్శకులైనవారున్నారు. నిర్మాతలైనవారు వున్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి. ఇప్పుడు వ్యాపారం కల్పవల్లి. కాలం మారుతోంది. సినిమా రూపం మారుతోంది. పెద్ద తెరమీద నుంచి బుల్లి తెరదాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తోంది. అయినా దాని రాజసం దానిదే…సినిమా అంటే సినిమానే…అరచేతిలో పట్టుకొని బొమ్మచూసినా, తాడి చెట్టంత బొమ్మను తెరమీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీవైభవ కార్మగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్‌ రాజు..నిజంగా దిల్‌ వున్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సీనీ మకుటం లేని నిర్మాతలకు రారాజు…
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా! సీమాంధ్ర సినిమా!! అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా, సీమాంద్ర సినిమా వేరువేరే. ఈ రెండు కలిపినట్లు కలిపి, నటించి, తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండు గుత్తగా గంప గుత్తను చేసుకొని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందినవాళ్లే… అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగుసినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్‌ రాజుకు ముందు..దిల్‌రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంద్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరుకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా..పాటలా? అంటూ హేళన చేశారు. ఎగతాలి చేసిన వారున్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా, రాకుండా చూసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిని సందర్భంలో బతికాని, ఇప్పుడు హాయిగా ఊరిపి పీల్చుకుంటూ, నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆదిపత్యం ఎలా వుండేదో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్‌ కవి గాయకుడుని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా? అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వ్యధని, గర్భశోఖాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్‌ లాంటి కవిని కబ్బోర్డులో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంద్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు..తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్‌ రాజు మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు.
పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు, గిన్నిస్‌ రికార్డులు సొంత చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజ వనికిపోతున్న సమయంలో తెలుగు సినిమాను నేను ఆదుకుంటాను..నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం..తెలుగు సినిమాకు వరం..దిల్‌ రాజు ప్రొడక్షన్‌. ఒక దశలో సినిమా అంటేనే ఆడమ దూరం నిర్మాతలు పరుగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాకు ఊపిరిపోసి, తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు. అయితే పైకి సంబురం వ్యక్తం చేస్తూ, ఎప్పుడు దిల్‌ రాజు పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్లు కూడ చాలా మంది వున్నారు. అయితే పడి లేవడం దిల్‌ రాజుకు కొత్త కాదు. పడి లేవడం తెలిసిన దిల్‌ రాజు ఒక్కసారి పడితే పదిసార్లు లేచేంత బలం కూడదీసుకొని ముందుకు విచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. నవ్విన నాప చేను పండినట్లు, దిల్‌ రాజు ఎక్కడ దొరక్కపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్లు బైర్లు కమ్మేంత వెలుగు చూసిన నిర్మాత దిల్‌ రాజు. దిల్‌ రాజు నిజంగా దిల్‌ వున్న రాజే కాదు..ఎంతో ధైర్యం వున్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు.. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా ధియేటర్‌లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత వుండేది. రికార్డులను తిరగరాసేంది. సినీ ప్రభంజనాన్ని సృష్టించేది. కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బుకోసం దిల్‌ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కాని సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని కోసమైనా సీమాంధ్ర చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే మూడు రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్‌ హిట్‌ సినిమాలంటే మూడు వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు. కనీసం ఓటీటిలో పేరొస్తే చాలనకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి వున్నంత కాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకొని బలగం సినిమా చూశారు. ధియేటర్లకు బండ్లు కుట్టుకొని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్‌ రాజు మీద లేని పోని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్‌ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమంధ్రకు చెందిన వాళ్లు విపరీత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్‌ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్‌రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు…ఎవరికీ స్టార్‌ డమ్‌ నిర్మాత లేకుండా రాలేదు. అయినా రెండు రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు…ఆ ఒక్కడు దిల్‌రాజు మాత్రమే..ఎనీ డౌట్‌?

విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేసిన మహిళా మమత తరంగిణి సంస్థ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మంచిర్యాల మహిళ మమత తరంగిణి సంస్థ వారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని స్కూలుకు మంచి పేరు తేవాలని, చదువుతోపాటు ఆటలో కూడా రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతం నుంచి స్కూలుకు వచ్చే పేద పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుగుట జ్యోతి, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, జ్యోత్స్న, చంద్ర దత్, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

కోట గుళ్ళ లో పూజ లు నిర్వహించిన ఆలయ ధర్మకర్త ఏవీఎల్ ఎన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం ఆలయ ధర్మకర్త అట్లూరు వెంకటలక్ష్మి నరసింహారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులకు అందుతున్న సేవలు గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్

రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులదే ముఖ్యపాత్ర

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.

ఘనంగా ఆల్ఫాన్సా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు…

విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి…

బెల్లంపల్లి ఏసిపి సదయ్య …

రామకృష్ణాపూర్,జనవరి 11, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్ఫోన్సా కాన్వెంట్ పాఠశాల లో 35 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి ఏసి పి సదయ్య,ఎం ఈ ఓ పోచయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రానించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువు పై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,విద్యార్థులు సోషల్ మీడియాల కు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న, ఉన్నత స్థాయిలో ఉండాలన్న సరే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యం అని అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, నాటికలు చేసి విద్యార్థులు అలరించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు డ్రగ్స్ , మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేందుకు నాటికలు చేసి అబ్బురపరిచారు. నాలుగో తరగతి ప్రహర్షితా కళ్లకు గంతలు కట్టుకొని రంగులు, నంబర్స్ , అక్షరాలను చెప్పడం పలువురిని విశేషంగా ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ బెస్సి,మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్,సిస్టర్ అల్ఫోన్సా అబ్రహం రోసిన్,ఫాథర్ బినోయ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version