
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొండి రాజయ్య గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన జీవితాన్ని గ్రామ ప్రజల కోసం అంకితం చేశారు. గతకొన్ని రోజులుగా రాజయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందారు. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన రాజయ్య మరణంతో అతని భార్య దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు గంగాధర మండల…