
కెవైసిఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గొర్రె కాపర్ల సహకార సంఘం కార్యాలయం వద్ద కెవైసిఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమనికి ముఖ్యఅతిథులుగా గ్రామ ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు, గ్రామ ఎంపిటిసి1 ఎడవెల్లి నరేందర్ రెడ్డిలు హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కె.పావని,అఖిలు, ద్వితీయ బహుమతి కె.పూజ, తృతీయ బహుమతి అనూజ, మౌనికలు గెలుచుకున్నారు….