పెద్ద సార్ల పోరుతో..పేద రైతు గెలిచేనా.!

అది గత ఎమ్మార్వో చేసిన తప్పు..ఇప్పుడు నేను సరి చేయాలంటే సమయం కావాలి.?

ఐనవోలు మండల ఎమ్మార్వో “విక్రమ్ కుమార్” వింత సమాధానం!

రైతుబంధు నిధులు దుర్వినియోగం చేసిన కాఫీ అధికారికంగా 

Inavolu mro.vikram kumar

కంచె చేను మేస్తే? సవరించాల్సిన వాళ్లే సా… గదీస్తున్నారు.

పాత సార్ ఎక్స్(ప్రె)స్ వేగంలో పాస్ బుక్ ఇచ్చిండు.

కొత్త సారు కొంత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు.

రికాం(ర్డ్) లేని తిరుగుడులో తప్పేవరిధి? తప్పించేదేవరు?

ఆక్రమ పట్టాదారుల ఆగడాలను అడ్డుకొనేదెవరు?

వేల రూపాయల రైతుబంధు నిధులను దుర్వినియోగం.

30 సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు.

ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా.

రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.

“నేటిధాత్రి” ఐనవోలు,

భూరికార్డుల్లో ఉన్న అవకతవకలు సరిచేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని రూపుమాపి రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం తీసుకోచ్చినదే ధరణి యాప్. ఐతే రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువేముంది అన్న నాణుడి తరహాలో ధరణి లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు కొత్త తరహా అవినీతికి తెర లేపుతున్నారు. తప్పుగా నమోదైన ఆర్.ఎస్. ఆర్ రికార్డ్ ను సవరించాల్సిన తహసీల్దార్ అదే ఆ లొసుగును ఆసరాగా చేసుకొని మోఖా మీద లేని రైతుకు కేవలం ఖాతా నెంబర్ ద్వారా రికార్డ్ లో ఎక్కువగా ఉన్న భూమికి పట్టాదారు పాస్ బుక్కులు జారీ చేసి తనదైన మార్క్ చూపించారు.పూర్తి వివరాల్లోకి వెళితే… హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి రాజుకు సర్వేనెంబర్ 194 లో ఒక ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఈ భూమిని రాజు తాత ఐన కట్కూరి కట్టయ్య 1983లో ఒక ఎకరం 1990లో 24 గుంటలుగా మొత్తం 1-24 ఎకరాల భూమి అసలు పట్టాదారుడు ఐన యాకయ్య మరియు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఖరీదుకు కొనుగోలు చేసినాడు.అప్పటినుండి దాదాపుగా 40 సంవత్సరాల నుండి అదే భూమిలో వ్యవసాయం చేస్తూ జీవించాడు. తన తాత తధనంతరం వారసత్వంగా వచ్చిన భూమిని రాజు 2011 సం. లో ఒక ఎకరా తన పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్కులు పొంది ఉన్నాడు. మరియు 2018లో 24 గుంటల భూమికి సాధా బైనామా ద్వారా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ బుక్ పొందాడు. 194 సర్వే నెంబర్లో తాను ఒక్కడే రైతు తాను సాగులో ఉన్న భూమి మొత్తానికి ప్రస్తుతం పట్టా కలిగి ఉన్నాడు. ఇట్టి భూమిని గతంలో రాజు ఎవరికి అమ్మలేదు ఎవరు కొనుగోలు చేయలేదు. 

 

ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువ ఉన్న సాకుతో ఆ…. పట్టా

 

అయితే ఇదే సర్వేనెంబర్ 194 లో మోకాపై ఎలాంటి భూమి లేకుండా కేవలం ఆర్.ఎస్.ఆర్ రికార్డుల్లో అదనంగా ఒక ఎకరం భూమి తప్పుగా చూపిస్తూ సోల్డ్ అవుట్ అని పాత పట్టాదారుని ఖాతా నెంబర్ 226 తో ఒక ఎకరం ఎక్కువగా తప్పుడు రికార్డ్ అయ్యింది. అట్టి విషయాన్ని బాధితుడు అప్పుడే స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేయగా విచారణ జరిపిన స్థానిక వి.ఆర్.ఓ ఆర్.ఎస్.ఆర్ లో భూమి ఎక్కువగా ఉన్నట్టు ఆ భూమిని తొలగించాలని నివేదిక ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన తాహశీల్దారు ఇవేవి పట్టించుకోకుండా 2022 సంవత్సరంలో ఎలాంటి ఆధారాలు లేకుండా, విచారణ చేయకుండా, కనీసం పాత లింక్ డాక్యుమెంట్ రికార్డులు పరిశీలించకుండా ‘సత్య’ వంతులైన కొందరి సూచనలతో పట్టా చేసినారు. కానీ అప్పటికే కట్కూరి రాజు సంబంధీకులు మోఖాలో ఉండి సాగులో ఉన్నారు.ఆ విషయం తహసీల్దార్ విచారణ చేయకుండా ఆ అక్రమ పట్టా చేయడం ద్వారా ఇప్పటివరకు అనర్హుడైన రైతు దాదాపు 20 వేల రూపాయలు రైతుబంధు రూపేణా ప్రజల సొమ్మును అప్పనంగా లబ్ది పొందడం కొసమెరుపు. మరి అన్ని వేల రూపాయల ప్రజాధనం మళ్ళీ రికవరీ చేస్తారో లేదో వేచి చూడాలి.. అన్ని ఆధారాలు ఉండి రెవెన్యూ అధికారుల తప్పిదాలతో భూములు ఎక్కక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు తహసీల్దార్ ల చుట్టూ తిరిగితే అంతా ధరణి మయంలో ఉంది మాకు అధికారం లేదు అని చెప్పే రెవెన్యూ అధికారులకు ఇది ఎలా సాధ్యం అయినట్లు?.. 

ఇదిలా ఉండగా అక్రమ పట్టా తొలగించాలని ప్రస్తుత తహసీల్దార్ ను బాధితులు ఆశ్రయించగా ప్రస్తుతం ఉన్న ధరణి యాప్ లో అలాంటి అధికారం నాకు లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది. 

 

30 సార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు..

 

ధరణిలో ఉన్న లొసుగులు ఆధారంగా చేసుకొని తహసీల్దార్ సాయంతో తాను సాగుచేసున్న భూమి ని అక్రమంగా పట్టా చేయించుకున్నారని బాధిత రైతు 2022 నుండి ఇప్పటివరకు 30 సార్లు కలెక్టర్ లాంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా, పిర్యాదు చేసినప్పుటి నుంచి ముగ్గురు కలెక్టర్లు మారారు తప్ప మాకు న్యాయం జరుగలేదు. ప్రస్తుత కలెక్టర్ కి కూడా పిర్యాదు చేస్తే మండల గర్ధవర్ మండల సర్వేయర్లతో విచారణ చేయగా వారు పొందిన పట్టా అక్రమం అని తేల్చి పట్టా తొలగించాలని నివేదిక ఇచ్చినా గాని ఉన్నత అధికారులు కాలయాపన చేస్తున్నట్టు బాధితులు తెలిపాడు. నాపై మరియు మా కుటుంబ సభ్యులపై అక్రమ పట్టాదారులు దాడులు చేసి దౌర్జన్యంగా ఆస్తి నష్టం చేసినారని అట్టి విషయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కి మూడుసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.తప్పు చేసిన అధికారి ధర్జాగా అధికారం అనుభవిస్తూ ఉంటే ఏ తప్పు చేయని మేం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇంతవరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.

బాధిత రైతు కట్కూరి రాజు కొండపర్తి

 

రైతు భరోసా రద్దుచేశాం,పట్టారద్దుకు చర్యలు తీసుకుంటాం.

 

ఇదే విషయం పై స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్ ను నేటిధాత్రి ప్రతినిధి వివరణ కోరగా..

కొండపర్తి గ్రామంలో సర్వే నెంబర్ 194 లో స్థానిక రైతు కట్కూరి రాజు మోఖ మీద ఉన్నట్టు విచారణలో తేలింది. ఐతే అదే సర్వే నెంబర్ లో ఒక ఎకరం భూమి ఆర్. ఎస్. ఆర్ ప్రకారం ఎక్కువగా నమోదు అయ్యింది. అట్టి విషయం పై బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపించాం. సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కి పంపించటం జరుగుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన పిమ్మట ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..

విక్రమ్ కుమార్

తహసీల్దార్ ఐనవోలు మండలం.

అట్టహాసంగా నరేందర్ రెడ్డి నామినేషన్.

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. వి. నరేందర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డి నామినేషన్‌కు నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు హజరై నరేందర్ రెడ్డి కి అభినందనలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో హజరైన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లిన నరేందర్ రెడ్డి తన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోధన్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆదిలాబాద్ పార్లమెంటు కంటెస్టెట్ ఆత్రమ్ సుగుణ, మానాకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ రాకూర్ ఇతర నాయకులు హజరయ్యారు. అందరు నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికిన నరేందర్ రెడ్డి తర్వాత నామినేషన్ కు బయలుదేరారు.

సరోజినీ వృద్ధాశ్రమల్లో అన్నదాన కార్యక్రమాలు

తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా
భద్రాచలం నేటిదాత్రి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక సరోజిని బుద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.
అన్నదాన కార్యక్రమానికి భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *బలుసు నాగ సతీష్ , మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి *దొడ్డిపట్ల కోటేష్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…..
గొప్ప సేవ గుణం కలిగినటువంటి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన సందర్బంగా,సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా సరోజిని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని. మంత్రి పొంగులేటి గారి కార్యాలయం ఇన్చార్జిగా ఉన్నటువంటి దయాకర్ రెడ్డి సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆప్యాయమైన పలకరింపుతో ప్రజలతో మేక మోతు వారి సమస్యలను తీరుస్తుంటారు. సేవా గుణం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన తుంబూరు దయాకర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారికి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు నిండు నూరేళ్లు తోడుగా ఉండాలని నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో….
భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దొడ్డిపట్ల సత్య లింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెం సత్యాలు,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, భద్రాచల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి బత్తుల కృష్ణారెడ్డి,ఆర్జి సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్త శ్రీనివాస్,ఎండి నవాబ్, పగిడిపల్లి వంశీ,మళ్లీ, శీను తదితరులు పాల్గొన్నారు.

ఎస్టిపిపి లో వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నందు నిర్మించిన నూతన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రాతః కాలంలో జరిగింది.శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన ఆలయ,స్థిర విగ్రహ సుదర్శన,గోదాదేవి,రామానుజ నమ్మల్వార్ చలవిగ్రహ,ధ్వజస్తంభ,ప్రతిష్ట మహోత్సవములు గత నాలుగు రోజులుగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోవర్ధనగిరి జగన్నాథచార్యులు,గోదావరిఖని వాస్తవ్యులు,వారి శిష్య బృందం వేద పండితులైన వెంకట రమణాచార్యులు,సముద్రాల భాను కుమార్,సేనాపతి శేషాచార్యులు,కాండూరి వెంకటాచార్యులు,సముద్రాల అనంత ఆచార్యులు మరియు భరతాచార్యులు,అచలాపూర్ వేద పాఠశాల నుంచి విచ్చేసి ఈ దైవ కార్యక్రమాలని నిర్విఘ్నంగా సోమవారం పూర్తి చేయడం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఏం ఆపరేషన్స్) మరియు(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)డి.సత్యనారాయణ రావు దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈనెల 7వ తేదిన సాయంత్రం అంకురార్పణ పూజలతో ప్రారంభమై,8 వ తేది వాస్తు పురుష పూజ,మూలవిరాట్టుల,ఉత్సవ విగ్రహాల పుణ్యాహవచనం మరియు క్షీరాధివాసం అలాగే హోమాలు నిర్వహించారు.9వ తేది మూలవిరాట్టుల మరియు ఉత్సవ విగ్రహాల జలాధివాసం,ధాన్య ఫల పుష్ప శయ్యాధివాసం అలాగే హోమాలు,యజ్ఞాలు జరిపించారు.10 వ తేదీ తెల్లవారుజామున ఉదయం 4:25 నిమిషాలకి మూలవిరాట్టుల ప్రతిష్టాపన,గోపురాన సుదర్శన చక్రస్థాపన,ధ్వజస్తంభ స్థాపన మరియు ప్రాణ ప్రతిష్ట,బలి నివేదన మొదలైన కార్యక్రమాలు జరుపబడ్డాయి.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు అభిషేకం,అలంకరణ అనంతరం మహా అన్నప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ ఆలయ శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని,ఆలయ కమిటి సభ్యులు ఒక సంవత్సర కాలంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి అనుకున్న విధంగా సంవత్సరంలోపే నిర్మిచడం అనేది చాలా గొప్ప విశేషం అన్నారు.ప్లాంటు రక్షణార్ధం,అందరు ఉద్యోగుల సంరక్షనార్ధం నూతన సీతారామ చంద్రస్వామి ఆలయం ఇక్కడ నిర్మిచుకోవడం మన పూర్వ జన్మ సుకృతంమని,ఈ సందర్బంగా ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ సి & ఎండి శ్రీ ఎన్. బలరాం,ఐఆర్ఎస్ రావాలని ఉన్నా అనివార్య కారణాల రిత్యా రాలేకపోయారని,వారి తరుపున ఉద్యోగులందరికి, భక్తులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దంపతులు డి.సత్యనారాయణ రావు-శ్రీమతి హరిణి,జిఎం (ఓసిపి) డి.వి.ఎస్.ఎన్.రాజు దంపతులు,రిటైర్డ్ జిఎం(ఎస్టిపిపి)సుధాకర్ రెడ్డి దంపతులు,రిటైర్డ్ జిఎం (ఫైనాన్సు)నరసింహ రెడ్డి దంపతులు,ఎస్టిపిపి ఇంచార్జి ఈడి( హెడ్ అఫ్ ది ప్లాంట్) కే.శ్రీనివాసులు- సుమిధ,చీఫ్ అఫ్ (ఓ&ఎం)జే ఎన్ సింగ్ – సంగీత,ఆలయ కమిటి అధ్యక్షుడు ఏజిఎం (ఫైనాన్స్) టి.సుధాకర్ దంపతులు,ఆలయ కమిటి సెక్రటరీ సముద్రాల శ్రీనివాస్ దంపతులు,ఏజిఎం(సివిల్) కెఎస్ఎన్ ప్రసాద్ దంపతులు, ఏఐటియుసి పిట్ సెక్రటరీ సత్యనారాయణ దంపతులు, డిజిఎం (పర్సనల్)అజ్మీరా తుకారాం దంపతులు,ఇతర అధికారులు,ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.

ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10:

ఆర్సీ రోడ్డు లోని షాది మహల్ లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. షాది మహాల్ లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ, డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు.
ఈ రెండు పనులను ఎనిమిది లక్షలా ముప్పయ్ వేల రూపాయలతో పూర్తి చేయనున్నారు.షాది మహల్ ఆవరణను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు.షాది మహల్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.ముస్లింల ను అన్ని విధాల అభివృద్ధి చేసుందుకు సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ముస్లింల సంక్షేమానికి ఎన్డీఎ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్ చెప్పారు.
షాది మహాల్ ను అభివృద్ధి చేసి చూపుతామని ఆయన చెప్పారు.గత ఐదేళ్లలో షాదిఖాన అభివృద్ధిని వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి మహబూబ్ బాషా ఆరోపించారు.ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 8 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చెప్పట్టిందని ఆయన తెలిపారు.ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, సూరా సుధాకర్ రెడ్డి, పులిగోరు మురళీ, దంపూరి భాస్కర్ యాదవ్, బిజి కృష్ణ యాదవ్, చినబాబు, పాఠకం వెంకటేష్,రఫీ,జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాల అయ్యంగార్,జానకిరామ్ రెడ్డి, ఉదయ్,కే ఏంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.డీఎస్పీ ప్రసాద్

పాకాల(నేటిధాత్రి) ఫిబ్రవరి 10:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో పరిసరాలను పరిశుభ్రం పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ సోమవారం చేపించారు.కార్యక్రమం దామలచెరువు పంచాయతీ కార్యదర్శి వి.మహేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి డిఎస్పి బి.ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆకతాయిలు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలను పరిశీలించి శుభ్రం చేపించామని పేర్కొన్నారు.సమీప ప్రదేశంలో పంచాయతీ సిబ్బందితో కలిసి కంప చెట్లను,ముండ్ల పొదలను శుభ్రం చేసి అక్కడ పెక్సీలను ఏర్పాటు చేసి హెచ్చరికలను జారీ చేశామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ వెంకటరమణ నాయుడు,అర్జున్,మహర్షి,శీను,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,స్థానిక నేతలు లతీఫ్,భాష,పాల్గొన్నారు.

2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది.

`దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది.

`2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది.

`గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు.

`1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు.

`రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు.

`1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవితమంతా కృషి చేశారు.

`ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకమైన నాయకుడు.

`రాజకీయ దురంధరుడు.

`ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ బలమైన కోరిక.

`ప్రణబ్‌ ముఖర్జీ వల్ల రాజకీయ నష్టం జరుగుతుందని భయపడ్డారు.

`ఇప్పుడు కాంగ్రెస్‌ కోలుకోకుండా పోవడానికి కారకులయ్యారు.

`చరిత్రలో రాజకీయ తప్పటడుగులు సహజమే.

`చెప్పుడు మాటలు విని రాజకీయ పార్టీ తమ పార్టీ కోలుకోకుండా చేసుకోవడమే

మునగడం తేలడం కాంగ్రెస్‌కు కొత్తకాదు. తనను తానే ముంచుకోవడం కూడా కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు. కాని మునిగినా తేరుకోవడం ఇంత కాలం పట్టడం అన్నది ఇప్పుడే ప్రధమం. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం చెందింది 1889లో..అప్పటి నుంచి దేశంకోసం పోరాటం చేస్తూనే వుంది. అసలు దేశం కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో రాజకీయం నెరపడమే ఎంతో దైర్యంతో కూడుకున్న పని. అయినా దేశం కోసం తెగించి పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే. ముఖ్యంగా మహాత్మాగాందీ 1917లో దక్షిణాప్రికా నుంచి వచ్చి స్వాతంత్య్రం సంగ్రామంలో అడుగు పెట్టక ముందు ఒకచరిత్ర..తర్వాత ఒక చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్‌లో 1910కి ముందు మితవాదులు ఎక్కువగా వుండేవారు. దాదాబాయి నౌరోజీ లాంటి వారు ఎలాగైనా సాతంత్య్రం సముపార్జనకోసం అర్జించండి అన్న తరహాలో ఉద్యమాలు చేశారు. 1910 తర్వాత లాలాలజపతి రాయ్‌, బాల గంగాదర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ లాంటి వారు స్వాతంత్య్ర సంగ్రామాన్ని అతి వాద దశకు తెచ్చారు. దాంతో దేశంలో కొంత హింసాత్మక ఉద్యమ వాతారణం నెలకొన్నది. అదే సమయంలో ఇండియాకువచ్చిన గాందీజీ సత్యాగ్రహంతో ఉద్యమం మొదలైంది. అప్పట్లో గాంధీజీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టిన వారున్నారు. కాని చివరకు గాంధీ మార్గమే.. గెలిచింది. అయితే మన దేశంలో మొదటిసారిగా 1934 ఎన్నికలు జరిగాయి. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అప్పటికే నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం మొదలైంది. 1947 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే స్వాతంత్య్రం జెండా ఎగురవేశారు. ఇది నేటి తరానికి చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. భారతీయ జనతాపార్టీ రకరకాల ప్రచారాలు సాగిస్తోంది. నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశ విభజనకు కారణమైతే, వల్లభాయ్‌ పటేల్‌ దేశాన్ని ఏకం చేశారంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు మాత్రమే హోం మంత్రిత్వ బాద్యతలు నిర్వహించారన్న విషయాన్ని కాంగ్రెస్‌ చెప్పుకోవడం లేదు. నిజానికి ఆ ప్లేస్‌లో ఏ నాయకుడు వున్నా, అదే పనిచేసేవారు. కాని స్వాతంత్రోద్యమంలో నెహ్రూ కాకుండా మరో నాయకుడు వుండేవారేమో? అనడానికి ఆస్కారమే లేదు. అంతటి బలమైన పునాదులున్న కాంగ్రెస్‌ పార్టీ ఇందిరాగాందీ వున్నంత వరకు ఆ పార్టీ తిరుగులేని శక్తిగా, ఎదురులేని రాజకీయం చేసింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ మరణించిందో అప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచులకు చేరుకున్నది. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. కాని ఆ గెలుపును, ఆ బలాన్ని నిలుపులేకపోయింది. అప్పటికి బిజేపి కూడా అంత బలంగా లేదు. బోఫోర్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ను పట్టి పీడిరచింది. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమైంది. బిజేపి బలపడేందుకు మార్గం వేసినట్లైంది. తర్వాతనైనా పార్టీని కాపాడుకునే ప్రయత్నం బలంగా జరగలేదనే చెప్పాలి. పివి. నర్సింహారావును పూర్తిగా నమ్మలేదు. ఆయన నాయకత్వాన్ని బలపర్చలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఊపియే1 గెలిచింది. అప్పుడు సోనియాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారు. కాని మన దేశ సార్వభౌత్వం విషయంలో రాజ్యాంగ సూత్రాలు అడ్డు తగిలాయి. సోనియాగాందీ ప్రధాని కాలేకపోయారు. అప్పుడే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుండేది. రాజనీతి తెలిసిన నాయకుడికి ప్రధాని బాద్యతలు అప్పగిస్తే ఎంతో బాగుండేది. అప్పటికి బిజేపిలో బలమైన నాయకులు లేరు. ఆ పార్టీకి క్ష్రేత్ర స్దాయి నిర్మానం పూర్తిగా లేదు. మౌన మునిగా పేరున్న మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేస్తే, తన రాజకీయానికి ఇబ్బందులు వుండవన్న ఆలోచనతో సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ స్దానంలో ఎవరున్నా సోనియాగాందీకి ఎదరు చెప్పే అవకాశం వుండేది కాదు. కాని సోనియాగాందీ ఎవరినీ నమ్మలేదు. సరే 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని చేశారు. తర్వాత 2009లోనైనా మరో నాయకుడిని ప్రధాని చేసినా కాంగ్రెస్‌కు ఈ పరిస్ధితి వచ్చేది కాదు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసినా పెద్దగా పార్టీలో అభ్యంతరాలు వుండేవి కాదు. కాని చేయలేదు. 2004లో రాహుల్‌ గాంధీకి మంత్రి వర్గంలో చోటు కూడా కల్పించలేదు. అది సోనియాగాందీ చేసిన మొదటి తప్పు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రిని చేస్తే పాలన మీద ఆయనకు కొంత పట్టు వచ్చేది. 2009లో ఆయన ప్రధాని అయ్యేందుకు ఇబ్బంది వుండకపోయేది. సరే తర్వాత 2009లో కూడా మంత్రిని చేయలేదు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ను రాజీనామా చేయించి, రాహుల్‌ను ప్రధానిని చేసినా బాగుండేది. అ పని చేయలేదు. 2009 ఎన్నికల తర్వాత మన్మోహన్‌ సింగ్‌ను కాకుండా ఎంతో రాజకీయ అనుభవం వున్న చాణక్యుడు ప్రణబ్‌ ముఖర్జీని ప్రధానిని చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్దితి అసలే వుండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ లాంటి మరో చాణక్యుడు లేడు. కాని ఆయనను ప్రధానిని చేస్తే ఎక్కడ తన చేతుల్లో పవర్‌ వుండకుండాపోతుందో అన్న భయంతో సోనియా గాందీ నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఇప్పుడు ఇంత కాలం పార్టీ అధికారానికి దూరమయి వుండేది కాదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచన ఆనాడు చేయలేదు. ఇప్పుడు పదవి కోసం ఎంత ప్రయత్నం చేసినా కాలం కలిసిరావడం లేదు. ప్రణబ్‌ ముఖర్జీ ఇందిరాగాంధీకి ఎంతో నమ్మకమైన నాయకుడు. ఆమె హాయాంలోనే ఆయన ఆర్ధిక శాఖ నిర్వహించారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయనను మించిన వారు లేదు. పివి.నర్సింహారావు హాయాంలో కూడా ఆయన నెరిపిన విదేశీ వ్యవహరాల మూలంగా దేశానికి, ఆర్ధికాభివృద్దికి ఎంతో మేలు జరిగింది. అయితే ఇందిరాగాందీ మరణం తర్వాత రాజీవ్‌ గాందీని ప్రదాని చేయడం కొంత మందికి నచ్చలేదు. ఎలాంటి పాలనానుభవం లేని రాజీవ్‌ గాందీ వల్ల కాంగ్రెస్‌ నష్టపోతుందని అనుకున్నారు. అందులో ప్రణబ్‌ ముఖర్జీవున్నారనేది అప్పుడు ప్రచారం జరిగింది. దాంతో రాజీవ్‌గాంధీ ఆయనను పక్కన పెట్టారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. ఇక పార్టీలో వుండి లాభం లేదనుకున్న ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే కొంత కాలానికి రాజీవ్‌ గాంధీకి అసలు నిజం తెలిసింది. ప్రణబ్‌ ముఖర్జీ అంటే గిట్టని వాళ్లు చేసిన ప్రచారం మూలంగానే అపోహపడినట్లు గ్రహించి, మళ్లీ ప్రణబ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అండగా వుంటూ వచ్చారు. పివి. నర్సింహారావును ప్రధాని చేయడంలో కూడా కీలకభూమిక పోషించారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఇంకా బతికి వుందంటే ప్రణబ్‌ ముఖర్జీ లాంటి నాయకులే కారమని చెప్పకతప్పదు. 2004 ప్రధాని అయ్యే అవకాశం వున్నా సోనియాగాంధీ ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. ఆనాడు రాజీవ్‌ గాంధికి లేనిపోనివి చెప్పినట్లే, తర్వాత సోనియా గాందీకి కూడా అదే నూరిపోశారు. దాంతో ఆమె ప్రణబ్‌ను ప్రదాని చేయడానికి ముందుకు రాలేదు. కాని తాను ప్రధాని కావలన్నా కోరికను ప్రణబ్‌కు ఎంతో వుండేది. గాంధీ కుటుంబాన్ని కాదని ఆయన ప్రదాని పదవి కోరలేదు. ఆ కుటుంబంలో రాహుల్‌ ప్రధాని కానప్పుడు తనకు అవకాశం వస్తుందని ఆశించారు. అయినా సోనియాగాంధీ కనికరించలేదు. కాకపోతే 2012లో ఆయనను రాజకీయాలను నుంచి దూరం చేసి, రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. నిజానికి ఆ పదవి ప్రణబ్‌కు ఇష్టం లేదు. ఆనాడు ప్రణబ్‌కు రాష్టపతి చేయకుంటే కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి మరోలా వుండేది. రాష్ట్రపతిని చేసి పార్టీ కోసం పనిచేసేనాయకుడు లేకుండా చేసుకున్నారు. స్వయంకృతాపరాధంతో పార్టీని చెడగొట్టుకున్నారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించడం, స్పెక్ట్రమ్‌ లాంటి కేసులపై ముందూ వెనుకు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కాంగ్రెస్‌ కొంప ముంచింది. చివరికి ఏం తేలింది? స్పెక్రమ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రింకోర్టు కేసు కొట్టి వేసింది. అప్పటికే కాంగ్రెస్‌కు జరగాల్సినంతనష్టం జరిగిపోయింది. ఇలా మన్మోహన్‌ సింగ్‌ హయాంలో వేసిన తప్పటడుగులు, కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.

జతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్..

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం జతర ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఏర్పాట్లు అనుకున్న స్థాయిలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్రాగునీరు, పారిశుద్ధ్యం విద్యుత్ లైన్లో ఏర్పాటుచేసి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నింపామని ఆయన తెలిపారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ విభాగం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఆలయ కమిటీ, సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని పిఓ గారితో చర్చించి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గుడికి బోర్వెల్, కాంపౌండ్ వాల్, స్నానాల ఘట్టాలు, త్రాగునీరు, షెడ్లు, సత్తర్ నిర్మించాలని మాజీ శాసనసభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య కోరారు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జాతరకు ఈ సంవత్సరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, గుడికి సంబంధించిన శాశ్వత పనులు గురించి, చందా లింగయ్య తెలిపిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.అధికారులందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, తహసిల్దార్ నాగప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, ఐ టి డి ఎ డి ఈ మధుకర్, ఏఈ యోగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డి ఈ బ్రహ్మదేవ్, ఏఈ విజయ్ కృష్ణ, కార్యదర్శులు, రామకృష్ణ, రవి, మారుతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

13 ఫోన్ లను రికవరి చేసిన భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో భూపాలపల్లి పోలీసులు పోగొట్టుకున్న 13 సెల్ ఫోను లను తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు అప్పగించామని డిఎస్పి సంపత్ రావు అన్నారు వివిధ సమయాల్లో బాధితుల సెల్ ఫోన్ లు మిస్సవ్వగా, అట్టి వివరాలు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరిచి 13 మంది ఫోన్లు రికవరీ చేసి వారికి అందించడం జరిగింది
ఈ సందర్భంగా సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ సెల్ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ కు సంబధిత వివరాలు www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తిగా వివరాలు నమోదు చేసిన తరువాత వారి సెల్ఫోన్ ను పట్టుకోవడం జరుగుతుందని, ఈ సాంకేతికతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

ములుగు జిల్లా, నేటిధాత్రి:

ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మల్లంపల్లి గ్రామంలో ఆదివారం రోజున 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు రెండు దశాబ్దాల కిందట తాము చదువుకున్న పాఠశాలలో ఒకే వేదికపై కలుసుకోవాలన్న ఆలోచనతో గత వారం రోజుల నుంచే పూర్వ విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య బోధించిన గురువులకు మెమొంటోలు శాలువాలతో ఘనంగా సత్కరించారు బాల్యంలో తాము చదువుకున్న పాఠశాలలో తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. అప్పటి బాల్య స్నేహితులు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడిన పలువురు పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని తమ ఉపన్యాసాలలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివిన తోటి విద్యార్థి మరణించిన స్వామి కుటుంబానికి తమ వంతు కృషిగా ఆర్థిక సహాయం అందించిన పరిపూర్ణ చారి, సునీల్, సతీష్, పాపరావు గార్లను ఉపాధ్యాయులు అభినంధించినరు. ఈ సమ్మేళనం కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మరియు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణి

*నులిపురుగుల నివారణ మాత్రలు అందజేత..

*విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని హితవు.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10:

పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ…. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు.అందులో భాగంగా కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సెల్ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థినిలకు ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు.

నులిపురుగు నివారణ మాత్రల పంపిణి..

నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నులి పురుగు నివారణ మాత్రలైన ఆల్బెండజోల్ టాబ్లెట్లను ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలకు పంపిణీ చేశారు. అంతకుముందు నులిపురుగులతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక విద్యార్థిని తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లను తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలలో పలమనేరు కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి.బాలాజీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ అర్పిత, ఎంఈఓ బాలసుబ్రమణ్యం,బాలిగోన్నత పాఠశాల హెచ్ఎం లత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి,పీ.ఎం. ఓ.ఓ మధు,ఎం. పి.హెచ్.ఈ.ఓ జయశంకర్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బి సి,కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, శ్రీధర్, కిరణ్, బీ ఆర్ సీ కుమార్, సుధాకర్, శంకరప్ప తదితరులు ఉన్నారు.

20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క

కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి

కొత్తగూడ,నేటిధాత్రి:

ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ విన్నపాన్ని తెలియజేశారు వెంటనే సానుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు.
10 లక్షల రూ.. గల నూతన రేకుల షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం మరియు 10 లక్షల రూ.. గల గుండం చెరువుకు స్నాన ఘట్టాలు మెట్లు భక్తుల వసతి కోసం మొత్తం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
ఏజెన్సీ ప్రాంతంలో అటు పాకాల సరస్సు ఇటు గుండం సరస్సు పచ్చని ప్రకృతి నడుమ అందమైన కాకతీయులనాటి క్రీస్తుపూర్వం దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం ప్రతి మహాశివరాత్రి సందర్భంగా.. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు కళ్యాణ ఘట్టంలో భక్తులు చుట్టూ నలుమూలల కొత్తగూడ , పోగుళ్లపల్లి ఓటాయి రాంపూర్ ఎదులపల్లి, వేలుబెల్లి, కోనాపూర్ సాదిరెడ్డిపల్లి ఎంచగూడా, మండలంలోని అన్ని గ్రామాలతో పాటు… నర్సంపేట , ఖానాపూర్, చెన్నారావుపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, ములుగు, దుగ్గొండి, వరంగల్, మండలాల నుండి భక్తులు పోటెత్తుతారు స్వామి వారి కళ్యాణ ఘట్టంలో భాగంగా… సంకీర్తనలు భజనలు శివనామ నామంతో ఓం నమశ్శివాయ అంటూ ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతుంది భక్తుల సౌకర్యం కోసం ముందుగాk మన మంత్రిగారు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు గుండం దేవాలయ కమిటీ సభ్యులు. మంత్రి ఆదేశాల మేరకుపండితులు భాను శాస్త్రి వేద మంత్రోచ్ఛారణ నడుమ వారి దివ్య కరకరములచే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి,
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీరనేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు,
భానోత్ విజయ రూప్సింగ్ మాజీ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి,
పులుసం పుష్పలత సరోజన మాజీ జెడ్పిటిసి,
బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్
ఇరుప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
గట్టి బాబు మాజీ సర్పంచ్, గట్టి రమేష్, గుల్లపల్లి శ్రీనివాస్, లక్కాకుల రాజు, వద్ది సోమయ్య, బిట్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు

వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో శ్రీ జిట్టా ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలను, ధ్వజ స్థంభం మరియు బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి రక్షణగా నిలబడే ఆంజనేయ స్వామి వారిని అలాగే గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయిని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణంలో ప్రతిష్టించుకొన్న ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తులతో కిటకిటలాడాలని, ఇక్కడ ప్రతిష్టించుకొన్న ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చాలని, స్వామి దర్శనం చేసుకొంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ దేవాలయ అభివృద్ధి బాధ్యత నాది కూడా అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని అందరం కలిసి మరింత అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు .ఈ కార్యక్రమంలో శివప్రసాద్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, జే.చంద్రశేఖర్ , మురళి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ కరాటే పోటీల్లో బాలాజీ విద్యార్థుల పథకాల ప్రభంజనం

నర్సంపేట టౌన్, నేటి ధాత్రి:

మార్షల్ ఆర్ట్స్ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఈ కరాటే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునే అద్భుతమైన కళ అని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూలు విద్యార్థులు షోటోకాన్ జపాన్ కరాటే ఇండియాహంబు సంస్థ ఆదివారము నాడు నర్సంపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని 54 పథకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసన అభినందన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో మన పాఠశాల నుండి కటా, కుమ్తే విభాగాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 20 గోల్డ్ మెడల్స్, 34 సిల్వర్ మెడల్స్ సాధించడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.టీం ఛాంపియన్షిప్ ఒకటి గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా చైర్మెన్ కరాటేలలో అద్భుతమైన శిక్షణను ఇచ్చిన కరాటే మాస్టారు రచ్చ భవానీచంద్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాలాజీ టెక్నో స్కూల్లో చదువుతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. కరాటే, భగవద్గీత శ్లోకాలు, యోగా, అబాకస్‌ మొదలగు అంశాల్లో తగిన శిక్షణ ఇస్తూ విద్యార్థుల్లో వికాసాన్ని కలిగించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.రియాజుద్దీన్, క్రాంతి కుమార్, రామ్మూర్తి, యాకూబ్ రెడ్డి లతోపాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా 76వ పుట్టినరోజు జరుపుకున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి/బాన్సువాడ నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తన 76వ పుట్టిన రోజు సందర్భంగా బాన్సువాడ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్రోస్ శ్రీ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో అనేక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ పోచారం సేవలను ప్రశంసించారు.

ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువ ద్వారా సాగు నీరు అందించాలి.

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

చిట్యాల,నేటిధాత్రి :

ఎస్సారెస్సి డిబిఎం 38కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మండల కేంద్రంలో సోమవారం రోజున మాట్లాడుతూ రాష్టంలో సాగు నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యిందని, భూగర్భజలాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం యాసంగి పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉందని, రైతులు అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారని, రైతులు ఆరుగాలం కష్ట పడి పని చేసి పంట చేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఇబ్బందుcలు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి ఈప్రాంత రైతుల సంక్షేమం కోసం ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ ద్వారా రేగొండ, చిట్యాల, టేకుమట్ల లోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగి రాజు,జీడి రాజు, బండారి రాజయ్య తదితరులు పాల్గొన్నారు..

‘ఆప్‌’ను ముంచిన అవినీతి వరద!

ఢల్లీి ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం

అవినీతి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆప్‌ అగ్రనేతలు

ఓడి గెలిచిన రాహుల్‌

ఆప్‌ ఓటమికి ఆరు కారణాలు

ఉద్యమ నేత నియంతగా మారితే ఫలితం ఇదే

ఆప్‌ ఓటమితో విపక్షాల్లో నైరాశ్యం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

శనివారం జరిగిన ఢల్లీి ఎన్నికల ఫలితాల్లో 48 స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకున్న భారతీ యజనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢల్లీి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితం కాగా రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‘సున్నా’ సీట్లతో మరో చెత్త రికార్డు సృష్టించింది. ఆప్‌ అగ్రనేతలైన కేజ్రీవాల్‌, సిసోడియా, సత్యేంద్రజైన్‌ వంటి నాయకులు ఓడిపోయారు. వీరుముగ్గురూ లిక్కర్‌ స్కామ్‌లో జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఓటమితో ఆప్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అతిశి, కల్కా నియోజకవర్గం నుంచి గెలవడం గుడ్డిలో మెల్ల. ఢల్లీి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ ఓటమి నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢల్లీి సచివాలయాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులు తరలించవద్దని ఆదేశాలు వెళ్లాయి. 

ఆప్‌ ఉత్థాన పతనాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థాపన జరిగిన కొద్ది నెలల్లోనే అంటే 2013లో ఢల్లీి అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ల్లో 28 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్య పరచింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసినా కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కూలిపోవడంతో, 2015లో ఢల్లీి అసెంబ్లీ 70 స్థానాల కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా 68 సీట్లు గెలుచుకోవడంతో మిగిలిన రాజకీయపార్టీలు ఆశ్చర్యంతో పాటు అయోమయంలో వుండిపోయాయి. 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి తమదే విజయం అన్న విశ్వాసంతో వున్న ‘ఆప్‌’కు ఓటమి రూపంలో గట్టి దెబ్బ తగిలింది. అసలు ఆప్‌ పార్టీ ఓటమి పాలవడం రాజకీయాల్లో సహజమనుకు న్నా, ఈసారి ఆప్‌ అగ్రనాయ కులంతా ఓటమిపాలవడం కోలుకోలేని దెబ్బ! రాహుల్‌ చద్దా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఈ ఓటమి దెబ్బకు ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ సమకూర్చి చేతులు కట్టుకొని నిలబడిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌్‌ మాన్‌ ఇక ముందు మాట వింటారా? ఇప్పుడు ఎన్నికైన వారు, ఓటమిపాలైన అగ్రనాయత్వం మాట ఎంతవరకు వింటారనేవి పెద్ద ప్రశ్నలు.

అగ్రనేతల ఓటమి

ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఢల్లీి స్థానం నుంచి భాజపా అభ్యర్థి పర్వేశ్‌ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా జంగ్‌పూరలో 675 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి తర్వీందర్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు.ఢల్లీి ముఖ్యమంత్రి అతిశి కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి 3521 ఓట్ల మెజారిటీలో భాజపా అభ్యర్థి రమేష్‌ బిదూరీపై విజయం సాధించారు. మొదటి రౌండ్‌ నుంచీ వెనుకంజలో వున్న ఆమె చివర్లో పుంజుకొని విజయబావుటా ఎగురవేశారు. ఆప్‌ సీనియర్‌ నేత సత్యేంద్ర జైన్‌ షాకూరి బస్తీలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నాల్‌ సింగ్‌ 20998 ఓట్ల తేడాతో గెలిచా రు. మరో ఆప్‌ ముఖ్య నేత సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేటర్‌ కైలాష్‌ స్థానంలో పరాజయం పాలయ్యారు.ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖారాయ్‌ 3188 ఓట్ల తేడాతో గెలిచారు. బిజ్వాసన్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్‌ గెహ్లోత్‌ విజయం సాధించారు. ఆప్‌ అభ్యర్థి సురేందర్‌ భర ద్వాజ్‌పై 9833 ఓట్ల తేడాతో గెలిచారు. గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అర్వీందర్‌సింగ్‌ లవ్లీ, ఆప్‌ అభ్యర్థిపై 12748 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఓడి గెలిచిన రాహుల్‌

ఒకవిధంగా చూసుకుంటే ఢల్లీి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఓడి గెలిచారనుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా రాహుల్‌కు పోటీగా కేజ్రీవాల్‌ సు స్థిరమయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఒకపక్క ఇండీ కూటమితో మరోపక్క కాంగ్రెస్‌తో అవసరానికి అనుగుణంగా డబుల్‌గేమ్‌ ఆడుతూ వస్తున్నారు. దీనికితోడు మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి వంటి రాష్ట్రాల్లో వరుస ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ పార్టీకిరాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పెద్ద ‘గుదిబండ’గా మారారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధానిపదవిపై ఆశలు పెరిగాయి. వీరిలో మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ ఓటమి పుణ్యమాని రాహుల్‌కు ఒక పోటీదారు రంగంనుంచి తప్పుకున్నట్లయింది.

ఆదినుంచీ ప్రధాని పదవిపైనే కన్ను

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుంటూ, తర్వాత దేశ ప్రధాని అయ్యా రు. ఆయన పేరును భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశం ఒక్కసారి ఆయనవైపుచూడటం మొదలుపెట్టింది. గుజరాత్‌ అభివృద్ధి నమూనా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఒక దిక్సూచిగా మారింది. ఇదిలావుంటే కేజ్రీవాల్‌ కూడా ఢల్లీి పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి ప్రధానిపదవికి అభ్యర్థిగా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీలో మరొకరిని ఎదగనివ్వలేదు, మహారాష్ట్ర, గోవా, పంజాబ్‌, హర్యానా వం టి రాష్ట్రాల్లో బలమైన నాయకుడుగా ఎదుగుతారని అనుమామున్నవారినల్లా తొక్కేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ను గాంధీల కుటుంబం ఎట్లా శాసిస్తుందో, ఆప్‌ను ‘అతడే ఒక సైన్యం’ మాదిరిగా శాసించాలనుకున్నారు. ఈ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశాధినేతగా ఎదగాలన్న ఆతృతలో పార్టీలో నాయకులను ఎదగనీయకుండా తన గొంతు తానే కోసుకున్నారని చెప్పాలి. ఆప్‌ పార్టీకి ప్రారంభంలో విద్యావంతులు విపరీతంగా మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ సభ్యులుగా గర్వంగా చెప్పుకునేవారు. ఉద్యోగులుగా ఉన్న యువత తమ జీతాల్లో కొంత శాతం పార్టీ ఫండ్‌గా ఇచ్చిన రోజులున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ మారిపోయారు. అవకాశాలు దొరకనంతవరకు ‘నీతి’గా వుంటూ, అవకాశం దొరికినతర్వాత ‘అవినీతికి’ తెరలేపారు. ఏటా మీడియా మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.400కోట్లు ఖర్చుచేయడం, సం క్షేమం పేరుతో పరిధికి మించి ‘ఉచితాలు’ ప్రకటించడం వంటివి ఆయనకు మొదట్లో మద్దతి చ్చిన విద్యావంతులను దూరం చేశాయి. ‘సంక్షేమం’ కూడా ఒక పరిమితి వరకే అధికారానికి దోహదం చేస్తుంది. మితిమీరితే వికటిస్తుంది. ఇప్పుడు జరిగిందిదే! చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా ప్రచారం చేసుకోవడానికి వెనుకాడలేదు. ఆవిధంగా అన్నీ తానే చేసానని చెప్పుకోవడానికి తహతహలాడారు. మరి నిజాలెప్పుడూ నిప్పుమాదిరిగానే వుంటాయి. ఏది నిజమో తెలిసొచ్చిన ప్రజలు ఇప్పుడాయన్ను పక్కనపెట్టారు. 

మోదీ బ్రహ్మాస్త్రం

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశలకు ఏవిధంగానైనా గండికొట్టాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్రమోదీ ఢల్లీి ఎన్నికల్లో తన చివరి ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రచారం చివరిదశలో గురిచూసి వదిలారు. బడ్జెట్‌లో ఆదాయపుపన్ను మినహాయింపు 12లక్షలకు పెంచడమే ఆ బ్రహ్మాస్త్రం. ఢల్లీిలో మూడొంతులవరకు వేతనజీవులే వుండటం విశేషం. ఇంతస్థాయిలో ఐ.టి. మినహాయిం పునిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా అప్పుడే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. గత శనివారం అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్‌ ఈమేరకు చేసిన ప్రకటన ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతుందన్న అందరి అంచనా నిజమైంది. నిజానికి కేజ్రీవాల్‌ మధ్యతరగతిని ప్రధానంగా ఆకర్షించే ఉద్దేశంతో ఐ.టి.ని రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కానీ మోదీ ప్రభుత్వం దీన్ని ఏకంగా రూ.12లక్షలకు పెం చింది. ఆవిధంగా కేజ్రీవాల్‌ కంటే రెండాకులు ఎక్కువగానే చదివానని భాజపా నిరూపించుకుంది.

మధ్యతరగతివారే అధికం

ఢల్లీిలో ఎగువ మధ్యతరగతి పదిశాతం, దిగువ మధ్యతరగతి 48 నుంచి 50శాతం వరకు వుంటే మిగిలినవారు ఇతర వర్గాల ప్రజలు. వీళ్లను ఆకట్టుకోవడానికి ఆప్‌, భాజపాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయవర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథ కాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్‌ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణల తో సతమతమైంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు కాకుండా కాంగ్రెస్‌ కు పడటం ఆప్‌ దారుణంగా దెబ్బ తినడానికి మరో కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని నగరంలో వెయ్యికి పైగా మురికివాడలున్నాయి. గతంలో బంగ్లాదేశ్‌నుంచి, పాక్‌నుంచి వలసలు వచ్చి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వర్గాల పూర్తి మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు సాధిస్తూ వచ్చింది. ఈ వర్గాలకే కేజ్రీవాల్‌ వెన్నుదన్నుగా నిలిచారు. రాయితీలు, ప్రయోజనాలు ఈ వర్గాలకే కల్పిస్తూ వచ్చారు. ఈ వర్గాల మతపెద్దలను ఎప్పటికప్పుడు సంతృప్తిపరచే విధంగా ప్రవరిస్తూ, హిందువులను తీవ్ర వివక్షకు గురిచేసిన చరిత్ర కేజ్రీవాల్‌ది. కరోనా కాలంలో కూడా ఆయా మతవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప హిందువులకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. చివరకు దీపావళి కూడా జరుపుకోకుండా ఆంక్షలు విధించి ఘనత కేజ్రీవాల్‌ది. నూతన సంవత్సర వేడుకల్లో, విజయోత్సవాల సందర్భంగా, ఇతర మతాల వేడుకల్లో బాణాసంచా కాల్చుకోవచ్చు. అదే హిందువులు బాణాసంచా కాలిస్తే కేసులు నమోదయ్యేవి. పౌర సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూవర్గాలను చీల్చి మైనారిటీల పేరుతో నడిపిన రాజకీయం నేపథ్యంలో ఢల్లీిలో భాజపా భవితవ్యం ఒక దశలో ప్రశ్నార్థకంగా మారిన మాట నిజం! కేజ్రీవాల్‌ పాలన క్రమంగా ఢల్లీిని మినీ పాకిస్తాన్‌, మినీ బంగ్లాదేశ్‌గా మారుస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 

చెప్పిందొకటి చేసింది మరొకటి

కేజ్రీవాల్‌ ఓటమికి లిక్కర్‌ స్కామ్‌ ప్రధాన కారణమన్న వాదన బాగా వినబడుతున్నప్పటికీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమికి అదొక్కటే కాదు, అధికారంలో వుండగా కేజ్రీవాల్‌ చెప్పిన మాటలకు, చేసినచేతలకు పొంతన లేకపోవడం మరో కారణం. పైకి నీతులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతి భయంకరంగా తాండవమాడటానికి కేజ్రీవాల్‌ వైఖరే కారణం. సంక్షేమ పథకాలకు మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకమే. కేజ్రీవాల్‌ వాళ్లకు అనుకూలంగా వున్నప్పటికీ, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలే అధికారాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు భాజపా ఎంతో సంయమనంతో, సమ తుల్యంతో వ్యవహరించాల్సివుంటుంది. తానిచ్చిన సంక్షేమ వాగ్దానాలను అమలు పరుస్తూనే, ఢల్లీి పాలనను అట్టగుస్థాయి నుంచి మరింత క్రమబద్ధీకరించాల్సి వుంటుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది గుర్తెరిగి పాలన సాగించాలి. 

కేజ్రీవాల్‌ ఆరు తప్పులు 

నిజం చెప్పాలంటే కర్ణుడు చావుకు ఆరు కారణాలు అన్నట్టు, కేజ్రీవాల్‌ పతనానికి ఆయన చేసిన ఆరు తప్పులు ప్రధాన కారణం. కేజ్రీవాల్‌ నిజానికి అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి వ్యతి రేక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, నాయకుడిగా ఎదిగారు. జన్‌లోక్‌పాల్‌ వ్యవస్థను తీసుకురావాలన్నది అన్నాహజారే ఆకాంక్ష. అయితే కేజ్రీవాల్‌ పార్టీ పెట్టాలని ఉత్సాహం చూపి నప్పుడు అన్నాహజారే వారించారని చెబుతారు. ఆయన మాట వినకుండా కేజ్రీవాల్‌ ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (సామాన్యుల పార్టీ)ని స్థాపించారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన నియంతగా వ్యవహరించడం మొదటి తప్పు. ఆయన పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 70శాతం మందికి ఆయన్ను కలవడం సాధ్యమయ్యేది కాదు. కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ వద్దకు మాత్రమే వారికి అవకాశం వుండేది. ఇందుకు ఉదాహరణ స్వాతీ మాలివాల్‌. ఆమె కేజ్రీవాల్‌ ను కలవడానికి వస్తే చావుదెబ్బలు బహుమానంగా లభించాయి. ఇటువంటి కారణాలవల్ల కేజ్రీవాల్‌ పార్టీ నాయకులకు, కేడర్‌కు దూరమైపోయారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఏడు గురు ఆప్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారంటే, కేజ్రీవాల్‌ నియంతృత్వం ఏస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తనకు పార్టీలో ఆప్తమిత్రులుగా వున్న వారిని ఒక్కొక్కరిగా దూరం చేసుకున్నారు. స్వాతీ మాలివాల్‌కు మహిళల్లో గట్టి పట్టుంది. ఈమె మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. ఈమెను శీష్‌మహల్‌లో కేజ్రీవాల్‌ పి.ఎ. విభవ్‌కుమార్‌ చితకబా దారు. దీంతో ఆమె పార్టీకి దూరమైంది. ఆమె పట్టుపట్టి మరీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్యమం రూపంలో చేసింది. కుమార్‌ బిశ్వాస్‌ తొలి టర్మ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గొప్పకవి, వ్యంగ్యంగా చతురోక్తులు విసరడంతో దిట్ట. ఈయన్ను కూడా దూ రం పెట్టడంతో ఆయన తన కవిసమ్మేళనాలు, సమావేశాల ద్వారా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తన సమావేశాల్లో ఆయన కేజ్రీవాల్‌ను వ్యంగ్యోక్తులతోచేసిన విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. స్వాతీమాలీవాల్‌, కుమార్‌ బిశ్వాస్‌లు ఆప్‌కు కంచు కోటగా వున్న మధ్యతరగతి ఓటర్లను దూరం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వీరిని దూరంచేసుకోవడం కేజ్రీవాల్‌ రెండో తప్పు. ఇక మూడోతప్పేమిటంటే, తనపై లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణ లు వచ్చినప్పుడు తక్షణం రాజీనామా చేసివుండాల్సింది. అలా చేయలేదు సరికదా, ముఖ్యమంత్రిపదవిలో కొనసాగుతూనే జైల్లోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో పాటు కొందరు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా జైలుకెళ్లారు. దీంతో ఆయనతో పాటు మంత్రుల అవినీతి ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇది ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఇక నాల్గవ తప్పు శీష్‌మహల్‌ విషయంలో ఆ యనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం కావడం. ఆయన కట్టుకున ్నశీష్‌మహల్‌ వైభవంపై ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాను తీసుకెళ్లి మొ త్తం చూపించి వుండాల్సింది. అట్లా చేయలేదు. రూ.33కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి శీష్‌మహల్‌కు మరమ్మతులు చేయించారని కాగ్‌ నివేదిక పేర్కొనడంతో దుమారం చెలరేగింది. భాజపా దీ న్ని ప్రధాన ఆయుధంగా మలచుకుంది. మధ్యతరగతి ప్రజల్లోకి ఇది బాగా వెళ్లింది. ఫలితంగా కేజ్రీవాల్‌పై ఢల్లీివాసుల్లో అనుమానాలు పెరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం అప్పట్లో మీడియాలోవిపరీతంగా చర్చలకు దారితీసింది. ఐదో ప్రధాన తప్పిదం ముస్లింల ఓట్లు ఎక్కడ కాంగ్రెస్‌, ఎం.ఐ.ఎం.లు చీల్చుకుంటాయన్న భయంతో ఈసారి ఆయన పూర్తిగా హిందూ ఓటర్లను విస్మరించడం. గతంలో బీజేపీ జై శ్రీరామ్‌ అంటే ఆయన జై హనుమాన్‌ అని నినాదమిచ్చి హిందువులకు తాను అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పూర్తిగా ముస్లింల భజనకే పరిమితమయ్యారు. ఆయన చేసిన తప్పుల్లో అత్యంత కీలకమైందిగా దీన్ని పరిగణించాలి. దీంతోపాటు ఢల్లీి ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న మతపరమైన పోలరైజేషన్‌ను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారు. ఇక ఆరవ తప్పు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం. ఆవిధంగా ప్రకటించిన తర్వాత వీరిని మార్చటం సాధ్యంకాదు. అట్లాచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతా యి. లాక్కోలేని, పీక్కోలేని దుస్థితి ఇది. ప్రకటించిన వారిలో కొందరు ఓటమి పాలవుతారన్నది ఖాయంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో 20మందిని మార్చడంతో, అసంతృప్తి చెలరేగింది. ఇక భాజపా తన అభ్యర్థులను అందరికంటే చాలా ఆలస్యంగా ప్రకటించింది. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీలో పరిణామాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు గెలుపు అచంనాలు వేస్తూ, అభ్యర్థులనుఎంపిక చేసింది. ఒకరకంగా కేజ్రీవాల్‌ ముందుగా అభ్యర్థులను ప్రకటించి భాజపాకు మేలు చేశారనే చెప్పాలి. దీంతో పాటు తాను అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ముందుగానే ప్రకటించడం, బీజేపీ, కాంగ్రెస్‌లు తాము మరింత ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ప్రకటించడానికి దోహదం చేసింది.

గెలిచేది నేనే: నరేందర్‌ రెడ్డి.

`నాకు ఎవరూ పోటీ కాదు.

`కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ..

`సమాజాన్ని ,సామాజిక స్థితిగతులు అధ్యయనం చేశాను.

`ఉన్నత విద్యావంతుడిగా తెలంగాణలో విద్యాభివృద్ధికి కృషి చేస్తాను.

`నిరుద్యోగులకు అండగా వుంటూ ఉద్యోగ కల్పన కోసం శ్రమిస్తాను.

`సామాజిక సమస్యలపై అవగాహన వుంది.

`విద్యా వ్యవస్థ మీద పూర్తి అవగాహన వుంది.

`రేపటి తరం గురించి ఆలోచించే శక్తి వుంది.

`రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

`ఉద్యోగులకు మెరుగైన జీతాలను సకాలంలో అందించేది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

`బిజేపి తో గతంలో ఒరిగింది లేదు.

`ఇప్పుడు కొత్తగా జరిగే మేలు లేదు.

`పదేళ్ల క్రితం 2 కోట్ల ఉద్యోగాలిస్తామని దేశ ప్రజలను మోసం చేసింది బిజేపి.

`తెలంగాణ రాష్ట్రమంటేనే బిజేపికి చిన్న చూపు.

`బడ్జెట్‌ లో తెలంగాణ ప్రస్తావన కూడా వుండదు

`తెలంగాణకు అదనంగా రూపాయి ఇచ్చేది వుండదు.

`తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపిలను గెలిపిస్తే రూపాయి తెచ్చింది లేదు.

`తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు.

`తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌.

`తెలంగాణ అభివృద్ధి చేసేది కాంగ్రెస్‌.

`ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

`తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చాం.

`జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఏటా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తాం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది నేనే..ఇది అతి విశ్వాసంతో చెబుతున్న మాట కాదు…పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికే నేను నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల ప్రచార పర్యటనల్లో తెలిసిన అంశం. తెలుసుకున్న విషయం. పైగా నేను దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా సుపరిచితమైన విద్యావేత్తను. నా విద్యా సంస్దలు నా గెలుపుకు ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో వున్న నమ్మకం మరో కారణం. దానితోపాటు అంకితభావం కల్గిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు కలిగిస్తున్న విశ్వాసం కూడా నాలో మరింత నమ్మకాన్ని పెంచింది. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదరణ మర్చిపోలేనది. నాలుగు జిల్లాల్లో వున్న పట్టభద్రులు స్పందన కూడా నాకు ఎంతో బలాన్ని ఇస్తోంది. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే..గెలిచేదినేనే అనే నమ్మకం మరింత నాలో బలపడిరది. అయితే ఇంకా నేను మరింత ప్రచారం కొనసాగించాల్సిన అవసరం వుంది. ప్రత్యర్ధులకు అవకాశమివ్వకుండా ముందుకు సాగాల్సి వుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగాల కల్పన నా విజయానికి బాటలు వేస్తుందని బలంగా నమ్ముతున్నానంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ది డాక్టర్‌. వి. నరేందర్‌ రెడ్డి నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుకిచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో అనేక అంశాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగానలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా వుంది. కాంగ్రెస్‌ పార్టీకి సమీపంలో కూడా ఏ పార్టీలేదు. పైగా తెలంగాణ యువతకు కాంగ్రెస్‌ పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం వుంది. గత పదేళ్ల కాలంలో పది ఉద్యోగాలు కూడా కల్పించలేని బిఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే నిలబెట్టుకుంటూ వస్తోంది. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 60వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలేదు. గత పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో అసలే చూడలేదు. గత ఏడాదే ఇంకా అనేక ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. కాకపోతే తర్వాత వెంటనే వచ్చిన పార్లీమెంటు ఎన్నికల సమయానికే మూడు నెలల సమయం పట్టింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే 60వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లనే ఇన్ని ఉద్యోగాలు ఇంత తక్కువ సమయంలో ఇచ్చేందుకు దోహడపడిరది. అందువల్ల తెలంగాణలో యువత, నిరుద్యోగులు అంతా కాంగ్రెస్‌ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఇంకా కొన్ని వేలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయడం జరిగింది. ఇలా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తూ నిరుద్యోగ సమస్యను లేకుండా చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. అందువల్ల ఈ ఎన్నికల్లో తన గెలుపు పెద్ద కష్టం కాదు. పైగా నా ప్రత్యర్ధులెవరూ నాకు సమీపంలో కూడా వుండే అవకాశం లేదు. బిజేపి పార్టీకి తెలంగాణలో చోటు లేదు. బిజేపి కేంద్ర నాయకత్వానికి తెలంగాణ మీద ప్రేమే లేదు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు బిజేపి చేసిందేమీ లేదు. ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం బడ్జెట్‌లలో తెలంగాణ పదానికి కూడా చోటు వుండడం లేదంటే తెలంగాణ ప్రజలు బిజేపిని ఎందుకు నమ్మాలి? తెలంగాణ నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపిలను గెలిపిస్తే, అందరూ కలిసి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని తెలంగాణ పట్టభద్రులు నమ్మడం అనేది కల. 2014 ఎన్నికల్లో బిజేపి గెలిస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అంటే ఈ పదేళ్ల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏనాడో మర్చిపోయింది. రైటైర్‌ అయిన ఉద్యోగాలను కూడా నింపలేకపోతోంది. దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచింది. పదేళ్ల క్రితం వున్న నిరుద్యోగ సమస్యకు ఇప్పటికీ పొంతన లేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఉద్యోగాలకు 2లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారన్న వార్త విన్నాం. అది కూడా ప్యూన్‌ పోస్టు అని అందరం ముక్కున వేలేసుకున్నాం. అంటే దేశంలో బిజేపి పాలిత రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగ కల్పన చేపట్టారా? అదీ లేదు. దేశంలో బిజేపి పార్టీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. జిఎస్టీని తెచ్చిన పారిశ్రామిక రంగాన్ని మొత్తం దివాళా తీయించారు. చిన్న చిన్న వ్యాపారులను నిలువునా ముంచారు. ప్రజల మీద పన్నుల భారం వేసి ప్రజలను హడలగొడుతున్నారు. కష్టపడి రోజూ కూలీ సంపాదించుకునే సామాన్యుడు బతకలేని పరిస్దితులు తెచ్చిపెడుతున్నారు. అయినా బారత్‌ వెలిపోతోందని, వికసిత్‌ భారత్‌ అంటూ ప్రజలను మతం మత్తులో మభ్యపెడుతూ రాజకీయం చేయడం తప్ప బిజేపి ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. యువత భవష్యత్తుకుబాటలు వేస్తున్నదేమీ లేదు. అందుకే తెలంగాణలో బిజేపికి చోటు లేదు. ఇతర పార్టీలకు అసలే చోటు లేదు. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నాకు సమాజం తెలుసు. సామాజిక సమస్యలు తెలుసు. ప్రజల జీవన విధానం తెలుసు. పల్లె జీవితాలు ఎలా వుంటాయో తెలుసు. పల్లెలో జీవనోపాధి ఎంతవరకు వుంటుందోతెలుసు. నిజానికి ఉపాధి, ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదరుచూసేది గ్రామీణ విద్యావంతులే. వారికి గ్రామంలో సరైన ఉపాది వుండదు. ఎలాగైనా మంచి ప్రభుత్వ ఉద్యోగమో..లేక అంతకు సమానమైన ప్రైవేటు ఉద్యోగమైనా పొందాలని ఎంతో కష్టపడుతుంటారు. వారికి భరోసా ఇచ్చేవారు వుండరు. వారి ఆశలను గత ప్రభుత్వం నెరవేర్చింది లేదు. దాంతో పల్లె యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. వారికి ఒక దారి చూపాల్సిన అవసరం వుంది. పల్లె యువతకు ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేయడంలో స్వయం ఉపాధి రంగాలలో వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఉద్యోగాలు వేసేలా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఇక ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు వస్తుంటాయి. అందులో ప్రతి పరిశ్రమలోనూ తెలంగాణ వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించేలా చూడాల్సి వుంటుంది. ఇవన్నీ వాటిపై అవగాహన వున్న నాలాంటి వారికి మాత్రమే సాద్యమౌతుంది. నా విద్యా సంస్దల్లో కూడా ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎంతో మందికి ఉపాధి కల్పించేందుకు వీలు కూడా వుంది. విద్యారంగం, వ్యవస్ద మీద కూడా పూర్తి అవగాహన వుంది. పరిజ్ఞానం వుంది. ప్రపంచ విద్యా విధానంలో వుస్తున్న మార్పులను ఎప్పటికిప్పుడు అద్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, మన విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టడం వంటివి చేయాలంటే నా లాంటి విద్యావేత్తకు కొంత వెసులుబాటు వుంటుంది. మిగతా వారికి ఈ అవకాశం వుండదు. ఎందుకంటే విద్యా సంస్ధల అదినేతగా వున్నందున దేశంలోని విద్యా విదానం, విదేశాలలో విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు సమాచారం వుంటుంది. మన విద్యార్ధులకు ప్రపంచ పరిజ్ఞానం అందించే విద్య అందించేందుకు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ప్రభుత్వానికి నివేదికలు, సూచలునలు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈ ఎమ్మెల్సీ ఎంపికకు తాను మాత్రమే అర్హుడనని చెప్పగలను. విద్యావంతులైన నిరుద్యోగులు రేపటి వారి భవిష్యత్తు కోసమే కాకుండా, వచ్చే తరాలకు సంబంధించిన మేలు కూడా కోరుకోవాల్సిన అవసరం వుంది. అందువల్ల పట్టభద్రులంతా తనను గెలిపించి, రేపటి తెలంగాణ భవితకు నా తోడ్పాటును అందించేందుకు వీలు కలగాలంటే, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.

ఢీల్లీలో భాజపా గెలుపు..దేశానికి మలుపు

కోలాహాలంగా బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు

శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భం గా బిజెపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరవింద్ క్రేజీ వాల్ హామీలు ప్రజలు నమ్మలేదని ఆఫ్ మరియు కాంగ్రెస్ ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఫలితాలను బట్టి అర్థమవు తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లోను ఢిల్లీ ప్రజలు బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించా రు. వాయు,రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు.ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికీ మలుపని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రాయ రాకులమొగిలి,మండల బిజెపి నాయకులు, మండలమంతా బిజెపి నాయకులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

టీ.ఎస్.జే.యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగపూరి నాగరాజ్ నియామకం

వరంగల్, నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రజర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్. జే.యూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ కి చెందిన రిపోర్టర్ నాగపురి నాగరాజు (వి6 టీవీ) ను నియమిస్తూ టి.ఎస్. జే.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. జర్నలిజానికి వృత్తి విలువలు, సూత్రాలను నిలబెట్టడంలో అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగపూరి నాగరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం తో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినందుకు టి ఎస్ జె యు రాష్ట్ర అధ్యక్షులు నారగాని పురుషోత్తం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి తోకల అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించి న వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండామోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి అవునూరి కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్స్ కృష్ణ, గంగరాజు, యూనియన్ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని, తెలంగాణలోని జర్నలిస్టులందరికీ మద్దతు ఇచ్చే టీ.ఎస్.జే.యు సంఘాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తానని నాగపూరి నాగరాజ్ పేర్కొన్నారు.

error: Content is protected !!
Exit mobile version