బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన..

బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల పిఈటీ అసభ్యకర ప్రవర్తన

మోహన్ నాయక్ కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ ముందు నిరసన.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బిట్స్ స్కూల్ లోనే విద్యార్థి నీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మెసేజ్లు పంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ ముందు నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా టౌన్ అధ్యక్ష కార్యదర్శులు నందకిషోర్ వికాస్ మాట్లాడుతూ. జిల్లా బిట్స్ స్కూల్లోని విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తక్షణమే వారిని విధుల్లో నుంచి తొలగించాలని దాంతోపాటు విద్యార్థినిలను మెసేజ్లు పెట్టి ఇబ్బందికి గురి చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి టౌన్ కమిటీ గా డిమాండ్ చేస్తున్నాము.తాము చదువు చెప్పే విద్యార్థినీల పట్ల విద్యార్థులను టార్గెట్ చేసుకొని వారిని సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టి ఇబ్బంది గురి చేసిన వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా చూడాలని కోరారు..

బీసీ రిజర్వేషన్లపై విశారదన్ మహారాజ్ పిలుపు: సంగారెడ్డిలో నిరసన…..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T130857.795.wav?_=1

 

 

బీసీ రిజర్వేషన్లపై విశారదన్ మహారాజ్ పిలుపు: సంగారెడ్డిలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు నిరసన తెలిపారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే 9వ షెడ్యూల్లో చేర్చాలని, దీనికై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మహేందర్ మహారాజ్ డిమాండ్ చేశారు.

అధిక మొత్తంలో జూదమాడుతున్న 11మంది జూదరులపై కేసు నమోదు…

అధిక మొత్తంలో జూదమాడుతున్న 11మంది జూదరులపై కేసు నమోదు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల
నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని రాజోల గ్రామంలో జర్నప్ప వ్యవసాయ క్షేత్రంలో చెరుకు తోటలో జూదం ఆడుతున్న 11 మంది జూదరులను నేడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుండి రూ:1,80,000 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన బిఆర్ఎస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T125655.471.wav?_=2

 

పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మ్యాథరి ఆనంద్ తల్లి మ్యాథరి మానెమ్మ గారు ఇటీవలే మరణించడం జరిగింది.. శుక్రవారం రాజనెల్లి గ్రామంలో జరిగిన వారి పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన నామ రవి కిరణ్ నివాళులర్పించాను..ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నాను…. “

రైతులకు సబ్సిడీపై యంత్రాలు: వ్యవసాయ అధికారి వెల్లడి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T124543.095.wav?_=3

 

 

రైతులకు సబ్సిడీపై యంత్రాలు: వ్యవసాయ అధికారి వెల్లడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఫార్మ్ మిషనరీ పథకం కింద రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. స్ప్రేయర్లు, రోటోవేటర్లు, బ్రష్ కట్టర్లు, సీడ్ డ్రిల్, ఎంబీ పౌ వంటి మొక్కలు బట్టే మిషిన్లు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. యంత్రాలు కోరుకునే రైతులు తమ ఏఈఓలను సంప్రదించి, దరఖాస్తు, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు అప్లికేషన్ ఫారం సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T124035.141.wav?_=4

 

 

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యారాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం
నపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు
రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
లయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు

రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

‘‘కౌలు’’, ‘‘పట్టాల’’ మధ్య కయ్యం!

`‘‘సీఎం’’. రేవంత్‌ రెడ్డి కి నాయకులు తెచ్చి పెడుతున్న తలనొప్పులు.

`ముదురుతున్న లొల్లులు…పార్టీలో లుకలుకలు!

`కాంగ్రెస్‌ పార్టీ లో ఈ రెండు వర్గాలున్నాయా!

`అధిష్టానానికి తెలియకుండానే రాజకీయాలు సాగుతున్నాయా?

`అసంతృప్తులు కాంగ్రెస్‌ లో పెరిగిపోతున్నారు.

`అసలైన కాంగ్రెస్‌ లో అసమ్మతి వాదులు పెరుగుతున్నారా?

`జీవన్‌ రెడ్డి రాజేస్తున్న మంటకు లేదు అంతం.

`జగిత్యాలలో రోజు రోజుకూ ముదురుతున్న విభేదం.

`అసలు పట్టాదారులం మేమంటూ జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

`కౌలు దారుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపణలు.

`మంత్రుల వల్ల నలిగిపోతున్నామంటూ విమర్శలు.

`బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సంజయ్‌ వల్ల పార్టీకి నష్టమంటూ ఆవేదనలు.

`పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల మధ్య సమస్యలు.

`నాయకుల మధ్య పొడసూపుతున్న విభేదాలు.

`మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు.

`ఆధిపత్యాలలో తవ్వుకుంటున్న అగాధాలు.

`పార్టీకి నలుసులుగా మారుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు.

`ఏదో ఒక వివాదం రగిలిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు.

`ఆ మధ్య ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్‌ మధ్య మాటల యుద్ధం.

`‘‘ఎంపి’’ కి కాదు సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివాదం.

`ఎప్పుడూ ఏదొ ఒక చిటపట రాజేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో వరుస వివాదాలతో కాంగ్రెస్‌నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా వున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక కాక రేపుతూనే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే వున్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆ రాజకీయంలో చలి కాచుకునేలా చేస్తున్నారు. పార్టీ పరువును, ఓ స్ధాయిలో వున్న నాయకులు కూడా బజారు కీడుస్తున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఎలా గెవాలన్నదానిపై ఎరికీ శ్రద్దలేదు. కాని వివాదాలు మాత్రం రాజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మంత్రి అడ్లూరి లక్షణ్‌ ముందు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయం లేదు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లింది లేదు. ఆయనకు వరసగా అవకాశాలిస్తూనే వున్నారు. కాని ఆయన ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయినా తనదే పెత్తనం కావాలని ఆరాటపడుతున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్‌రెడ్డి, మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ కోసం నానా యాగీ చేశారు. ఇప్పుడు తనకు ప్రాదాన్యత దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తాము పట్టాదారులమంటూ లెక్కలు చెబుతున్నాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌలుదారులంటున్నాడు. కౌలు దారులు పట్టాదారుల మీద పెత్తనం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తన వాదన అరణ్య రోధన అని తెలిసినా జీవన్‌ రెడ్డి ఊరుకోడం లేదు. తన వితండ వాదం సరైంది కాదని తెలిసినా వివాదాలు సృష్టించకుండా వుండడం లేదు. కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదని అంటారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వున్నప్పుడు ఆ పార్టీలోనే పాలకపక్షం, ప్రతిపక్షం కూడా కలిసే వుంటాయంటారు. కాంగ్రెస్‌ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం అనేది వుండదు. నాయకుల తీరు మరీ మితిమీరితే తప్ప చర్యలుండవు. పార్టీలో నాయకులు చేసే పనిని, చేసే ప్రతి వ్యాఖ్యను పట్టించుకోవడం అనేది సహజంగానే వుండదు. అందువల్ల ఆ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్చగా చెప్పుకునే అవకాశం వుంటుంది. అదే కాంగ్రెస్‌ పార్టీ కొంప ముంచుతుంది. నాయకుల మధ్య వున్న విభేదాలు ఎప్పటికప్పుడు బైట పడుతూనే వుంటాయి. కాంగ్రెస్‌పార్టీలో ఏ నాయకుడికి అన్యాయం జరిగినా బహిరంగంగానే చెప్పుకునే వెసులుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ధైర్యం వున్న నాయకులు కొంత మంది తమ గళాన్ని సవరిస్తూనే వుంటారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలా చెప్పగలిగే నాయకులలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎవరికీ భయపడరు. మొహమాటం అసలే చూపించరు. తాను మనసులో ఏమనుకున్నా సరే దానికి బైట పెడతారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే వుంటారు. 2023 ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ కల తీరలేదు. దాంతో ఆయన సొంత ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తన అసమ్మతిని చూపిస్తూనే వుంటారు. తాజాగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే రైతులకు న్యాయం చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇటీవల వైన్స్‌ టెండర్ల విషయంలోనూ తన ఇలాఖాలో రూల్‌ వేరుగా వుంటుందని ప్రకటించారు. తన నియోజకవర్గంలో బెల్టు షాపులు వుండకూడదని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా వైన్స్‌ నిర్వహణ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టే పని ఆయన చేస్తూనే వున్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూనే విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించునేవారు లేకుండాపోయారు. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి. నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికలైన ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయనకు ఆ పదవి దక్కలేదు. దొంతి మాధవరెడ్డి తీరు కూడా సిఎం. రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక మహాబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఓ దినపత్రికలో రాసిన వ్యాసం సంచలనాన్ని సృష్టించింది. పంచాయితీలకు, నగర పంచాయితీలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్‌ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంపటి రగిలిస్తూనే వున్నారు. ఆ మధ్య కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కూడా అసమ్మతి వాదిగానే ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యే ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోలేరు. వారి వ్యాఖ్యలను ఎవరూ ఖండిరచలేరు. అదంతే కాంగ్రెస్‌ పార్టీ..అసమ్మతి లేకపోతే సాగదు. ఇక ఓ వారం రోజులుగా కరీంనగర్‌కు చెందిన ముగ్గురుమంత్రుల మధ్య అగాధం కనిపించింది. జూబ్లీహిల్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ రాక ఆలస్యం కావడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ నోరు జారిన సంగతి తెలిసిందే. తాను మంత్రిని ఉద్దేశించి చేయలేదని మంత్రి పొన్నం చెప్పిన మాట విన్నదే. మంత్రి పొన్నం చేసిన ఆలస్యానికి కొంత రాజకీయ రగడ జరిగిందే. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మంత్రి పొన్నం మాటలు బైటకు రాగానే, క్షమాపణ చెబితే పోయేది. కాని బేషజానికి వెళ్లడం వల్ల ఆలస్యం అమృతం విషమైంది. మంత్రి పొన్నం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది. దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. మంత్రి పొన్నం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు మీడియా ముందుకు వచ్చారు. మంత్రి అడ్లూరికి అండగా నిలిచారు. దాంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మంత్రి పొన్నం క్షమాపణ చెపాల్సిందే అని డిమాండ్‌ చేయక తప్పలేదు. ఈ వివాదం ముగిసింది అనే లోపు మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. తనపై సామాజిక మాధ్యమాలలో టార్గెట్‌ చేసి కులం ఆధారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల బాద్యతలో వున్న తాను, అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే తనకు పేరు వస్తుందన్న అక్కసుతో తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని వివేక్‌ అన్నారు. అంతే కాకుండా మంత్రి లక్ష్మణ్‌ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్దం కావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. లక్ష్మణ్‌కు రాజకీయ ప్రోత్సాహాన్ని కల్పించిందే తన తండ్రి వెంకటస్వామి అని గుర్తు చేశారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వివేక్‌ అన్నారు. కొంత మంది పనిగట్టుకొని తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని అంటూనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రాజకీయం నేర్పిందే మేము అన్నారు. తన తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతోనే మంత్రి అడ్లూరి రాజకీయంగా ఎదిగారని అన్నారు. అయితే మంత్రి పొన్నం ఎపిసోడ్‌లో పక్కనే మంత్రి వివేక్‌ కూడా వున్నారు. దాంతో ఆ సమయంలోనే మంత్రి అడ్లూరి కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వివేక్‌ తనను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను మంత్రి వివేక్‌ పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి అడ్లూరి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురు మొదటి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటిసారేమంత్రులయ్యారు. కాకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకస్వామిలు గతంలో ఎంపిలుగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలవలేదు. తొలిసారి ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యారు. అదే దారిలో అడ్లూరి కూడా మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అడ్లూరి మాత్రం ఈ మధ్యనే మంత్రి అయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని ఈ ముగ్గురి మధ్య మాత్రం సయోధ్య ఎంత కుదిరిందో ఎవరికీ తెలియదు. నల్లగొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బం ది కరమైన పరిస్ధితులే సృష్టిస్తున్నాయి. ఆ మధ్య డైరీ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీద తుంగతుర్తి ఎమ్మల్యే మందులు సామెల్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే ఎమ్మెల్యే ఒక దశలో ప్రజలు గాని, పార్టీ నాయకులు ఏ సమస్యలున్నా ముందు తన వద్దకే రావాలంటూ హుకూం జారీ చేశారు. ముందు ఎంపి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్దకు వెళ్లొద్దని ఆయన ముందే తేల్చి చెప్పారు. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు. పార్టీని ముంచడానికి ఈ చిన్న సమస్యలే పెద్దవై పార్టీని ఆగం చేస్తాయి.

యాసంగి వరిధాన్యం బోనస్ రైతులకు చెల్లించాలి…

యాసంగి వరిధాన్యం బోనస్ రైతులకు చెల్లించాలి

మొక్కజొన్నలకు మద్దతు ధర లభించక నష్టపోతున్న రైతులు

రైతుల యాసంగి బోనస్ డబ్బులకై ఈనెల 25న చలో కలెక్టరేట్

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.తక్షణమే యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని రైతు రాజ్యాన్ని తెస్తామని గొప్పలు చెప్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అమ్మిన వెంటనే చెల్లిస్తామని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల 36 వేల టన్నుల క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన 1168 కోట్ల రూపాయల బోనసు ను నాలుగునెలలైనా జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అధిక వర్షాలతో యూరియా కొరతతో ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు మొక్కజొన్న వరి పత్తి పంటలు వేసిన దిగుబడి తగ్గి పంటలు చేతికి వస్తున్న దశలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలోనే మొక్కజొన్నలు ముందుగా చేతికి అందే వరంగల్ జిల్లాలో రైతులు ఇప్పటికే నూటికి 70 శాతం మంది దళారులకు వ్యాపారులకు మద్దతు ధర కన్నా క్వింటాకు ఐదు వందల నుంచి 600 రూపాయల వరకు తక్కువకు అమ్ముకొని తీవ్రంగా దోపిడికి గురయ్యారని మొక్కజొన్నలన్నీ దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవడం ఎవరి కోసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యవసాయ పంటల కొనుగోలు ప్రణాళిక లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే యాసంగి వరి ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే బోనస్ డబ్బులను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు అందుకోసం ఈనెల 25న వరంగల్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రైతులను ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కలకొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం…

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం

బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

ఎర్రం సతీష్ కుమార్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి
యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీడియాపై దాడులు హేమమైన చర్య…

మీడియాపై దాడులు హేమమైన చర్య

ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌ ఉపయోగకరం…

పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌ ఉపయోగకరం

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కపాస్ కిసాన్ యాప్‌ ను ప్రారంభించిన కలెక్టర్

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్‌ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్‌ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా
దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.

 

ఆధార్ నంబర్‌తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్‌లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్‌లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్‌బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్‌ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి…

ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి

◆:- మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝఖరాంగం మండల కేంద్రంలో ఎంవీడీవో కార్యాలయం లో ఎంపీడీవో సుజాత మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితులలో ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి వ్యక్తిని ప్రాణాపాయం నుండి ఏ విధంగా తప్పించవచ్చో అవగాహన కల్పించారు. ట్రైనర్స్ ఎం ఎల్ హెచ్ పి మురళీకృష్ణ, హెచ్ ఈ ఓ గోవర్ధన్, సిహెచ్ సుధాకర్, ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు అంగన్వాడి టీచర్స్ గ్రామపంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి…

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి

బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బీసీల రిజర్వేషన్ కోసం 24నా జరగనున్న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం మహేందర్ ప్రైవేట్ వేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 24 వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, విశారదన్ మహరాజ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘాలు, కుల సంఘాలు బీసీ కులస్తులు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బీసీ ప్రజానీకం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎందుకు నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇకనుంచి అయిన వారి పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణ, రమేష్, బిక్షపతి, సలీం ,లక్ష్మణ్ కుమార్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా…

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి..

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల

మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు

ఆదివారపు సంత తాత్కాలిక మార్పు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల,నేటిధాత్రి

 

 

పట్టణంలో మున్సిపాలిటీ రోడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ ఆద్వర్యంలో తొలగించారు.ఈ సందర్భంగా కమిషనర్ సుష్మ మాట్లాడుతూ మున్సిసల్ పరిదిలో రోడ్లను ఆక్రమించుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబందనలు అతిక్రమిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతాయని పాత సీఎంఎస్ గోదాం సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కాంపౌండ్ నిర్మాణాన్ని తొలగించుటకు నోటీసులు జారీ చేసినప్పటికి ఆవ్యక్తి స్పందించకపోగా ఆ నిర్మాణాన్ని కూల్చివేత జరిపినట్టు తెలిపారు.

ప్రతి ఆదివారము నిర్వహించే పశువుల సంత తాత్కాలిక మార్పు

ప్రతిఆదివారము నిర్వహించే పశువులు,గొర్లు,మేకల సంతల స్థలంలో నవంబర్ 3న మహారుద్రయాగం ఉన్నందున ఏర్పాటు అవుతున్న పనులను పరిశీలించి 2వ తేదీన జరిగే పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు సమీపంలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు..

ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పార్టీ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ ఎంపీటీసీ శంకర్ పాటిల్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్,సంగ్రామ్ పాటిల్,మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, బొప్పన్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ అమృత్ శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, సి విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, సోషల్ మీడియా మండల ఇంచార్జి నవీన్ ఆర్.టి.ఐ యాక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గోపాల్ నమస్తే ఇందు జహీరాబాద్ ఇంచార్జ్ అఖిల్ తదితరులు పాల్గోని ఉదయ్ శంకర్ పాటిల్ శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు,

error: Content is protected !!
Exit mobile version