ముమ్మరంగా సెంటర్ లైటింగ్ మరమ్మత్తు పనులు

గ్రామపంచాయతీ కార్యదర్శి రత్నాకర్

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం నుండి పత్తిపాక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగడం లేదు రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లు వెలగకపోవడంతో రోడ్డు అంధకారంగా తయారైనది రోడ్డుపై లైటింగ్ లేక రోడ్డు పై నడిచివెళ్లే వాళ్ళు చీకట్లో ఏ వాహనం వచ్చి మమ్మల్ని ఢీ కొట్టుతోందని భయంతో గురవుతున్నారు.అది గమనించిన గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శి తో చెప్పడం వల్ల వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బంది యాకయ్య,ప్రమోద్ ఆధ్వర్యంలో చెడిపోయిన విద్యుత్ బాక్సులు మార్పిడి చేసి ఈ రోడ్డుపై ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ లో ఉండే లైట్లు రెండు వైపులా వెలిగేటట్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి , సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కాపుల నాగరాజు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

భద్రాచలం నియోజకవర్గంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

భద్రాచలం నేటి దాత్రి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు

మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా నే
అభివృద్ధి కోసం పరితపించే పోరిక బలరాం నాయక్ గారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు

మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ

గత పదిలుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి కొంటుపడిందని, మళ్లీ ఇంకో ఐదు ఏళ్ళు అభివృద్ధిలో వెనక్కి పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీతోనే భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ ని కూడా అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి విచ్చే విధంగా ప్రజలు దీవించాలని.

భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా, ఎమ్మెల్యే నిధులు,ఎంపీ నిధులు తెచ్చుకుని భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం ఉందని.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క రెవిన్యూ శాఖ మంత్రివర్యులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వారి ముగ్గురు సహకారంతో భద్రాచలం నియోజకవర్గని వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎన్నికల అయన ప్రచారంలో ప్రజలకు వివరించారు.

ప్రజలతో మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ

దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ, పదియేలు తెలంగాణను పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పై ఆలోచన లేకుండా భద్రాచల రామాలయాన్ని విస్మరించారని.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలాన్ని అభివృద్ధి చేసి తీరుతుందని.

పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా, తిరుమల తిరుపతి , యాదాద్రి తరహాలో గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం లాగా రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము,రాగం సుధాకర్, ఆలీ పాషా, నర్రా రాము,దుద్దుకూరు సాయిబాబా, గండేపల్లి హనుమంతరావు, ఎండి నవాబ్, అన్నేం రామిరెడ్డి,అన్నేం వెంకటేశ్వర రెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి,తుమ్మల రాణి,ఒంగోలు దేవకి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అధ్యక్షులు పాల్గొన్నారు.

ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆల

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామంలో శివాలయం పునర్నిర్మాణం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన,విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అధితిగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించరు.భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో మహేష్ హేమలత వివాహనికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించరు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి భారీ గా చేరికలు

వనపర్తి నేటిదాత్రి
ఏబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు, జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ సత్య శీలా రెడ్డిలా ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీలో చేరిన గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందూరి చంద్రయ్య
తాడిపత్రి మాజీ సర్పంచ్ లోకా రెడ్డి
_పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్థానికుల సలహా , సూచనల, కోరిక మేరకు పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి
ఈ మేరకు శుక్రవారం వనపర్తి నంది హిల్స్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఉపాధ్యక్షులు కందూరు చంద్రయ్య, మాజీ సర్పంచ్ లోకా రెడ్డితో పాటు మరో 50 మంది బీ ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
వీరికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి గౌరవం దక్కలేదని కేవలం ప్రజా ప్రతినిధులుగా ఉన్నామే తప్ప పాలన మాత్రం మా చేతులలో లేకుండా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు
_ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు పేర్కొన్నారు_*కార్యక్రమంలో గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జె.ఈ.ఈ ఉత్తమ విద్యార్థినికి ఐక్యవేదిక ఘన సన్మానం.

వనపర్తి నేటిదాత్రి

*వనపర్తి జిల్లా కేంద్రంలోని 30 వార్డులో సుదర్శన్ రెడ్డి, వనజ కూతు రు తేజకు రాష్ట్రవ్యాప్త జె ఈ ఈ పరీక్షల్లో 99.4% మార్కులు సాధించి ఐక్యవేదిక 30 వ వార్డు సబ్యుల తరపున ఘనo గా సన్మానించారు
ఈ సన్మాన కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు 30 వార్డు సబ్యులు విజేత రాములు, శ్రీనివాసులు, విష్ణు, రామ్ దేవ రెడ్డి , బిక్షపతి, శివకుమార్, నరేష్, కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యుపాల్గొన్నారు.

హర్వెస్టర్ ఢీకొని వ్యక్తి మృతి

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో వరి పంటను కోస్తుండగా వరి కోసే యంత్రం (హార్వెస్టర్) ఢీకొని టీలావత్ తండాకు చెందిన టీలావత్ వెంకన్న (36) శుక్రవారం తెల్లవారుజామున అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. హార్వెస్టర్ ద్వారా కోసిన వరి ధాన్యాన్ని తన ట్రాక్టర్ ద్వారా తరలించడానికి వచ్చిన వెంకన్న, వరి కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హార్వెస్టర్ ఢీకొని, దాని కిందపడి మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న మరిపెడ రెండో ఎస్సై సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా, మృతుడు వెంకన్నకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాజన్న ఆలయంలో అవినీతి ఆరోపణలు

ఆలయంలోని 13 మంది సిబ్బందిపై చర్యలు

వేములవాడ నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏ చిన్న ఇష్యూ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అది పెను సంచలనమే. అలాంటిది గురువారం ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 13మందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఏ.ఈ.వోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం 14 మందిపై చర్యలు తీసుకున్నారంటూ వినబడిన మరొకరి ప్రస్తావన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రసాదాల తయారీ పర్యవేక్షకుడికి దేవాలయ ఖాతాలో డబ్బులు జమ చెయ్యాలని ఆదేశించడంతో అవినీతి అధికారుల సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజన్న ఆలయ అధికారులు, సిబ్బందిపై చర్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆందోళనలో మరికొందరు

గుడిని మింగే వాళ్ళు ఉంటే, గుడితో పాటు లింగాన్ని మింగే మహానుభావులు ఆలయ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో 13మంది ఆలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఎంతోమందిపై నిఘా కొనసాగడం, చాలా మంది ఉద్యోగులు, సిబ్బందిపై నిత్యం అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతుండటంతో ఇందులో తమ పేర్లు ఉంటాయేమోనని, ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకునే పరిస్తితి ఇప్పుడు ఆలయ అధికారులు, సిబ్బందిలో నెలకొంది.

ప్రభుత్వం మారడమే ప్రధాన కారణమా….?

వాస్తవానికి ఈ 13మంది ఉద్యోగులకు సంబంధించి 2021లోనే విజిలెన్స్ విచారణ పూర్తయింది. కానీ నివేదిక ఫైల్ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వద్ద పెండింగ్ లో ఉండటం, సదరు ఉద్యోగులకు అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఫైల్ ముందుకు కదలలేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరిపై చర్యలు తీసుకోవడం వీలు పడలేదనే వాదనలు లేకపోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సీఎం రేవంత్ రాజన్న దేవాలయ అభివృద్ధిపై దృష్టి సారించారో ఇక అప్పటి నుండి ఆలయానికి మంచి రోజులు వచ్చాయనే అందరూ భావించారు.

అదే సమయంలో గత ప్రభుత్వంలో ఏళ్ల తరబడి కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ను ఇతర శాఖకు బదిలీ చేసి హనుమంతరావును నూతన కమిషనర్ గా నియమించారు. దీంతో ఆప్పటి పెండింగ్ ఫైల్ లు అన్ని ఇప్పుడు ముందుకు వస్తున్నాయని ఈ క్రమంలోనే రాజన్న ఆలయ ఫైల్ ముందుకు రాగా దీనిపై చర్చించి, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు కమిషనర్ హనుమంతరావు వేములవాడ పర్యటనకు వచ్చిన రెండు రోజుల్లోనే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం పై వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

14వ వ్యక్తి ఎవరూ…?

మరోవైపు 13మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న మరుక్షణమే ఇక్కడ మరో కొత్త చర్చ మొదలైంది. ఆనాడు విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలో మొత్తం 14మంది పేర్లు ఉండగా, ఇప్పుడు చర్యలు తీసుకున్న వారిలో 13మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చర్యలు తీసుకోని మిగతా ఆ ఒక్కరు ఎవరు అంటూ చర్చ మొదలైంది. అయితే మిగిలిన ఆ ఒక్క వ్యక్తి ఆలయ ఈ.ఓ కృష్ణ ప్రసాద్ అంటూ ఆలయ ఉద్యోగుల్లో బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

స్పందించని ఈవో

అయితే ఇదే విషయంపై ఆలయ ఈ.వో కృష్ణ ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా ఆయన ససేమిరా స్పందించేందుకు సుముఖత చూపలేదు. తర్వాత పూర్తి వివరాలు చెపుతాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దాంతో బయట వినిపిస్తున్న ఆ 14వ అధికారి ఈ.వోనే అనే వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనాప్పటికీ ఆలయ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ భుజాలు తడుపుకుంటున్న గుమ్మడికాయ దొంగలపై కూడా చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

కాంగ్రెస్‌కు కర్రువాత ఖాయం.

https://epaper.netidhatri.com/

` కారుకు ఎదురులేదు…బిఆర్‌ఎస్‌ గెలుపుకు తిరుగులేదు!

`పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కే మెజారిటీ సీట్లు.
కేసిఆర్‌ రోడ్‌ షోలకు ప్రజలు బ్రహ్మరథం… పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ గెలుపుకు సంకేతం అంటున్న రాజ్యసభ సభ్యుడు

వద్దిరాజు రవిచంద్ర, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు… ఆయన మాటల్లోనే..

` కాంగ్రెస్‌ పని అయిపోయింది.

`బిజేపికి దేశంలోనే ఎదురుగాలి వీస్తోంది.

`తెలంగాణలో కారుకు తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు.

`అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ చేసిన అతి ప్రచారం నమ్మారు.

`కాంగ్రెస్‌ అబద్ధాలు నిజమనుకొని విశ్వసించారు.

`కేవలం అధికారం కోసం కాంగ్రెస్‌ అబద్ధాలు ప్రచారం తేలిపోయింది.

`మళ్లీ ప్రజలు కేసిఆర్‌ నాయకత్వం వైపు చూస్తున్నారు.

`కేంద్రంలో బిఆర్‌ఎస్సే కీలకం కానుంది.

`తెలంగాణ సంక్షేమం కాంక్షించేది కేసిఆర్‌ మాత్రమే.

`తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసిఆరే.

`కాంగ్రెస్‌ కోరుకునేది రాజకీయాలు మాత్రమే.

`నెలలోనే కాంగ్రెస్‌ బండారం బైట పడిరది.

`తెలంగాణ ప్రజలను గోస పెడుతోంది.

`కాంగ్రెస్‌ను జనం నమ్మే స్థితిలో లేరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. బిఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం దగ్గర్లోనే వుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ మెజార్టీ సీట్లు సాధించే క్రమంలో వుంది. ప్రజలు మళ్లీ బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వం కోరుకుంటున్నారు. కేసిఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. తెలంగాణ సాధించిన కేసిఆర్‌కు ప్రజల సాధకబాధకాలు తెలుసు. తెలంగాణ సమస్యలు తెలుసు. వాటికి పరిష్కారం కూడా కేవలం కేసిఆర్‌కే తెలుసు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాని వాటి అమలు సాధ్యాసాధ్యాలను భేరీజు వేసుకోలేదు. అందుకు కసరత్తు జరగలేదు. ఎలా అమలు చేయాలన్నదానిపై ఎలాంటి ప్రణాళిక లేదు. దాంతో నోటికొచ్చిన వాగ్ధానాలు కురిపించారు. గ్యారెంటీలంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా గెలిచాక వాటిని అమలు చేయలేక చతికిల పడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేక సతమతమౌతున్నారు. ప్రజలనుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. రైతులను నుంచిశాపనార్దాలు ఎదుర్కొంటున్నారు. అన్నం ఉడికిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చాలు. కాంగ్రెస్‌ పాలన బాగుందా లేదా? అన్నది తేల్చేందుకు ప్రజలకు నెల కూడా పట్టలేదు. ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేస్తామన్నారు. డిసెంబర్‌9 నాడే రెండు లక్షల రుణ మాఫీ అన్నారు. ఆ తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రైతు రుణ మాఫీ మీద మళ్లీ మాట మార్చారు. ఇప్పుడు కొత్తగా ఆగష్టు 15 అంటున్నారు. అంతేకాకుండా ఆ గడువులోపైనా ఏక కాలంలో రుణ మాఫీ చేస్తారా? అన్నదానిపై భరోసా లేదు. రైతు బంధు పేరు మార్చి భరోసా అని చెప్పి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకున్నది. ప్రజలకిచ్చిన భరోసాని గాలికొదిలేసింది. రాజకీయాలు తప్ప, పాలన చేతగాని వాళ్లు, పాలకలౌతే, నిత్యం కుర్చీల కొట్లాటే వుంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అదే జరుగుతోంది. అందుకే గత పదేళ్లుగా కాంగ్రెస్‌ను నమ్మేందుకు ఇష్టపడలేదు. ఒక్కసారి ప్లీజ్‌..ప్లీజ్‌ అంటూ వేడుకున్న కాంగ్రెస్‌ను కనికరించినందకు ప్రజలు బాధపడుతున్నారు. అర్హత లేని వాళ్లను అందలమెక్కిస్తే ఇలాగే వుంటుందని ఆవేదన చెందుతున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ వైపు ప్రజలు ఆసక్తిగా చూసున్నారు. కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా వున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కారుకు తిరుగులేదు. బిఆర్‌ఎస్‌ గెలుపుకు ఎదురులేదు. మెజార్టీ సీట్లు బిఆర్‌ఎస్‌కే కట్టబెటేందుకు ప్రజలు ఎప్పుడో డిసైడ్‌పోయారు. అందుకే ఇటీవల కేసిఆర్‌ సభలకు, రోడ్‌షోలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలుపు ఇదే సంకేతం. అంటున్న రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే….
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయింది.
మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ అసలు రంగు బైట పడిరది. కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు..నష్టాలు..కరువులు, బాధలు, ప్రజలకు వెతలు. ప్రజల జీవితాల మధ్య అగాధాలు..రైతన్నల ఆర్తనాదాలు..ఆడ బిడ్డలకు నీళ్ల బిందెల గోసలు..కరంటు కోతలు. ఇన్ని కష్టాలు ఏక కాలంలో పెట్టే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అందుకే ప్రజలు ఆ పార్టీని పూర్తి స్ధాయిలో గత శాసన సభ ఎన్నికల్లో నమ్మలేదు. అత్తెసరు మెజార్టీ కట్టబెట్టారు. బలమైన ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ను ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ ఏ మాత్రం ఎటమటం చేసినా తోకలు కత్తిరించేందుకు బిఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. కాని ముఖ్యమంత్రే కత్తెర్లు జేబులో తిరుగుతుంటానంటున్నారు. ఇదెక్కడి విచిత్రమో..రాజకీయ వైచిత్యమో రేవంత్‌ రెడ్డే చెప్పాలి. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నామా? చూశామా? ఒక ముఖ్యమంత్రి ప్రతి పక్ష నేతల పేగులు మెడలేసుకొని తిరుగుతానన్న సందర్భాలున్నాయా? ముఖ్యమంత్రి స్ధాయిలో వున్న వ్యక్తే శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు మానవ బాంబులౌతారని అనొచ్చా? ముఖ్యమంత్రి ప్రజలకు ఆదర్శంగా వుండేలా వుండాలి? తప్ప ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టేలా వుండకూడదు. ఏ రైతుల ఓట్లతో గద్దెనెక్కారో..ఆ రైతులే రైతుబంధు గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటూ మంత్రులు మాట్లాడడంతో కాంగ్రెస్‌ అంటేనే ప్రజల్లో హేవ భావం కలిగింది. ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చలేరు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్‌ మబ్బులు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్‌ అసలు రంగులు బైట పడుతున్నాయి. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు కాంగ్రెస్‌ పాలకులు రోజుకో ముచ్చట చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత సేపు గత మా ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలతో కాల యాపన తప్ప , కాంగ్రెస్‌ చేసేదేమీ లేదు. ఏ వర్గానికి కాంగ్రెస్‌ న్యాయం చేస్తున్న లేదు అన్నది తేలిపోయింది.
ఇక మళ్లీ కేసిఆర్‌ యుగం మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పుడున్న పరిస్దితుల్లో కారును తట్టుకునే స్ధితి ఏ పార్టీకి లేదు. రాదు కూడా…కారుకు ఎదురు నిలబడడం అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లే అన్నది కాంగ్రెస్‌, బిజేపిలకు అర్ధమైంది. బిఆర్‌ఎస్‌ అంటే రాజకీయాలకు, సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌. నాయకులను, ప్రజా సేవకులను తయారు చేసే కార్మాగారం. కేసిఆర్‌ శిక్షణలో ప్రజా చైతన్యాన్ని నేర్చుకున్న గులాబీ సైనికుల ముందు ఏ పార్టీ శ్రేణులు నిలబడలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి ప్రచారం, దుష్ప్రచారం..అసత్య ప్రచారం..అర్దం లేని ప్రచారం.. చేసి అలవి కాని హమీలు గుప్పించిన కాంగ్రెస్‌ పార్టీకి నూకలు తెలంగాణలో చెల్లినట్లే.. ఇక పార్లమెంటు ఎన్నికల్లో చేయి తిరగబడినట్లే…మళ్లీ ప్రజలకు అభయ హస్తం అన్న అబద్దపు మాట వినిపించకుండా సరైన గుణపాఠం తప్పదన్నట్లే…ప్రజల ఆలోచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ బిఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు కట్టబెడితేనే తెలంగాణ బాగు పడుతుందని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైన బిఆర్‌ఎస్‌ను కాదనుకున్నందుకు, కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించినందుకు తిప్పలు పడుతున్నారు. గెలిపించిన ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి, ఎక్కే ప్లైట్‌,దిగే ఫ్టైట్‌ అన్నట్లు డిల్లీకి చక్కర్లు కొట్టడానికే కాంగ్రెస్‌ పాలకులకు సరిపోతోంది. ఇక ప్రజలు సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడిది. ప్రజా సంక్షేమానికి సమయమెక్కడిది. అందుకే ప్రజల గురించి ఆలోచనలేని కాంగ్రెస్‌ను పక్కన పెడితే గాని కాంగ్రెస్‌కు గుణం రాదు. కాంగ్రెస్‌కోరుకునేది కేవలం రాజకీయం మాత్రమే. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు పక్కన పెట్టనున్నారు. తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌కు మెజార్టీస్ధానాలు కట్టబెట్టేందుకు సిద్దపడుతున్నారు.
అసలు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధుల పూర్వాశ్రమాలు, మూలాలు ఎక్కడివో ప్రజలకు కూడ తెలుసు. ఎందుంకంటే కాంగ్రెస్‌కు పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేరు.
కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో మాత్రమేవుంది. నాయకుల కొరత మెండుగా వుంది. కాంగ్రెస్‌ నమ్మి రాజకీయాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, నాయకుల కర్మాగారామైన బిఆర్‌ఎస్‌ నుంచి నేతలు కాంగ్రెస్‌ దిగుమతి చేసుకున్నది. టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది. ఈ విషయం ప్రజలకు తెలియదా? ప్రజలు అంత అమాయకులనుకుంటున్నారా? శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ గెలవాలంటే రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను గెలిపించాలని మెలిక పెడితే, ప్రజలు ఊరుకుంటారా? కర్రు కాల్చి వాత పెడతారు… కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా చేస్తారు. పార్లమెంటు స్దానాలలో కాంగ్రెస్‌ను ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తారు.ఇదే నిజం..ముమ్మాటికీ తధ్యం…కారు గెలవడం తెలంగాణకు చారిత్రక అవసరం. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు శ్రీకారం. ప్రజల సంక్షేమానికి మార్గం. అందుకే కాంగ్రెస్‌ను రాజకీయాలకు దూరం తరిమితే తప్ప, తెలంగాణలో సంక్షేమాలు ప్రజల దరి చేరవు. కేసిఆర్‌ నాయకత్వంలోనే మేలైన పాలన. మెరుగైన జన జీవనం. మళ్లీ తెలంగాణ అన్నపూర్ణగా అవతరణం.

ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

మే 2న నోటిఫికేషన్…

మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ..

మే 10న నామినేషన్ల పరిశీలన..

మే 13న ఉపసంహరణకు చివరి తేదీ..

మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్..

జూన్‌ 5న కౌంటింగ్‌

కాంగ్రెస్ లో భారీ చేరికలు

@ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గెలుపు ఖాయం: దొంతి

@ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

# నెక్కొండ,నేటి ధాత్రి : నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 100 కుటుంబాలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారిని ఉద్దేశించి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నెక్కొండ మండలంలో కనివిని ఎరుగని రీతిలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు పడాలని మన సత్తా ఏంటో చూపెడదామని అసెంబ్లీ ఎన్నికల్లో మన సత్తా చాటిన తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు ఉందని అందులో మనం కూడా భాగస్వాములు అయినందుకు ఆనందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఓటర్లను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునే యత్నం కేసీఆర్ చేస్తున్నాడని, కెసిఆర్ తీరును దొంతి ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ,పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఎడ్ల కృష్ణయ్య, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ రఘు , మాజీ ఎంపీటీసీ ఈదునూరి ప్రభాకర్, రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కొల్లి సుబ్బారెడ్డి ,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో కూరాకుల నాగభూషణం సన్మానసభ

ముఖ్య అతిధులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభ బీఆర్ఎస్ పక్ష నేత,

ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్

ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్ హాలులో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో నాగభూషణం బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పుకుంటూనే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నరు
ఆయన పదేళ్ల నుంచి అత్యున్నత పదవిలో ఉన్నా కూడా కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు
మహానేత కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మోడీ పదేళ్లుగా తొక్కి పెట్టారు
కులగణన చేపట్టాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నా మోడీ పట్టించుకోవడం లేదు
కులగణన,బీసీ,మహిళా రిజర్వేషన్స్ అమలు జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని
నామ నాగేశ్వరరావు వంటి బలమైన నాయకుడు పార్లమెంటులో ఉంటేనే ప్రజల న్యాయమైన హక్కులకు పరిష్కారం దొరుకుతుంది
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతునిద్దాం
నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం
ఈ కార్యక్రమంలో “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జై యాదవ జైజై యాదవ”,”బీఆర్ఎస్ లోకసభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు

ఈ సందర్భంగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్రను పలువురు యాదవ ప్రముఖులు శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

*గోశాల లో మెగా వైద్య శిబిరం నిర్వహణ

*1093 కోడెలకు వైద్య పరీక్షల నిర్వహణ

*రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మంజు వాణి పర్యవేక్షణలో కోడెలకు వైద్య పరీక్షలు వ్యాక్సినేషన్ నిర్వహణ

వేములవాడ నేటిధాత్రి

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కోడేల కోసం ప్రభుత్వం మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది.

కోడె మొక్కులు చాలా ప్రసిద్ధి, కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

రెండు రోజుల క్రితం శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రానికి వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు రాజన్న దర్శనం అనంతరం గోశాల లను సందర్శించి, కోడెల సంరక్షణ పై తీసుకుంటున్న చర్యలకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన వైద్య చికిత్స, వ్యాక్సినేషన్ అందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కమిషనర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి 1093 కోడెలకు వ్యాక్సినేషన్ చేయడంతో పాటు వివిధ రకాల రుక్మతులతో బాధపడుతున్న వాటికి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు.

కోడెలకు ఇలాంటి వ్యాధులు ఎందుకు వ్యాపిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు వైద్యులు క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఈ నివేదికను రాష్ట్ర సీఎం ఓ కు అందించనున్నారు.

కమిషనర్ గోషాలను పరిశీలించిన విషయం సి.ఎం.ఓ దృష్టికి వెళ్లగా విషయంపై ఆరా తీసిన సంబంధిత అధికారులు పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులను మొత్తం చేసి వెంటనే రాజన్న కోడెల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, కోడెలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

సి.ఎం.ఓ ఆదేశాలతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మంజువాణి పర్యవేక్షణలో గురువారం కోడెలకు వైద్య పరీక్షలు వ్యాక్సినేషన్ నిర్వహించారు. రెండు గోశాలలో ఉన్న 1093 కోడెలకు 8 మంది వైద్యులు, 15 మంది సిబ్బంది సహకారంతో వైద్య పరీక్షలతో పాటు అవసరం ఉన్న కోడెలకు వ్యాక్సినేషన్, గాలి కొంటూ వ్యాధి టీకాలు వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కొమురయ్య ఈవో కృష్ణ ప్రసాద్ వైద్య సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా పరిషత్ సీఈవో గణపతి

జైపూర్, నేటి ధాత్రి :

గురువారం రోజున జైపూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా పరిషత్ సిఈఓ గణపతి సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ మరియు సూపర్ఇండెంట్ కుమారస్వామి ద్వారా కార్యాలయం నిర్వహణ తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జైపూర్ మండల పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల తీరును గురించి, త్రాగునీటి సదుపాయాల గురించి, పారిశుద్ధ్య కార్యక్రమాల పనితీరు గురించి మొదలగు అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఈఓ గణపతిని ఎంపీడీవో మరియు సిబ్బంది కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్
మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నాగరాణి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని, దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చూసుకోవాలన్నారు. అలాగే దోమల నివారణ కోసం మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఓరి ట్యాంకులు, సంపులు నీటితోట్ల మీద మూతలు పెట్టుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. దోమతెరలను వాడాలని, నీటి నిల్వలో ఆయిల్ బాల్స్ వినియోగించుకోవాలని, ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే దగ్గరలో ఉన్న ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని, లేకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రావాలని సూచించారు. అదేవిధంగా ఈరోజు అమ్మ కోసం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. నెలనెలా వారు పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి. ఎప్పుడు ఆరోగ్య కేంద్రానికి రావాలో సూచించారు. ప్రతి గురువారం అమ్మకోసం కార్యక్రమం ఉంటుంది కాబట్టి బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ఎం ఎల్ హెచ్ పి, సూపర్వైజర్ సునీత, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత, పీహెచ్సీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

వంద ఎలుకలు తిన్న పిల్లి..తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది

కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు స్పందించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు కేసీఆర్ బస్సు యాత్ర విమర్శించారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా కేసీఆర్ ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు ఎక్కాలని ఆయన కేసీఆర్ కు సలహానిచ్చారు. అధికారం మదంతో ప్రగతి భవన్, ఫామ్ హౌస్ గేట్లు దాటనందుకు చేతులు జోడించి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు ముందు వారి పాదాల మీద పడాలని కోరారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తప్ప పదేళ్లలో ఏనాడు జిల్లా పర్యటనలకు వెళ్ళని కేసీఆర్ కు ఇప్పుడు జనం గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. ఓట్లతో జనం వాతలు పెడితే తప్ప తెలంగాణ ప్రజలు యాదికి రాలేదని విమర్శించారు. ఓడించి ఇంట్లో కూర్చోబెడితే తప్ప సమస్యలు కళ్లకు కనిపించలేదా అని అడిగారు. ప్రజా పాలన చూసి ఓర్వలేక జనాన్ని రెచ్చగొట్టడానికి చేతి కర్ర పట్టుకుని మరీ బస్సు ఎక్కుతున్నావా కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. అమలవుతున్న గ్యారంటీలు, నిమిషం కూడా పోనీ కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలను నీ కళ్ళతో చూడు కేసీఆర్ అంటూ సలహానిచ్చారు. రూ.500 లకు గ్యాస్ సిలిండర్, 200 ల యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, కళకళలాడుతున్న స్వయం సహాయక మహిళలను పలకరించాలని కోరారు. నీ పదేళ్ల కాలంలో రుణమాఫీ కానీ రైతులతో మాట్లాడాలన్నారు. పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూసిన జనాన్ని కలువాలన్నారు. దళిత బంధు పేరుతో దగా చేసిన దళిత బిడ్డలను పలుకరించాలని, బీసీ బందు అంటూ పచ్చి మోసం చేసిన బడుగు, బలహీన వర్గాలతో మాట్లాడాలని, గొర్రెల పేరుతో మోసం చేసిన యాదవ సోదరులను, చేపల పేరుతో దగా చేసిన బెస్త, ముదిరాజ్ బిడ్డలను పలుకరించాలన్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ రాని విద్యార్థులు, ఉద్యోగాలు రాని నిరుద్యోగులను కలువాలని, కూలిన మేడిగడ్డను చూడాలని, అవినీతి కంపు కొడుతున్న మిషన్ భగీరథ నీళ్లు తాగాలని, తెలంగాణ ప్రజలకు కూతురు లిక్కర్ స్టోరీ చెప్పాలని, కొడుకు ట్యాపింగ్ కథలు వినిపించాలని, అలాగే అల్లుడు ఫామ్ హౌస్, సంతోష్ కబ్జా వ్యవహారాలు మీ గులాబీ పార్టీ నాయకుల అక్రమాలను బస్సు యాత్రలో వివరించాలన్నారు. తెలంగాణలో ఉనికి కాపాడుకోవడానికి కపట బుద్ధితో యాత్ర అంటూ బయలుదేరుతావా అంటూ నిలదీశారు. సచ్చిన పార్టీని బతికించుకోవడానికే ఈ ఆరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఒకటో, అరో సీట్లు గెలుచుకోవడానికే ఈ బస్సు బయలుదేరిందని తెలంగాణ జనానికి తెలుసన్నారు. కేసీఆర్ బస్సులో మాత్రం కాషాయం, పైకి మాత్రం గులాబీ రంగని, ఆయనవి ఊసరవెల్లి రాజకీయాలని దుయ్యబట్టారు. బిజెపితో కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలన్నదే కేసీఆర్ ఆరాటమని, కేసీఆర్, మోదీ తెరచాటు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి..వాత పెట్టిన సిగ్గు రాలేదన్నారు. కేసీఆర్ బస్సు టైర్లకు జనం పంక్చర్ చేసి పంపిస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. నీ కారును అసెంబ్లీ ఎన్నికల్లో జనం షెడ్డుకు పంపించింది మర్చిపోవద్దన్నారు. గులాబీ, కమలం బస్సు యాత్ర పైన జనం రాళ్లు వేయకుండా చూసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంందించారు. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ కూడా దాటడన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కుటుంబ సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు తెలిసింది వివరాలకు వెళ్తే భాష బోయిన బాలరాజు కుమారుడు భాష బోయిన రాహుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వారి ఇంటిలో కూలర్ వైర్ పవర్ బోర్డులో ప్లగ్గు పెడుతుండగా విద్యుత్ షాక్ రావడంతో బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు బాలుడు మృతితో నగరంపల్లి గ్రామంలో శోకసముద్రంలో మునిగిపోయింది

ఓపెన్ స్కూల్స్ టెన్త్ ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఇఓ రాంకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మండల కేంద్రము లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ టెన్త్ & ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రాంకుమార్ ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము పరీక్షలు సిసి టీవీల నిఘా మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించినట్లు వారు తెలియజేశారు మూడు పరీక్ష కేంద్రాలను సందర్శించిన డీఈఓ పరీక్షల నిర్వహణ పరీక్షా కేంద్రాలలోని మౌలిక సదుపాయాల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓపెన్ పదవ తరగతిలో 247 మంది దరఖాస్తు చేసుకోగా 214 మంది హాజరైనట్లు ఓపెన్ ఇంటర్లో 382 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 327 మంది హాజరైనట్లు వారు తెలియజేశారు. వీరి వెంట సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్ పరీక్షల సహాయకులు కుసుమ కృష్ణమోహన్ పాల్గొన్నారు

బిఆర్ఎస్ ముఖ్యనేత మారెళ్ళ సేనాపతి బిజెపిలో చేరిక

కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మారెళ్ళ సేనాపతి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రాంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వారితోపాటు సుమారు 50 మంది బిజెపి పార్టీలో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి వచ్చిన మీకు ఎల్లవేళలా మేము అండగా ఉంటామని కీర్తి సత్యపాల్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం సేనాపతి మాట్లాడుతూ గతంలో ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డానని వారన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చూసి అన్ని వర్గాల ప్రజలకు అందిచ్చేటువంటి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాళ్లకు కూడా చేయూతనిచ్చే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూసి భారతీయ జనతా పార్టీలో చేరానని నా ఊరు బాగు కోసం పార్టీ ఎదుగుదలకు నా వంతు కృషి చేస్తానని సేనాపతి అన్నారు నాతో పాటు ఉన్న నా మిత్రులందరికీ నా సహాయ సహకారాలు అందిస్తానని ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ లోకి ఆహ్వానించి నాపై నమ్మకాన్ని ఉంచిన రాష్ట్ర జిల్లా.అర్బన్ నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి ఓ బి సి జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ జిల్లా ప్రచార కార్యదర్శి మందల రఘునాథరెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి తోట ఓదెలు ఊరేటి మునిందర్ నాంపల్లి కుమార్ బోరం రాజయ్య తదితరులు బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ లో చేరిన ఆప్కో మాజీ చైర్మన్ మండల

రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నేత మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు నేత గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్లో సీనియర్ నేత పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అతనికి స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… ఉద్యమాల పోరాట గడ్డ చేర్యాల,జనగామ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తానని ఆయన వివరించారు.

error: Content is protected !!
Exit mobile version