రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నేత మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు నేత గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్లో సీనియర్ నేత పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అతనికి స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… ఉద్యమాల పోరాట గడ్డ చేర్యాల,జనగామ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తానని ఆయన వివరించారు.