మనువాదాన్ని ఓడిద్దాం..భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

నిజాంపేట్, నేటి ధాత్రి, ఏప్రిల్ 25

మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన మనువాదాన్ని ఒడించి ప్రజలందరికి స్వేచ్చ,
సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు.
డిబిఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు గురువారం నాడు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో లో రాజ్యాం పరిరక్షణ ప్రచారోద్యమం చెపట్టారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహనీయులైన పూలే,అంబేద్కర్, జగ్ జీవన్ రామ్ ల జయంతుల మహత్సోవం సందర్భంగా రాజ్యాంగ రక్షణ ప్రచారోద్యమాన్ని చెపట్టమని శంకర్ తెలిపారు. విద్య,ఉద్యోగం, ఆస్తులు,
సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరంచేసిందన్నారు.
ఈ సమావేశంలో డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,డిబిఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్,ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు సామాజిక కార్యకర్తలు మహ్మద్ సుల్తానా,
మహ్మద్ ఉమర్,పుట్ట రాజు,
డిబిఎఫ్ కామరెడ్డి జిల్లా కన్వీనర్ మేకల లావణ్య, వాణి , శోభ రామవ్వ కాంభోజ శ్రీనివాస్ జిడిపల్లి లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాకు మొట్టమొదటి డాక్టరేట్

నిజాంపేట్, నేటి దాత్రి, ఏప్రిల్ 25

ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన. మెదక్ జిల్లా వాసి బత్తుల భూపాల్
ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్రం విభాగంలో బత్తుల భూపాల్ నిజాంపేట్ మండలం నర్లాపూర్ వాసి “రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏ కేసు స్టడీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా2009-2016.” డాక్టరేట్ సాధించాడు.
వందేళ్లు చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ లో రాజనీతి శాస్రం విభాగం లో డా. ఎం రమణ ఆధ్వర్యంలో. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఏ కేసు స్టడీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా 2009 టూ 2016. పరిశోదనా చేసి పీహెచ్. డి పట్టా పూర్తి చేయడం జరిగింది. పీజీ. ఉస్మానియా యూనివర్సిటీ పూర్తి చేయడం జరిగింది, డిగ్రీ సిద్దిపేట లో బి ఎడ్ ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రథమ విభాగం లో పాస్ అయ్యి తెలంగాణ ఉద్యమం లో చురుకైనా పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటు భాగస్వామ్యం ఎన్నో వేల మందికి తెలంగాణా స్ఫూర్తి రగిలించిన విద్యార్థి ఉద్యమ సూర్యనికి,ఈ సందర్బంగా యూనివర్సిటీ ప్రొపెసార్లు పరిశోదాకా విద్యార్థులు, పీజీ విద్యార్థులు ప్రముఖ విద్యావంతులు ఎం ల్ ఏ లు,మినిస్టర్ లు, పాలక మండలి,ప్రస్తుతం పనిచేస్తున్న గవర్నమెంట్ సిటీ కాలేజీ అధ్యాపకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నా కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు శుభాకాంక్షలు హార్షం వక్తం చేశారు భూపాల్ జీవితం లో మరిన్ని విజయాలు పొందాలని దీవించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పనుల నిర్వహణ పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్ లదే

జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్య చందన

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గురువారం గుండాల మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంభందించిన తురుభాక,నర్సాపురం,లింగాగూడెం, చిమల గూడెం, కృష్ణాపురం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన తగు సూచనలు చేశారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులకు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణ పై పూర్తి స్థాయిలో సమయం కేటాయించి, పాఠశాలలో నాణ్యమైన పనులు జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని తగు సూచనలు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించిన పనులను, పాఠశాల స్థాయిలో నిర్వహించుటకు, పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన, పనులన్నింటినీ పారదర్శకంగా పూర్తి చేయాలని, మే 30 నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లు ఉన్న పాఠశాలలలో ఈ పనులను వారం లో పూర్తి అయ్యేటట్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
కమిటీ లలో గల విలేజ్ ఆర్గనైజర్లు పూర్తి స్థాయిలో పాల్గొని పనులు సవ్యంగా జరిగేలా చూడాలని సూచించారు. కమిటీ సభ్యుల సహకారంతో పనులను ప్రారంభించేందుకు తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండి పనులన్నీ పూర్తయ్యే విధంగా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
మండల స్థాయిలో ఈ పనులను,మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు పర్యవేక్షణ చేసి,ఎప్పటికప్పుడు తగు రిపోర్టును జిల్లాకు పంపించవలసి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఎంపీడీఓ సత్యనారాయణ ,ఏంఈఓ పెండకట్ల కృష్ణయ్య,ఏఈ తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగా చారి కుమారుడు ప్రణీత్-శ్రీలక్ష్మిల వివాహ వేడుకకు తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ , తాజా మాజీ సర్పంచ్ నాన బోయిన రాజారాం యాదవ్ , ఎంపిటిసి జన్ను జయరావు,నాయకులు తక్కలపల్లి మోహన్ రావు, మాలోత్ ప్రతాప్ సింగ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, క్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, నాగేల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

సెయింట్ జాన్స్ పాఠశాలలో స్కాలర్షిప్ టెస్ట్…

ప్రిన్సిపల్ పొన్నాల సుమన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

విద్యారంగంలో శరవేగంగా వస్తున్న విప్లమాత్మక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటితరం విద్యావిధానాలకి అనుకూలంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జాన్స్ పాఠశాల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహిస్తోంది. ఈనెల 29 సోమవారం ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈ స్కాలర్షిప్ టెస్టులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు వారి వారి మెరిట్ ను బట్టి ఫీజుల్లో భారీ రాయితీని కల్పించనున్నారు. టెస్టులో 90 శాతానికి పైగా మార్కులు సాధించే విద్యార్థులకు సదరు విద్యార్థి చేరే తరగతి నుండి పదవ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పొన్నాల సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 9989236655 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని అన్నారు.

ఓటు హక్కు పై అవగాహనా సదస్సు..

# ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో నిర్వహణ

నర్సంపేట,నేటిధాత్రి :

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో కళాశాల జాతీయ సేవ పథకం యూనిట్ల మరియు పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన ఓటు హక్కు పై అవగాహనా సదస్సు నిర్వహహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా డాక్టర్ డి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ హాజరు అయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ మాట్లాడుతూ భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని తెలుపుతూ ఇప్పుడు మన దేశంలో కేంద్ర ఎన్నికలు మరియు వివిధ రాష్ట్రాలలో శాశన సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంలో ఓటు హక్కుపై అవగాహనా సదస్సు నిర్వహించడం చాలా సంతోషం అని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వాయంలో ఓటు హక్కు అనేది శక్తిశాలి అని తెలిపారు. ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును తప్పనిసరిగా సక్రమంగా వినియోగించాలని సూచించారు.ఎవ్వరు కూడా ప్రలోభాలకు, ఇతర ఆశలకు లోను కాకుండా తమ ఓటు హక్కును స్వేచ్చాయుతంగా వినియోగించాలని సూచించారు. సిబ్బంది మరియు విద్యార్థులు ఓటు హక్కు పై తమ ప్రాంతాలలో అవగాహనా కల్పించి ఓటింగ్ శాతం అత్యధికం నమోదు అయ్యే విధంగా కృషి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ ఏ శ్రీనాథ్, ఎన్ఎస్ఎస్ జిల్లా అధికారి డాక్టర్ ఐ శివనాగశ్రీను, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి రమేష్, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ యం.శైలజ, టి.రమేష్, యల్.సత్యనారాయణ, డాక్టర్ బి.విష్ణు కుమార్, డాక్టర్ జి.ప్రసూన, యం.సమ్మయ్య, డాక్టర్ టి.సుమతి, యం.నరేందర్, పి.త్యాగయ్య, డాక్టర్.వి.పూర్ణ చందర్, డాక్టర్.ఆర్.కుమారస్వామి, పి.సునీల్, నిజాముద్దీన్, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.

నామినేషన్ ఘట్టం ముగిసింది.ఇక యుద్ధమే ఈ చేవెళ్ళ గడ్డపై చేతి పార్టీ ప్రభంజనమే!!

కూకట్పల్లి ఏప్రిల్ 25 నేటి ధాత్రి ఇంచార్జ్

రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాల యంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి
గురువారం దాఖలు చేసిన నామినే షన్ కార్యక్రమంలోఎమ్మెల్యే రామ్మో హన్ రెడ్డి,తెలంగాణ టిఎంఆర్
ఈఐఎస్ అధ్యక్షులు ఫాయీమ్ తో కలిసి పాల్గొన్నా రు.శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్.

గుజరాత్ సీఎం ను సన్మానం చేసిన జ్యోతి రమణ

వనపర్తి నేటిదాత్రి :
నాగర్ కర్నూల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపునకు కృషి చేయుటకు ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ ను
రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా జైంట్ ట్రెజరర్ మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాదు ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ నిచేయాలని జ్యోతి ఒక ప్రకటనలో ప్రజల ను కోరారు

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో తన స్వగృహంలో గురువారం రోజున పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో మందమర్రి మున్సిపాలిటీ మరియు మండలం, జైపూర్ మండలం, క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అధిష్టానం ఆదేశాల ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను గురించి, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మమేకమై పోతూ అవగాహన కల్పించే విధానాన్ని గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే మే 4 వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనను,రోడ్ షోలను విజయవంతం చేయుటకై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించేలా సమన్వయంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పిల్లలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి

చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం

సి.ఎస్.ఐ చర్చిలో విబిఎస్ క్లాసులు ప్రారంభం

భూపాలపల్లి నేటిధాత్రి

పిల్లలు భక్తితో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సి ఎస్ ఐ గురువు రెవరెండ్ ఎం. కనకరత్నం అన్నారు. గురువారం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో వేసవికాలం సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా వెకేషన్ బైబిల్ స్కూల్ (విబిఎస్) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లాసులు 25 నుండి మే 1 వరకు వారం రోజులపాటు జరుగుతాయని తెలిపారు. వివిధ అంశాలతో పిల్లలకి భక్తి, సామాజిక బాధ్యత లు నేర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి గాను భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర.హరీష్ రెడ్డి సుమారు 150 మంది పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం అయ్యగారు, సంకీర్తన అమ్మ, సెక్రెటరీ డి.మొగిలి,యూత్ సెక్రెటరీ జి. ప్రేమ్, గంగమని విద్యార్థులు పాల్గొన్నారు.

ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం మరియు పౌనూర్ గ్రామాలలో గురువారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనితీరును,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను మరియు పైప్ లైన్ వ్యవస్థలను తనిఖీ చేసి, అవసరం ఉన్న చోట వీలైనంత తొందరగా మరమ్మత్తులు చేపించి సమస్యను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు తెలిపారు. ఇరు గ్రామాలలోని నర్సరీ మరియు పల్లె వనాలను సందర్శించి ప్రతిరోజు చెట్లకు నీరు పోసే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో తయారుచేసిన కంపోస్ట్ ఎరువులను మొక్కలకు ఉపయోగించాలని, రోడ్లపైన, పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా రోజు పారిశుద్ధ్య పనులు జరిపించాలని, మురికి కాలువలు,నీటి గుంతలో నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణకు తగు చర్యలు తీసుకుంటేనే మలేరియా,డెంగ్యూ వంటి విషజ్వరాలు రాకుండా అరికట్టవచ్చునని తెలిపారు.అనంతరం ఇందారం మరియు పౌనూర్ గ్రామాల పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.ఈ ఇరు గ్రామాల పర్యటనలో జైపూర్ మండల ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్,ఇందారం మరియు పౌనూర్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

పోలింగ్ శాతం పెంచే విధంగా కృషి చేయాలి

పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్

భూపాలపల్లి నేటిధాత్రి

పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కమలాపురం, అజాం నగర్ లలో పోలింగ్ కేంద్రాలను
తనిఖీ చేసి అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ మాట్లాడుతూ గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు మౌలిక సదుపాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటర్లుకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేవిధంగా టెంట్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం మరుగుదొడ్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు అభ్యర్థుల గుర్తులు స్పష్టంగా కనపడే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులు, వయో వృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయి నుండి ఓటర్లుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్ట్రాంగ్ రూము వద్ద 24/7 సీఆర్పీఎఫ్ భద్రతా దళాల పటిష్ట నిఘా ఉండాలని అన్నారు. సి సి కెమెరాలను, విజటర్స్, సిబ్బంది విధుల రిజిస్టర్ పరిశీలించారు. జిల్లాకు విచ్చేసిన ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి
నియోజకవర్గ పరిధిలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకై చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా అబ్జర్వర్ కు క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి సంజీవరావు, ఆర్డిఓ మంగిలాల్, డిఎస్పీ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి బయోడేటా

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

జననం, విద్యాభ్యాసం : రామసహాయం రఘురాం రెడ్డి 1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు.

వ్యక్తిగత జీవితం : రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. కాగా వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం : రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో నిర్వర్తించిన బాధ్యతలు: 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇన్ చార్జ్ గా పనిచేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు.

ఇతర పదవులు : రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) ప్యాటరన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా , హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు : రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారు. మరిపెడ- బంగ్లా లో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్ సీ లు , ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టిటిడి కల్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్ లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలను, శివాలయాలను, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చారు. పీహెచ్ సీ , చేగొమ్మ హరిజన కాలనీకి కూడా స్థలాలను ఉచితంగా అందజేసింది రఘురాం రెడ్డి కుటుంబీకులే కావడం విశేషం.

రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

# పీఎం కిసాన్ ఈ కే వై సి లో సమస్య ల లేకుండా చూడాలి.

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్ర తో కలిసి వ్యవసాయ రంగం పై వ్యవసాయ విస్తీర్ణ అధికారులతొ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయం లో రైతుల కు వచ్చే సమస్యలను పరిష్కరించాలని , సమస్య తీవ్రతను బట్టి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. వివిధ అంశాలలో రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. క్లస్టర్ ల వారిగా ఉండే వ్యవసాయ అధికారులు స్థానిక ఫర్టీలైజర్ దుకాణాలలో ఉండే స్టాక్ పై దృష్టి పెట్టాలని, షాప్ యజమానులు మందులు కొనుగోలు చేసిన తరువాత రైతులకు తప్పని సరిగా రశీదు ఇవ్వాలని తెలిపారు. పీఎం కిసాన్ ఈ కె వై సి లో సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. రైతుల భూముల స్వర్వే నంబర్ ఆధారంగా పంటల వారిగా క్రాప్ బుకింగ్ చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారులను ఈపాస్ ఏ ఈ ఓ లాగిన్ ఏ విధంగా పని చేస్తుందో అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ములుగు మండలంలోని రామచంద్రపురం గ్రామం లోని దుబాసి చంద్రమౌళి ఫర్టిలైజర్ షాప్ ను సందర్శించారు. షాప్ లోని స్టాక్ వివరాలు, రశీదులు పర్శిలించారు. ఈపాస్ యంత్రాల పనితీరు తదితర వివరాలను షాప్ యజమానిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ములుగు ఏడి కే.శ్రీపాల్ , ఏటూరు నాగారం ఏడి యన్.శ్రీధర్ , స్థానిక వ్యవసాయ అధికారి సంతోష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లలిత జ్యువెలర్స్ లో బంగారం దొంగతనం చేసిన దొంగకు రిమాండ్

కూకట్పల్లి, నేటి ధాత్రి త్రి ఇంచార్జ్

యాంకర్:- దృష్టి మలచి బంగారం దొంగతనం చేస్తున్న బానోతుభాస్కర్ అనే దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి లలిత జ్యువెలరీ షాప్ లో బంగారం కొనుగోలు చేసినట్లే చేసి సేల్స్ను గర్ల్స్ను దృష్టి మరల్చి 28 .405 గ్రాముల బంగారాన్ని దొంగిలించి సుమారు రెండు లక్షల 10 వేల విలువ గల బంగారాన్ని దొంగిలించ డంతో లలిత జ్యువెలరీ షాప్ యాజ మాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఏసిపి శ్రీనివాస్ రావు తెలిపారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నివారణ పై అవగాహన ర్యాలి!!

మలేరియా నివారణ, జాగ్రత్తలు సూచించిన డాక్టర్ లవ కుమార్!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండ పల్లి మండలం అంబారీ పేట గ్రామం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా.అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. లవ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లవ కుమార్ మాట్లాడుతూ , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మలేరియా కు అసలైన నివారణ అని,దోమ కాటు వల్ల వచ్చేటటువంటి మలేరియా జ్వరాలు వాటి నివారణ చర్యలు మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అందరికీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి.లవకుమార్ మరియు సూపర్వైజర్ రమణ వల్లి ,ఎం ఎల్ హెచ్ పి గణేష్ , ఏఎన్ఎం లు లావణ్య, బుచ్చమ్మ , చంద్రకళ ,విజయలక్ష్మి సునీత ,వినోద ,మరియు అరోగ్య సహాయకులు శ్రీను , మరియు ఆశా కార్యకర్తలు , ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,

శివమ్మ బస్తి అసోసియేషన్ సభ్యులతో వారిసమస్యలపై చర్చించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఏప్రిల్ 25 నేటి ధాత్రి ఇన్చార్జి

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్డివిజన్ పరిధిలోని శివ మ్మకాలనీ అసోసియేషన్ సభ్యు లను మర్యా దపూర్వకంగా కలిసి కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది.ఈ సంద ర్భంగా కాల నీలోని డ్రైనేజీ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యా యి కానీ మ్యాన్ హోల్ లోపల ప్లాస్టిగ్ లేక నిరంతరం
పుడు కుపోయి జామ్ అవుతున్న సమ స్యను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టి
కి తీసుకువచ్చా రు.కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను వారికి వివరిం చారు.వీలైనంత త్వరగా మ్యాన్హోల్స్ అన్నింటికీ లోపల వైపు సిమెంట్ ప్లాస్టింగ్ చేయిస్తామని కాలనీ వారికి హామీ ఇచ్చా రు.అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల లో చేవెళ్ల పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చేందుకు మనం
దరం కృషి చేయాలని కాలనీ వారిని కోరారు.కాలనీ అసోసియేషన్ సభ్యు లందరు కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర
మంలో యువనేత దొడ్లరా మకృష్ణ గౌడ్,సమ్మారెడ్డి,కాలనీ అధ్యక్షులు కాయితి నరసింహులు, అధ్యక్షులు
ఎన్. సిద్ద య్య,జె.నరసింహ,రామచంద ర్,గిరి,మోజెస్,వై.శ్రీను,రాజు,ఎ.సతీష్,
మ న్యం,చారి,ప్రసాద్,జె.అంజి,శేఖర్,
నవీన్,హుస్సేన్,జగన్,కె.కృష్ణ,బోసు,
గుత్తయ్య రాఘ వేంద్ర,అన్వర్,బా లయ్య,న రసింహులు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎం పి అభ్యర్థి. రఘురామ్ రెడ్డి నామినేషన్

ఎండీ రజాక్ ఆధ్వర్యంలో హాజరైన ఐ ఎన్ టీ యు సి నాయకులు.

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కొత్తగూడెం నుండి భారీ కార్ల ర్యాలీ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఐ ఎన్ టీ యు సి నాయకులు పెద్ద ఎత్తున ఖమ్మం కు తరలివెళ్లడం జరిగినది.అదేవిదంగా నామినేషన్ సందర్బంగా ఖమ్మం లో ఏర్పాటు చేసిన కార్ల ర్యాలీ తో కలసి ఖమ్మం కలెక్టరేట్ వరకు వెళ్లి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొనడం జరిగినది.ఈ నామినేషన్ కార్యక్రమానికి కేజీఎం ఏరియా నుండి పాల్గొన్న సెంట్రల్ కమిటీ, బ్రాంచ్ కమిటీ, మరియు పిట్ కమిటీ నాయకులు కాల్వ నాగభూషణం, గుత్తుల సత్యనారాయణ, ఎస్ కె గౌస్, విప్లవ రెడ్డి, పోశం శ్రీనివాస్, జల్లి కిరణ్,గోపు కుమార్, చిలక రాజయ్య, . కుమార్, బాలాజీ, నాగేశ్వరావు,కలవల శ్రీనివాస్, సత్యనారాయణ, కొమురయ్య, ఎం ఏ సవీర్, వేణుగోపాల్, రహిమాన్, ప్రభాకర్, ఎం శ్రీనివాస్, బి రాము, కొలిపాక శ్రీనివాస్, శంకర్ ,నర్సింగరావు, భానుకమల్, వరప్రసాద్, జంగం శ్రీనివాస్, నగేష్, లక్ష్మణ్ సింగ్ ,జడి ప్రసాద్, పవన్ ,రేవంత్, సందీప్, హరీష్, పాష ,శేఖర్,కళ్యాణ్,

కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

నేటిధాత్రి, వరంగల్

గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహగానాలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారాలని అనుకున్నారు. కానీ, వరంగల్ నుండి తీవ్ర స్థాయిలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకొలేదు. నిరంతరం కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపిన్నట్లు సమాచారం. తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు కొందరు నేతలు బహిరంగగాన్నే విమర్శిస్తున్నారు. వరంగల్ మేయర్ మాత్రం ఈ రోజు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకుని పార్టీలోకి వలసలు వచ్చే వారిని చేర్చుకున్నట్లు తెలుస్తోంది.

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కు బయలుదేరిన

కోనాపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు…

కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-

కొల్చారం మండలం కోనాపూర్ నుండి మెదక్ బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరాం రెడ్డి నామినేషన్ గురువారం నాడు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షుడు కోనాపురం తుంకలపల్లి సంతోష్ రావు బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ బాలు (భాగయ్య) ఆధ్వర్యంలో కోనాపూర్ బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నా మిషన్ కు నామినేషన్ కు తరలి వెళ్లారు. కొల్చారం మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి భారీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు, బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ బాలు (బాగయ్య )మాజీ సర్పంచ్ కన్నారం రమేష్ , మాజీ సర్పంచ్ మనసాన్ పల్లి వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి తుంకలపల్లి వినోద్ కుమార్, , మోత్కు మల్లేశం, మోత్కు శంకర్, బండి అశోక్, తుంకలపల్లి సంతోష్ రావు, సాకలి మల్లేశం,కొడకంటి శ్యామ్ గౌడ్, కొడకంటి రామకృష్ణ గౌడ్ సాకలి సతీష్ , బండి గోపాల్, బండి ప్రభాకర్, బండి ఆంజనేయులు, తుంకులపల్లి మురళి రావు , బండి ఎల్లయ్య, ఎర్ర నాగేష్,కన్నారం ప్రసాద్, కన్నరం కుమార్,మ్యాతరి గంగ రాములు, కోనపురం గ్రామం నుండి సుమారు 100 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు.

error: Content is protected !!
Exit mobile version