తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి పద్మ నగర్ గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోని ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేశామని ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల కోరిక మేరకు ఆరోజు కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
వీణవంక మండల బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని (డిఎస్పి)నాయకులు పిలుపు
వీణవంక, (కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి చిలువేరు,శ్రీకాంత్ గారి ఎన్నికల ప్రచార సభ 11 న జమ్మికుంట లో గాంధీ చౌరస్తా వద్ద ఉదయం 10:00 గంటలకు లకు కార్నర్ మీటింగ్ రోడ్ షో నిర్వహించనున్నట్లు వీణవంక మండల నాయకులు సదానందం తెలిపారు. ఈ రోడ్ షో సభకు ముఖ్య అతిథులుగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ గారు హాజరుకానున్నారు అని పార్లమెంట్ పరిధి మరియు వీణవంక మండల వివిధ గ్రామాలలో ఉన్న (డి ఎస్ పి) కార్యకర్తలు, అభిమానులను,బీసీ,ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల ప్రజస్వామ్య వాదులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి నాయకులు రాకేష్, రాజేంద్ర ప్రసాద్,అనిల్,రవికిరణ్,వినయ్,రాజు, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
Real leader will have a vision and act like a visionary and always being in touch with people, moving towards victory; welfare, love and affection towards people are the main qualities he posses. A leader never forget his people whether he is in power or not. ‘Power’ is not a criterion for them to go in support of the people. Every time their mind is concentrated towards people. Harish Rao is such leader who had all the above characters. ‘If content is there cut-out is enough’ is an idiom which hundred percent suitable for both KCR and Harish Rao. Harish Rao is nothing but an agitation. Either fight for the cause or welfare he will do it like a movement. He also captures the love and affection of people like a movement! Harish is best example to fight. In previous he fought for the cause of Telangana. When he was in power he always strived hard for the welfare of the people and for the sake of development of Telangana. He worships his work. This is the main reason still he remain in the hearts of the people. If he is in power or not, being a leader he will always in forefront in the works related to people. He can’t be compare with other leaders. Lion is always line…elephant never lose it value…Harish is such a valuable person. He is trouble shooter and dreams for growth. He attains success in an attempt with his hard and dedicated work. He always achieves success in the work entrusted on him. He is a gainful leader who always owns the victories. In politics he has no opposition and every time comes out with victory. The unique nature of his campaign causes no other leader to compete with him. He time to time changes his strategy as per the situation demands, so that opponents never catch his star campaign nature. Even anybody accept or not accept…Harish remains a powerful and dynamic leader among the next generation politicians is an acceptable fact! In Parliament elections as star campaigner, the role has been played by Harish Rao receiving appreciations from all sides. When compare to present, previous elections were totally different because at that time BRS was in power. So entire party cadre and second level leaders abide to party leadership and followed as per the directions from the high command. This time BRS is not in power. Now every time it is essential for the leadership to protects its cadre and moving forward with careful watching of time to time changing scenarios. Due to lack of power making the cadre to stick up to the party is also a herculean task. When party is in power all the party cadre patiently waits for the directions from the leaderships. When party remains opposition entire situation takes u-turn. Now leadership must have patience to spend more time with party cadre. This is most essential for the survival of the party. When we observe Harish Rao, he never come across such situations, because if he in power or not he always remains with party fold. ‘Neglect’ is not the attitude of him. He stood always in support of his cadre and when every need arises he will present there to solve any type of problem. This is the reason for everybody to like him and follow him always regardless he is in power or not. So for Harish like leader power never become criteria but crown like leadership quality will always makes him to lead the masses. Everybody has privilege to speak with him freely and share their ideas in relevant manner. Harish can allocate sufficient time to those who rely on his leadership. He always used to say that, please don’t come to me with facing difficulties but you can tell me your problems whenever I comes towards you. When there is an essential situation, you can approach me, he says. Why this description about Harish Rao because most of the leaders have the nature of available only during election time. After that they never care about their cadre. Whoever meets Harish Rao for a work, within one day that problem gets solved. Making the people to meet him again and again is not the nature of Harish. That is why people always show their affection towards their leader Harish. When he contested first time for the seat Siddipet, he made house to house campaign. After that till now he never had gone for house to house campaign in his constituency. That is the leadership quality of Harish. He always remains with the people and then what is need for him to go for such rigorous campaign. People use to say him with affection that no needs to come for campaign. Such love and affection from the people for their leader is very rare and Harish is being one among such leaders. Getting victory for his party leaders is an excellent talent possess by Harish Rao. The fighting nature habituated to Harish during Telangana agitation. During Telangana movement, no election either local or Assembly held without presence of Harish. For achieving victory Harish presence is must. During Separate State movement in every by election and local elections Harish stood in forefront to move the leaders towards the goal of victory. Every leader likes to relay on Harish for their victory. Even the responsibility of campaign in favour of BRS boss KCR also took by Harish Rao. In every elections Harish bear the responsibility of campaign both in Siddipet and Gajwel. Harish who always protects the party now took the Medak constituency as prestige and indulging in rigorous campaign. In previous Assembly elections, Harish is sole responsible for party victory in all Assembly segments except two. In Telangana by-elections means Harish Rao plays a key role. During Telangana movement nearly decade and half years he never slept well and ate well. Sometimes he uses to take bundle of files with him for making signatures. Even sitting in car also he cleared the files. Like that his car also became like office! In every by-election Harish Rao relentless hard work brought victory for the party. Where ever and whenever he goes to any constituency he gets remember everything about the needs of the people. If he happen to speak to anyone, he never forget his name and always call him with his name even after years gone. He knows well about development and what people want. This is the reason even today Siddipet people never vote against Harish. In 1985 for the first time Harish emerged victorious in Siddipet. Then he laid foundation stones for the development of the constituency. Again in 2005 when he became MLS of Siddipet, he built beautiful city on the foundations laid by him in previous period. Under his leadership Siddipet now emerged as a city with all facilities. All the villages in the constituency are now in self sufficient due to the actions taken by Harish. Thirty years back Siddipet was a Nagara Panchayat. When KCR became MLA, he transformed it into Municipality. After achieving Telagana, Harish raised its level to Municipal Corporation. Once there was great water problem prevailed in Siddipet. KCR solved this problem and now all villages along with Siddipet are receiving sufficient water. Now drinking water facility is there for every house hold. Harish Rao is such a leader never forgotten by the people who rely on him.
భద్రాద్రి కొత్తగూడెం, నేటి ధాత్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎస్సైలు విజయలక్ష్మి మరియు పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో సోదాలు.భద్రాచలం పట్టణంలోని రామాలయం ప్రాంతంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా ఇంట్లో నిల్వచేసి అమ్ముతున్న మద్యం పట్టివేత పట్టుకున మధ్యం విలువ సుమరు 22000/-రూపాయలు పోలీసులు తెలిపారు మధ్యమమ్ముతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
# గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. # నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ కు బదులుగా మరో డాక్టర్ వైద్యం. # జననీ,కరుణశ్రీ,నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రులల్లో తనిఖీలు.. # పలు ఆసుపత్రులకు నోటీసులు జారీ.. # డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్
నర్సంపేట,నేటిధాత్రి :
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనవసరమైన భ్రూణ హత్యలు చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య డిప్యూటీ అధికారి డాక్టర్ ప్రకాష్ హెచ్చరించారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుకు గల జనని ఆస్పత్రి నెక్కొండ రోడ్డు లోని నర్సంపేట న్యూరో సెంటర్ అలాగే కరుణాశ్రీ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రిలో రికార్డులను తనిఖీలు చేశారు. పట్టణంలోని కరుణశ్రీ ఆస్పత్రిలో ఒక మహిళకు అధికార రక్తస్రావం వలన అబార్షన్ తోపాటు గర్భసంచి తొలగించాలని ఆరోపణలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ అధ్వర్యంలో వైద్యాధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈమధ్య కరుణశ్రీ హాస్పిటల్ లో జరిగిన సంఘటన పట్ల ఆరా తీయగా ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించిన కేసు వివరాలను పరిశీలించి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డిఎం హెచ్ ఓ తెలిపారు.ఇటీవల నర్సంపేట పట్టణంలో నర్సంపేట న్యూరో హాస్పిటల్ ఏర్పాటు కాగా ఆ ఆసుపత్రిని పరిశీలించగా అందులో ఉండవలసిన డాక్టర్లు అందుబాటులో లేనందువలన వారి బదులుగా వేరే డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని నిర్ధారణ అయ్యిందని కాగా సిబ్బంది ద్వారా హాస్పిటల్ మేనేజ్ మెంట్ కు నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. వరంగల్ రోడ్డుకు గల జనని ఆసుపత్రినీ వైద్యాధికారులు ఆకస్మితంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.అలాగే ఆసుపత్రికి సంబంధించిన సేవల్లో డాక్టర్లు,పారామెడికల్ సిబ్బంది మాత్రమే సేవలందించాలని తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా అనుమతి లేని ఆసుపత్రులు నడిపిన అనుమతిలేని డాక్టర్లు వైద్యం చేసిన వారిపైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. ఎవరైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనవసరమైన భ్రూణ హత్యలు చేసిన మరియు అనవసర సిజేరియన్ ఆపరేషన్లు చేసిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.ఆయా ఆసుపత్రుల లోపాల వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని, కరుణశ్రీ ఆసుపత్రి నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రి లకు నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ వివరించారు.ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఎల్డీ కంప్యూటర్ నాగరాజు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
— మళ్ళీ మోసపోతే గోస పడతాం, — చేతి గుర్తుకు ఓటు వేసి నీలం మధును గెలిపించండి,
నిజాంపేట: నేటి ధాత్రి
పది సంవత్సరాలుగా మోసపోతునే ఉన్నాం మళ్లీ మోసపోతే గోస పడదాం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకుందాం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మండల కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సందర్భంగా బీఆర్ఎస్, బిజెపి పార్టీలు, టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన మూడు నెలల్లోనే కోటి 85 లక్షలతో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని, అలాగే ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ మెదక్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు కమిటీ వేయడం జరిగిందని అతి త్వరలో కర్మాగారాన్ని తెరిచి రైతులకు అందుబాటులో తెస్తామన్నారు. భీఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దని, అగ్రకులానికి సంబంధించిన వారని, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, మైనోద్దీన్, ఇక్బాల్,సుమారు 30 మంది భీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు, ఎంపీపీ సిద్ధ రాములు, లద్ద సురేష్, మాజీ సర్పంచులు ముత్యం రెడ్డి, అమర్ సేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, మారుతి, సత్యనారాయణ రెడ్డి, నసీరుద్దీన్, నరేందర్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కొల్చారం మండలంలో పోచారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిలుముల సుహాసిని రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని కిష్టాపూర్, పోతం శెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాలలో ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు 2, 500, గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకు , ఉచిత కరెంటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను తప్పకుండా అమలు చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ , ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మసూద్ రెడ్డి, మెదక్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి , నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హంసి బాయ్, కిష్టాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది శ్రీశైలం యాదవ్, పొతం శెట్టిపల్లి మాజీ సర్పంచ్ గడ్డమీది నర్సింలు, అప్పాజీపల్లి మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్, హంసన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్ , రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిజాంపేట్ మండల కేంద్రం లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా వివిధ పార్టీల నుండి భారీగా చేరికలు జరిగాయి..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని మూడు నెలల్లోనే చాలా అభివృద్ధి చేసుకున్నాం అన్నారు. నీలం మధును ఎంపీ గా భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మెదక్ పార్లమెంట్ సైతం అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం నూతన కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, పంజా మహేందర్, నజీరుద్దీన్, మారుతి, వెంకట్ గౌడ్, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, అమరా సేనరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామ ముద్దుబిడ్డ మన్నెం వాసు భూలక్ష్మి దంపతుల కుమారుడు మన్నెం అజయ్ కుమార్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాలలో 44 వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగం సాధించాడు. ఈ సందర్బంగా గుంటూరుపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి.
ఎమెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. బుధవారం రోజున ఎమ్మెల్యే జీఎస్సార్ ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలోని ఎంపీటీసీ కేంద్ర గ్రామాలయిన అందుకుతండ, నైన్పాక, జడల్పేట, ఒడితల, గోపాల్పూర్, చల్లగరిగ, జూకల్, తిర్మలాపూర్, నవాబుపేట, చిట్యాల-1,2* గ్రామాలల్లో విస్తృతంగా పర్యటించారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అధ్యక్షతన ఆయా గ్రామాలల్లో ముఖ్య నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో హాజరయ్యారు. అనంతరం ఆయా గ్రామాల సమావేశాలలో ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ… పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లు మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను బీజేపీ అనుబంధ సంస్థలుగా మార్చుకుని దేశ వినాశకరమైన, దేశ అస్తిత్వానికి ప్రమాదకరమైన పాలనను కొనసాగిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. మన దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, ఇప్పుడు ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని కోరారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరా జైలుకు వెళ్లారని, రాహుల్ గాంధీ ది త్యాగాల కుటుంబమని గుర్తు చేశారు. వరంగల్ పార్లమెంట్ లో డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఈ సమావేశాలల్లో పలువురు రాష్ట్ర, నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు చిట్యాల మండలంలోని ఆయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
# ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రావు
నర్సంపేట,నేటిధాత్రి :
దేశంలో భారత రాజ్యాంగం,రక్షించబడాలన్న, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగాలన్న,కాంగ్రేస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్,జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు అన్నారు.మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని కమలాపురంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం దేవుళ్లు పేరు చెప్పి మత కలహాలు సృష్టిస్తున్నారని, దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అంతే కానీ రాజకీయం కోసం దేవుళ్లను వాడుకోవటం దుర్మార్గమని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఈ సారి ప్రధాన మంత్రి కావాల్సిందే అని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని వెంకన్న,కంచు రవి, కంచర్ల వెంకన్న, సారంగం, సోమయ్య, యాదగిరిలతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని అంకతివాడకు చెందిన వేముల మహేష్ అనే 30సంవత్సరముల వ్యక్తి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. మహేష్ మీసేవా ఉద్యోగి. తనకు భార్య రాధికతో వివాహం జరుగగా సంతానం లేకపోవడంతో ఇటీవలే చిన్నపాపను దత్తతకు తీసుకున్నారు. తల్లి తన పాప ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. మహేష్ కూడా వారంకి ఒకసారి వెళ్లి పాపని భార్యని చూసి వస్తున్నాడు. ఈనెల 7వ తారీకున ఉదయం భార్యతో కాసేపు ఫోన్ మాట్లాడి ఉద్యోగ రీత్యా మీసేవకి వెళ్తున్న అని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఫోన్ చేయలేదు ఇంటికి రాలేదని తెలిసింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబసభ్యులు బంధువుల ఇండ్లలో వెతికిన, చుట్టుప్రక్కల వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో ఆయన మేనమామ పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు. తప్పిపోయిన వ్యక్తి 5.5 ఫీట్ల ఎత్తు ఉంటాడు. కళ్ళజోడు దరిస్తాడు. వ్యక్తి మేనమామ గుండ లచయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై. P. చంద్రకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పరిశీలించి, ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి, అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళినీ, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తునే పోలింగ్ టీంల తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావు గా సాగుతోందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి అమలు, తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, మాక్ పోలింగ్ ఇతర అంశాలను పరిశీలించాలని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్ఓ పూజారి గౌతమి, వేములవాడ ఆర్డీవో, ఏఆర్ఓ రాజేశ్వర్, సీపీఓ శ్రీనివాసాచారి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున రావు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.
– సింగిల్ విండో చైర్మన్ ప్రశాంత్ రెడ్డి కాటారం నేటి ధాత్రి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గారెపల్లి (కె ) ఆధ్వర్యంలో రబి సీజన్ కోసం ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సింగిల్ విండో చైర్మన్ తోటపల్లి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సహకార సంఘం కార్యాలయంలో హమాలీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీలా సంఖ్యను పెంచి హమాలీలా కొరత లేకుండ చూడాలని, గతంలో కంటే కాంటాలను పెంచి త్వరతిగతిన లోడ్ లు చేసి పంపిచాలని సూచించారు. గన్ని సంచల కొరత రాకుండా, రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని పేర్కొన్నారు. ఈ సమావేశం లో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి డైరెక్టర్ దండ్రు రాజయ్య, సీఈఓ ఎడ్ల సతీష్, హమాలీ మేస్త్రి లు లింగయ్య,బుచ్చయ్య, మల్లయ్య, సమ్మయ్య, శ్రీనివాస్, మల్లయ్య, రాజేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు
గణపురం మండలం కేంద్రం గణప సముద్రం చెరువులో మతిస్థిమితం కోల్పోయిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిండ్ల మల్లికార్జున్ భార్య మామిళ్ళ లీల (56) మృతదేహం గణప సముద్రం చెరువులో తేలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీపించి విచారణ చేపట్టగా మృతురాలు కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులుగా అప్పగించారు.
దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి ఉందని కాటారం మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు, జాదురావుపేట, గూడూరు, రఘు పెళ్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలగా అటు దేశాన్ని బిజెపి దోచుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ దోచుకుందన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విజయవంతంగా ముందుకు సాగుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆత్మకూరి రాజయ్య యాదవ్, బాసాని రఘువీర్, మజీద్, కోడి రవికుమార్, బండం వసంత రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నార
శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పరి ధిలోని 123 డివిజన్లో ఉన్న హైదర్న గర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ జన్మదిన వేడుక లను నిజాంపేట్ చౌరస్తాలోని టయో టా షోరూం పక్కనగల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు అభి మానులు ఆయా సంఘాల నాయకు ల మధ్య ఘనంగా పుట్టినరోజువేడు కలు జరిగాయి.ఈ సందర్భంగా కె ఎస్ జి సైన్యం అభిమాన సంఘం ముజాహిద్ ముజ్జుబాయ్ నేతృ త్వంలో పెద్ద కేకును తీసుకొచ్చి సత్యం గౌడ్ అన్నకు అభిమానులతో కలిసి స్టేజ్ మీద ఘనంగా శాలువలు బొకేలు పూలదండలతో ఘనంగా సన్మానించిన అనంతరం ముజ్జు, మారుతికుమార్ అప్రోచ్ లు కేకును కట్ చేసి తినిపించి జన్మదిన శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో కావూరి ప్రసాద్,సాంబశివ రావు,జ్యూస్ మహేష్మహేష్,మాణి క్యం, చాట్ల రవి,మహేందర్ రెడ్డి, బంగారు బాబు అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 8(నేటి ధాత్రి):
సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల రాధిక జైస్వాల్ జిల్లాకు బదిలీపై వచ్చిన సందర్భంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది.. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు లైంగిక వేధింపుల బాధితులకు పునరావాసం ఆర్థిక సదుపాయాలు వయోవృద్ధుల ఆశ్రమంలో ఆవాసితుల సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులకు లీగల్ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు…అలాగే సఖి బాధితులకి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ డిఐఆర్ ఫైలింగ్ మరియు కౌన్సిలింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు… జిల్లాలో మంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. మంచి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి ఫలాలను సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు వరుసలో ఉన్నారని మరింత ప్రగతి పథంలో తీసుకెళ్లాలని సూచించారు..
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బిఎస్ఎఫ్ బలగాలతో కలిసిభూపాలపల్లి రూరల్ గ్రామాలు గొర్లవీడు, కొంపల్లి గ్రామలలో సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామాల లోని ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసులు ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సుధాకర్, ప్రసాద్ మరియు బిఎస్ఎఫ్ సిబ్బంది సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ పరిధిలో అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న,తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను గెలిపించాలని కామ్రేడ్ కొత్తపల్లి మాస్ సావిత్రి అన్నారు.పరకాల నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను బిఎల్ఎఫ్ బలపర్చిన ఎంసీపీఐ అభ్యర్థి కొత్తపల్లి సావిత్రి మాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. అనంతరం సావిత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎన్నో కేసులు,లాఠీ దెబ్బల కోర్చి ఉద్యమాలు చేసి,నాటి నుండి అనేక ప్రజా సమస్యలపై,సామాజిక అసమానతల పై నిరంతరం ఉద్యమాలు చేసే తనను వరంగల్ ప్రజలు ఆదరించి,కంప్యూటర్ గుర్తు పై ఓటు వేసి ఉద్యమకారురాలైన తనను గెలిపించాలని కోరారు.నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేస్తూ పేదల కు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తూ,ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చిన అండగా నిలబడుతూ వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సావిత్రి అన్నారు.ప్రస్తుతం ధనార్జన లక్ష్యంగా ఆస్తులు పెంచుకోవడం,వాటిని దాచుకోవమే లక్ష్యంగా వరంగల్ లో ప్రధాన పార్టీలు వ్యవహారిస్తున్నాయని,అటువంటి పార్టీలకు జ్ఞానవంతమైన వరంగల్ ప్రజలు ఓటు తో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసే పేదింటి ఆడబిడ్డనైనా తనను గెలిపించాలని కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.