కాటారం, నేటి ధాత్రి
దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి ఉందని కాటారం మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు, జాదురావుపేట, గూడూరు, రఘు పెళ్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలగా అటు దేశాన్ని బిజెపి దోచుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ దోచుకుందన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విజయవంతంగా ముందుకు సాగుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆత్మకూరి రాజయ్య యాదవ్, బాసాని రఘువీర్, మజీద్, కోడి రవికుమార్, బండం వసంత రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గద్దల రమేష్ తదితరులు పాల్గొన్నార