•ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
నిజాంపేట్: నేటి ధాత్రి
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిజాంపేట్ మండల కేంద్రం లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా వివిధ పార్టీల నుండి భారీగా చేరికలు జరిగాయి..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని మూడు నెలల్లోనే చాలా అభివృద్ధి చేసుకున్నాం అన్నారు. నీలం మధును ఎంపీ గా భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మెదక్ పార్లమెంట్ సైతం అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం నూతన కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, పంజా మహేందర్, నజీరుద్దీన్, మారుతి, వెంకట్ గౌడ్, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, అమరా సేనరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.