వ్యక్తి కనబడడం లేదు : మిస్సింగ్ కేసు నమోదు

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని అంకతివాడకు చెందిన వేముల మహేష్ అనే 30సంవత్సరముల వ్యక్తి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. మహేష్ మీసేవా ఉద్యోగి. తనకు భార్య రాధికతో వివాహం జరుగగా సంతానం లేకపోవడంతో ఇటీవలే చిన్నపాపను దత్తతకు తీసుకున్నారు. తల్లి తన పాప ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. మహేష్ కూడా వారంకి ఒకసారి వెళ్లి పాపని భార్యని చూసి వస్తున్నాడు. ఈనెల 7వ తారీకున ఉదయం భార్యతో కాసేపు ఫోన్ మాట్లాడి ఉద్యోగ రీత్యా మీసేవకి వెళ్తున్న అని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఫోన్ చేయలేదు ఇంటికి రాలేదని తెలిసింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబసభ్యులు బంధువుల ఇండ్లలో వెతికిన, చుట్టుప్రక్కల వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో ఆయన మేనమామ పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు. తప్పిపోయిన వ్యక్తి 5.5 ఫీట్ల ఎత్తు ఉంటాడు. కళ్ళజోడు దరిస్తాడు. వ్యక్తి మేనమామ గుండ లచయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై. P. చంద్రకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version