ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

❇️ నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను

❇️ నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలదే

❇️ ప్రజలకే నా జీవితం అంకితం

మరిపెడ నేటి ధాత్రి.

కార్యకర్తలే దిశా నిర్దేశకులు,వారి ఆశీస్సులు ప్రజల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయంతో చరిత్ర తిరగ రాయబోతున్నామని మాజీ మంత్రి,.డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లోని మరిపెడ మండలం లోని వివిధ గ్రామాలలో ఉమ్మడి తానంచర్ల,బురహాన్ పురం,గుండెపూడి,గిరిపురం, వెంకంపాడు,నీలుకుర్తి,బావోజి గూడెం,రాంపురం,చిల్లంచర్ల, రాంపురం గ్రామంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన సభకు ప్రజలు బ్రహ్మ రధం పట్టి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు..వారి సేవకే నా జీవితం అంకితం.25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా.వారి మధ్యలో ఉంటూ వారి సేవే పరమావధిగా పని చేస్తూ అండగా ఉంటున్నానని పేర్కొన్నారు.తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలతోనే మమేకమై ఉంటానని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏకష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నానని, అలాగే తనను కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ నియోజకవర్గ రైతు బిడ్డను.. పిలిస్తే పలుకుతాను…24 గంటలు నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు మోసపూరిత గ్యారెంటీ అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి లేని పంచాయతీలు పెట్టిచ్చిందన్నారు, కెసిఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక్క చెరువు కూడా ఎండిపోలేదన్నారు,ఇప్పుడు ఒక్క చెరువులో కూడా చుక్క నీరు లేకుండా అయిందన్నారు, మళ్లీ మన ప్రభుత్వం వస్తే చెరువులు కుంటలు సస్యశ్యామలం అవుతాయన్నారు రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు చేయకుండా రైతుల ఉసురు పంచుకున్న అన్నారు,వరి ధాన్యం కొని బోనస్ 500 రూపాయలు ఇస్తానని రైతులను నమ్మించిందన్నారు,ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదన్నారు,పంట పెట్టుబడి సాయం పంట యేసే ముందు కేసీఆర్ ఎకౌంట్లో వేస్తే,రేవంత్ రెడ్డి సర్కారు పంట కోసే సమయానికి వేస్తుంది అన్నారు, న కూతురు మాలోతు కవిత ను పార్లమెంట్ కు వెళ్లి తెలంగాణా రాష్ట్రం , జిల్లా ప్రయోజనాలు కోసం కేంద్రంతో కొట్లాడానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. ప్రజ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, రైతు కు అండగా ఉండి,కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పోరాడి, తిప్పికోట్టాలని చెప్పారు.తాను ఎక్కడున్నా తన నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసమే తన ప్రాణం, తాపత్రయ పడుతుందని తెలిపారు. నిత్యం ప్రజలతో ఉండే మాలోతు కవిత ను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపితే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఓటు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ వారిని ప్రజలకు ఇచ్చిన హామీల పై నిలదీయాలని, ఎందుకు మోసం చేశారో చెప్పాలని గర్జించాలని అన్నారు. మచ్చలేని నాయకురాలు మాలోతు కవిత జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తనని గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి కి అవకాశం కల్పించాలన్నారు, మళ్లీ వచ్చేది మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ అన్నారు, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నానని సందర్భంగా గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు రావు,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్,సీనియర్ నాయకులు రాంమడుగు అచ్యుతరావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,గ్రామ ఎంపీటీసీ కొమ్ము నరేష్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బందు పరశురాములు,బీసీ సంఘం మండల నాయకులు రాంపల్లి నాగన్న,రాంపల్లి చిన్న వెంకన్న,దోమల పెళ్లి దయాకర్ రెడ్డి, అనుముల నాగిరెడ్డి, ఇరగని వెంకన్న,రాంపల్లి రంజిత్ గౌడ్, దోమల లక్ష్మణ్,గోనే మహేష్,పాల్వ ఎల్లయ్య,సుదగాని శంకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కూలీలతో కలిసి ఓట్లు అభ్యర్థించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం కుందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోజున ప్రజలతో కలిసి ప్రచార కార్యక్రమం చేపట్టారు.చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపు కోసం కుందారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీల చెంతకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలోని గడపగడపకు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజల ప్రభుత్వం వచ్చి ,ప్రజా పాలన జరుగుతున్నదని పేర్కొన్నారు.పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించినట్టుగా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాం అన్నారు .రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పి ఏ సి ఏ ఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, మూదాం రమేష్, పిడుగు వెంకటి, వనపర్తి దుర్గయ్య, ఎనిగళ్ళ రాకేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం తథ్యం

మల్కాజ్ గిరిలో ఈటల ఓటమి ఖాయం: కూకట్ పల్లి నియోజకవ ర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి

కూకట్పల్లి మే 8 నేటి ధాత్రి త్రి ఇంచార్జీ

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఓటర్లను అవమానపరిచిన బిజెపి అభ్యర్థి ఈ టెల రాజేందర్ మల్కాజ్ గిరి పార్ల
మెంట్ ఓటర్లకు క్షమాపణ చెప్పాల ని కూకట్ పల్లి మున్సిపాలిటీ నియో జకవర్గం కగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.మ ల్కాజ్ గిరి ఓటర్లు డబ్బులు,మద్యం తీసుకుని ఓట్లు వేస్తారని మాట్లాడ
డం విడ్డూరంగా ఉందన్నారు.మ ల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞులు మేధావులని,వారికి
వెంటనే ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉమ్మడి రం గారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సేవలందించారు అసలు నిజంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పక్కా లోకల్ అన్నారు. రాజేందర్.. 2001 నుంచి 2021 వరకు ఇరవైఏళ్లు కేసీ ఆర్ తో కలిసి తెలంగాణను విధ్వం సం చేసింది మీరు కాదా అని ప్రశ్నిం చారు. మీకు పంపకాల్లో పంచాయి తీతో విడిపోయారు తప్ప ప్రజల కో సం కాదు.. 2021లో వరదలు వచ్చి
ఈ ప్రాంతం ముంపుకు గురైతే ఆనా డు ఈటెల పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పదేళ్లు మంత్రిగా ఉం డి ఏనాడైనా మల్కాజ్గిరిపార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకికు వచ్చా వా..? నువ్ ఏం చేశావని.. ఏం తె చ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతాన్నావన్నారు.మ ల్కాజిగిరి ప్రజలనుఓటు అడిగే
హక్కు నీకు లేదు..రాజేందర్,కేసీఆర్ వేర్వేరు కాదు..నాణానికి బొమ్మా బొరుసు లాంటి వారు.. కేసీఆర్
కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చే సింది నువ్వు కాదా రాజేందర్.. కరో నా సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు కోట్లాది రూపా యలు వెనకేసు కుంటుంటే.. వైద్యా రోగ్య శాఖ మంత్రిగా ఉన్నది ఈటల రాజేందర్ కాదా అని ప్రశ్నించా రు.నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్..అప్పుడే మర్చిపోయావా?హైదరాబాద్ చుట్టు భూములను దోచుకుం టుం టే..చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? కేసీఆర్ అవినీతిపై ఈటెల ఏనాడైనా అమిత్ షా,మోదీకి పిర్యా దు చేశారా?ఈటెల,కేసీఆర్ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ..ఈటలకు పదవి, పరపతి తప్ప..తెలంగాణ ప్రజల సం
క్షేమం పట్టదు..రిజ ర్వేషన్లు రద్దు చే సే బీజేపీ వైపు ఉంటారో… ఎస్సీ,ఎ స్టీ,బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవా లన్నారు.అంగీమార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషా లు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మ రు..మోదీ తెలంగా ణకు ఇచ్చిందేం లేదు.. గాడిద గుడ్డు తప్ప..మల్కా జిగిరి పార్లమెంట్ లో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపి
స్తారని శేరి సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

# తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లును కూల్చేసిన చిరంజీవి,కుమార్..
# ఇళ్లు,ఖాళీ స్థలాన్ని 2017 లో ప్రభుత్వానికి ఇనాం గా ఇచ్చారు..
# జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన భాజపా నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రభుత్వానికి ఇనాముగా ఇచ్చిన ఇంటిని ఖాళీ స్థలాన్ని కబ్జాకు పాల్పడిన ప్రైవేట్ వ్యక్తులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నే జగన్,భాజపా దళిత మోర్చా జిల్లా కో కన్వీనర్ కె.పృధ్వీరాజ్ కోరారు. ఈ సందర్భంగా జగన్, కె.పృధ్వీరాజ్ లు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల 1-712/1 నంబర్ గల ఇంటిని అలాగే ఖాళీ స్థలాన్ని ఇంటి యజమాని అయిన పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు తల్లి పారిజాతం పేరు మీద ఉండగా 2017 సంవత్సరంలో ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సాక్షిగా అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అట్టి భూమిని ఇంటిని ప్రభుత్వానికి ఇనాముగా ఇస్తూ ఇంటి భూమి డాక్యుమెంట్లను ప్రజల సమక్షంలో అందజేశారన్నారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ,ఖాళీ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సైతం ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయన్నారు. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి, కుమార్ అనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఇంటిని, ఖాళీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కబ్జాకు పాల్పడిన వ్యక్తులు తమకు పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు అమ్మారని తెలపడం విడ్డూరంగా ఉందని అన్నారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి ఇనాముగా ఇచ్చిన ఆ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు జగన్, పృధ్విరాజ్ తెలిపారు.

ఈవిఎం లతో ఇంటింటా ప్రచారం

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ 36,37,38,39,42,64వ బూత్ లలో ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెడుతూ,ఈవిఎం ప్యాడ్ ప్రదర్శిస్తూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీను కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,నల్లెల జ్యోతి అనిల్ కుమార్,పంచగిరి జయమ్మ బూత్ కమిటీల అధ్యక్షులు,బూత్ కమిటీల మెంబర్స్,మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి తోనే పేద ఆర్యవైశ్యులకు న్యాయం

వనపర్తి నేటిదాత్రి:
గతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని విస్మరించాయని,బిజెపి మోదీ నేతృత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం లభించి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ వనపర్తి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వ రి అమ్మవారి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి సురేష్ శెట్టి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని ఆర్యవైశ్యుల మద్దతు భరత్ ప్రసాద్ కు ప్రకటించి ఓట్లు వేసి గెలిపించుకునేందుకు కృషి చేస్తామని సురేష్ శెట్టి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆకుతోట దేవరాజు దాచా లక్ష్మీనారాయణ గోనూరు యాదగిరి బాసెట్టి శ్రీనివాస్ బచ్చు రాము కొండా కిషోర్ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పిన్నం వసంత లోకనాథ్ రెడ్డి అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఈ నెల 10 వ పొడుగింపు

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉన్న తేదీని మే 10 వ తేదీ వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ నియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పి ఎస్ ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూతులో విధులు కేటయించిన సిబ్బంది 10 వ తేదీ వరకు కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పటి లాగే ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బాలేట్ వినియోగానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కోవాలని అన్నారు. అధికారులు సిబ్బంది పోస్టల్ బాలెట్ వినియోగంపై ఫోకస్ చేయాలని ఆయన పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఉల్లంఘన జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951,
u/s 134 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోస్టల్ బాలేట్ కేంద్రంలోని హెల్ప్ డెస్క్, విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంగం ఉత్తర్వులు మేరకు యథా విధిగా విధులకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో మార్పు కోసం బీజేపీ,బీఆర్ఎస్ లను ఓడించండి

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్*

నడి కూడ,నేటి ధాత్రి:
గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం మీద అధికారం చలాయించిన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్
90 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయడం జరిగిందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రముఖ ఆర్థిక సామాజికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు నడికూడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, సామాజిక న్యాయం సాధించుకుందాం కేంద్రంలో మార్పు కోసం బీజేపి, బీఆర్ఎస్ లను ఓడిద్దాం అనే కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణను ఏలుకొని, దోచుకుని రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులపాలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఓడించారు. కుటుంబ ఆధిపత్య, నియంతృత్వ దోపిడి పాలన కొనసాగించారని, అలాంటి ప్రజా వ్యతిరేక పాలకులను ఓడించాలని పరకాల నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫోన్ టాపింగు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలు చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకుని అనేక దందాలకు పాల్పడ్డ కుటుంబం నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీని మరోసారి ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలుపరచిన ఆర్థిక, సామాజిక విధానాలు తిరోగమన దిశలో ఉన్నాయని ప్రొఫెసర్ కూరపాటి ఎద్దేవ చేశారు. ప్రజలకు జిఎస్టి పేరుతో డీజిల్, పెట్రోల్, గ్యాస్ మొదలగు నిత్యావసర వస్తువులపై విపరీతమైన పన్నులు పెంచి పేదల నుండి ప్రతి నెల 2 లక్షల పదివేల కోట్ల రూపాయలు వసూలు చేసి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టుతుందని, దేశంలో 8 లక్షల పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ వ్యవసాయాన్ని సంక్షోభం నుండి కాపాడలేకపోయారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వలేకపోయారని ప్రొఫెసర్ వెంకట్ నారాయణ ఆందోళన చెందారు.

దేశంలో 40శాతం సంపద 10 శాతం కూడా లేని ధనవంతమైన జనాభాకు మాత్రమే చెందిందని దేశ ఆదాయంలో ఒక్క శాతం కూడా లేని ధనవంతులైన కార్పొరేట్లకు దేశ సంవత్సరాదాయంలో 25శాతం చెబుతున్నదని తీవ్రమైన ఆర్థిక అసమానుతులకు దారి తీసిన మోడీ పాలనను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.కేంద్రంలో అధికారం కొరకు మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు (హిందువులు) కావాలి కానీ మోడీ ప్రభుత్వానికి మాత్రం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర కార్పొరేట్ సంస్థలే ఆత్మీయులని కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు పేద ప్రజలపై పనుల భారం మోపి వందలాది బిలినియర్లను తయారుచేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చినట్టుగానే కేంద్రంలో కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మాత్రమే పేద ప్రజలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకట్ నారాయణ హితవు పలికారు.కేంద్రంలో పది సంవత్సరాల కాలం తిరోగమన ఆర్థిక విధానాలను అనుభవించిన ప్రజలు మార్పు దిశలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసుకోవడానికి ఒక పటిష్టమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉందని అదేవిధంగా కేంద్రంలో కూడా మార్పు దిశలో ప్రజలు ఓట్లు వేయాలని అది సాధ్యమైనప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చినట్టుగానే కేంద్రంలో కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మాత్రమే పేద ప్రజలకు ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకట్ నారాయణ హితవు పలికారు.
కేంద్రంలో పది సంవత్సరాల కాలం తిరోగమన ఆర్థిక విధానాలను అనుభవించిన ప్రజలు మార్పు దిశలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసుకోవడానికి ఒక పటిష్టమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉందని అదేవిధంగా కేంద్రంలో కూడా మార్పు దిశలో ప్రజలు ఓట్లు వేయాలని అది సాధ్యమైనప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో పూలే ఆశయ సాధన సమితి (పాస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ 2021 లో జరగవలసిన జనాభా లెక్కలు ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు. జనాభా లెక్కల ద్వారా వివిధ సామాజిక వర్గాల వివిధ ప్రాంతాల వారిగా అభివృద్ధి తీరుతెన్నులు తెలుస్తాయని, అందుకు తగిన విధంగా ప్రణాళిక వేయలేదు. అయితే పేద ప్రజల గురించి గానీ వెనుకబడిన ప్రాంతాల గురించి గానీ మోడీ ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని గత పది సంవత్సరాల పరిపాలన తెలియ జేస్తున్నాయని చెప్పారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐదు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు బీసీలకు జనగణ చేస్తామని తగిన విధంగా బీసీల రిజర్వేషన్ కోటా పెంచుతామని హామీ ఇవ్వడం జరుగుతున్నది. బీసీల బిడ్డనని చెప్పుకుంటున్న మోడీ మాత్రం జనాభా లెక్కలు చేయడం లేదు ముఖ్యంగా జనగణన చేయడానికి సిద్ధపడటం లేదు. ఓట్లు వేయడానికి మాత్రమే హిందువులు కావాలి గాని అభివృద్ధికి మాత్రం గుజరాతీలు మోడీ అంబానీలు ధనవంతులు మాత్రమే శిరోధార్యం అని మోడీ గత పాలన తెలియజేస్తున్నదని డాక్టర్ మల్లేశ్వర్ అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో పాస్, నాయకులు డాక్టర్ చందా మల్లయ్య , డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ సుధాకర్, ఓబీసీ నాయకులు బొమ్మ చంద్రమౌళి, నారగాని కుమారస్వామి, వాంకే రాజయ్య, ఈర్ల చిన్ని, తాళ్ల నవీన్, లింగంపల్లి బిక్షపతి, నారగాని ఐలయ్య, రావుల సురేష్, అట్టెం బాబు, పుట్ట శ్యామ్ రాజ్ , తదితరులు పాల్గొన్నారు.

బాధితురాలిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలములోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన తోడేటి శశి కుమార్ భార్య శారద అనారోగ్యంతో కరీంనగర్ యాకయ్య హాస్పిటల్లో ఆపరేషన్ జరగగా ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు

వారివెంట బైరి రాజు సాదా దేవేందర్ వున్నారు

అక్రమ మద్యం నిల్వచేసిన ఇంటిపై పోలీసుల మెరుపు దాడి

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం నియోజకవర్గం
భద్రాచలం పట్టణ ఎస్సైలు విజయలక్ష్మి మరియు పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో సోదాలు
భద్రాచలం పట్టణంలోని రామాలయం ప్రాంతంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా ఇంట్లో నిల్వచేసి అమ్ముతున్న మద్యనీ స్వాధీనం చేసుకొని మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తరలించారు

బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురు కాంగ్రెస్ లో చేరికలు

హసన్ పర్తి / నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరిలో పెంబర్తి గ్రామ ఉప సర్పంచ్ ఉట్కూరి సునీల్ మరియు నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మరియు హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్ రామ్ నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు పెంబర్తి గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ తిరుపతి మాజీ మండల అధ్యక్షులు మదన్ గౌడ్ మండల మహిళా అధ్యక్షురాలు జోర్కపూల మండల్ యూత్ కాంగ్రెస్ సౌరం చరణ్ తేజ జిల్లా ఎస్ఎస్సిఎల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

#తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు రాజారామ్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నానబోయిన రాజారామ్ యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం గాలి వానతో భారీ వర్షం కురువగా వరి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా పంట పొలాల్లో వరి నేలకు ఒరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు సైతం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులచే పంట నష్టాన్నిఅంచన వేసి నష్టపరిహారం అందివ్వాలని అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ గెలుపు ఖాయం

నడికూడ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నడికూడ లో బీఆరెస్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నడికూడ బీఆరెస్ మండల అధ్యక్షులు దురిశెట్టి చందు(చంద్రమౌళి),గ్రామ అధ్యక్షుడు నారగాని శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రావుల కిషన్,మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,మాజీ ఉప సర్పంచ్ కిన్నెర మణి, ముఖ్య నాయకులు సంగానీ వేణు,కొక్కిరాల శ్రీధర్ రావు, మొర్రి సారయ్య,గొడిశాల రంజిత్ కుమార్, నేవారుగొమ్ముల రవీందర్ రావు,దుప్పటి మొగిలి, యూత్ సభ్యులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపిలో చేరిన కంచనపల్లి బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు

కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన బొజ్జపల్లి సుభాష్

రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి:-

మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకులు బిజెపి మండల అధ్యక్షులు పుప్పుల వేణు కుమార్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ పార్టీలో చేరిన వారిలో నీలారపు సంపత్ యాదవ్, మేకల ఐలయ్య, పనికర కుమార్, నవీన్, కౌడగాని మనోజ్, జిట్టబోయిన రాజు, వంగపల్లి రాజు, ముత్యాలవెంకటేష్, ఇల్లందు ఎల్ల గౌడ్, ఇల్లందు సంజయ్, కాబట్టి ప్రదీప్ ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోరంటల బలరాములు, అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, రాష్ట్ర కన్వీనర్ నెంబర్ కాబట్టి ముత్యాల యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి మంద వెంకటేష్, జిల్లా కార్యదర్శి ఉపేందర్, మండల ఇన్చార్జి వల్లాల వెంకటేష్ యాదవ్, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి 11 న వనపర్తిపర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన. ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ వనపర్తి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ హెలిపాడ్ ఏర్పాట్లు వనపర్తి ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి పరిశీలించారు. హెలిపాడ్, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటులు పరిశీలిం చారు
బందోస్తు కు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీచేశారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమానం పాటించాలనిపోలీస్ అధికారులకు సూచించారు. కేంద్ర హోం శాఖ మంత్రి పర్యటన సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీసు అధికారుల ను కోరారు ఎస్పీతో పాటు వనపర్తి అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ వీరారెడ్డి డిఎస్పి శ్రీ వెంకటేశ్వరరావు , వనపర్తి సీఐ నాగభూషణం , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ అప్పలనాయుడు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు నరేష్ ,మల్లేష్ వనపర్తి టౌన్ ఎస్సై లు జయన్న రామరాజు జిల్లా పోలీస్ అధికారులు ఉన్నారు

విజయ గణపతి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం లోని శ్రీ విజయ గణపతి దేవాలయం నూతన కమిటీని బుధవారం రోజున గాదిరాజు కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ సభ్యులందరూ ఆలయ అభివృద్ధికై కృషి చేస్తామని అన్నారు. అధ్యక్షులుగా గాదిరాజు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా హనుమాన్ల శ్రీధర్ రెడ్డి, ఊడుగుల సురేందర్, సంయుక్త కార్యదర్శిలు గా ఆకినపల్లి సురేష్, వేముల హరిప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తేజావత్ రామకృష్ణ, బోనాల మునుస్వామి, కోశాధికారిగా సీతారాంరెడ్డి, కొట్టాల రాజయ్య కార్యదర్శులుగా ముక్కేర రమేష్,ముద్దసాని శ్రీనివాస్, అడ్వైజర్స్ గా శఠగోపం కిష్టయ్య, బండి మల్లేష్, లక్కిరెడ్డి రాజిరెడ్డి,నూనె శ్రీనివాస్, గోనెల సతీష్, చంద్రగిరి రమేష్, మీడియా ఇన్ఛార్జిగా అరింద వెంకటస్వామి, సంకటహర చతుర్థి ఇన్చార్జిగా కల్లేపల్లి ప్రభాకర్, మొగిలి సదానందం కార్యవర్గ సభ్యులుగా నరెడ్ల వెంకన్న, నల్లగొని కుమారస్వామి,బొక్క మురళి తదితరులను ఎన్నుకోవడం జరిగిందని సంఘ సభ్యులు తెలిపారు.

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి,సోమనపల్లి,అంకుషాపూర్, రామకిష్టపూర్ (టీ),పంగిడిపల్లి,పెద్ధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సమావేశంలో గండ్ర వెంకట రమణా రెడ్డి కార్యకర్తల ను ఉద్దేశించి మాట్లాడుతూ.
ఓటు అనేది ఒక్క పార్టీకి, ఒక్క వ్యక్తి కోసం కాదు దేశ ప్రజల అభివృద్ధికి వేయాల్సిన ఓటు.
మే13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గారి కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు…
తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి,తొలి ముఖ్యమంత్రి,బి ఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు,రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసి కళ్యాణ లక్ష్మీ,అపర భగీరథుడై అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్రం మొత్తం గోదావరి జలాలను పారించి బీళ్లు బారిన పొలాలను పచ్చని మాగాణి చేసి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు మన కేసీఆర్
10 ఏండ్ల పరిపాలన ఎంతో మార్పు తీసుకోచిండు.
ఆనాడు సమైక్య ఆంధ్రలో కరెంటు కష్టాలు చూసినం, రైతు ఆత్మహత్యలు చూసినం.
కానీ కేసీఆర్ రైతుల సంక్షేమం కొరకు 10000/- రూపాయల పంట సహాయం,5 లక్షల రూపాయల రైతు భీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్,గోదావరి జలాలను ప్రతి ఇంటికి,ప్రతి గుంటకు అందించారు.
అయిన సరే ప్రజలు దొంగ హామీలకు, గారడీ మాటలకు లొంగి లక్ష రూపాయలు + తులం బంగారం,మహిళలకు 2500, 500లకే వంట గ్యాస్,ఉచిత బస్సు వంటి పథకాలకు మహిళలు ఆశపడితే,వృద్ధులు,వితంతువులు 4000 రూపాయలకు ఆశపడితే,రైతులు రూ. 15000/- రైతు బంధుకి, రైతు కూలీలు రూ.12000/-,రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామనే విద్యార్థినులకు కేనటిక్ స్కూటీ లు ఇస్తామని ఆశ పడి ఓటు వేసి మోసపోయారు.
కావున ఇవన్నీ ప్రజలందరికీ మరొక్కసారి అర్థమయ్యేలా చెప్పి ఓటు ఉద్యమ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి,దొంగ హామీల కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి, మతతత్వ పార్టీ బిజేపి కి ఎందుకు ఓటు వేయాల్లో వివరించాలని కోరారు.
అదే విదంగా భూపాలపల్లి అభివృద్ధి కొరకు అహర్నిశలు నా వంతు కృషి చేసిన,నేను ఇచ్చిన పనులకు మళ్ళీ ప్రస్తుత శంకుస్థాపన చేయడం, అభివృద్ధి పనులను రద్దు చేయడం సిగ్గు చేటు.
ఎన్నికలకు ముందు వరకే పక్షపాతం ఉండాలి,ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గం మొత్తం ప్రజానీకానికి ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు.
నేను అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీ మధ్యనే ఉంటా,ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా,ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజల తరువున వారి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రజలందరూ బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి డా.సుధీర్ కుమార్ ని గెలిపించాలని, ఈ గెలుపు దొంగ హామీల కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డికి చెంప పెట్టు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఆకునూరు తిరుపతి సోమనపల్లి మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్ సదానందం తదితరులు పాల్గొన్నారు

అకాల వర్షంతో వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గణపురం మండల మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ
అకాల వర్షాలతో, జిల్లాలోని అన్ని మండలాల్లో వరి పంట గాలికి పూర్తిగా నెలకోరిగి, దెబ్బ తిన్న వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే పార్టీలో చేరికలపై ఉన్న శ్రద్ధ రైతులపై కొంచెం రైతులపై పెట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నష్టపరిహారం వచ్చేలా సహకరించాలని, లేని పక్షంలో రైతులను సంఘటితం చేసి జిల్లాలో నష్టపరిహారం కోసం పోరాటం చేస్తామని అన్నారు
ఇప్పటికే రైతుబంధు, రుణమాఫీ లేక రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో రైతుల పై గాలి వర్షం పిడుగుపడినట్లు అయిందని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు

మూడోవ సారి ప్రధానిగా మోడీని గెలిపించండి

బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్

జైపూర్, నేటి,ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా,జైపూర్ గ్రామాలలో బుధవారం రోజున బిజెపి మండల అధ్యక్షుడు దుగుట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసుని లక్ష కోట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామం లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా ఉండి తీస్కోచ్చారు. బిజెపి కి ఓటు వేసి గెలిపిచల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. మరియు నూతనంగా జైపూర్ మండల అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన దుగుట రాజ్ కుమార్ ను జైపూర్ మండలంలోని అన్ని గ్రామాల బూత్ స్థాయి అధ్యక్షులు బిజెపి పార్టీ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోష్,తిరుపతి గౌడ్,మల్లేష్, వెంకటేష్ ,కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు సకల సౌకర్యాలు కల్పించాలి

ఎన్నికల ప్రత్యేక అధికారి సంజీవరావు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం నందు ప్రత్యేక అధికారి సంజీవ రావు ఆధ్వర్యంలో మే 13, 2024 న పార్లమెంటు ఎన్నికలు పోలింగ్ కేంద్రాలలో జరగబోవు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల నందు ఏర్పాట్లకు సంబంధించి తాగునీటి వసతి, టెంట్ సౌకర్యం, ర్యాంపు, విధ్యుత్ సౌకర్యం, ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి భోజన వసతి, మరుగుదొడ్లు సౌకర్యాల వంటి అంశాలపై మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తాహసిల్దార్ సుభాషిని, ఎంపీడీవో ఫణి చంద్ర, మండలంలోని 24 గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, బి ఎల్ ఓ ఎస్ రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version