# గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
# నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ కు బదులుగా మరో డాక్టర్ వైద్యం.
# జననీ,కరుణశ్రీ,నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రులల్లో తనిఖీలు..
# పలు ఆసుపత్రులకు నోటీసులు జారీ..
# డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్
నర్సంపేట,నేటిధాత్రి :
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనవసరమైన భ్రూణ హత్యలు చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య డిప్యూటీ అధికారి డాక్టర్ ప్రకాష్ హెచ్చరించారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుకు గల జనని ఆస్పత్రి నెక్కొండ రోడ్డు లోని నర్సంపేట న్యూరో సెంటర్ అలాగే కరుణాశ్రీ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రిలో రికార్డులను తనిఖీలు చేశారు. పట్టణంలోని కరుణశ్రీ ఆస్పత్రిలో ఒక మహిళకు అధికార రక్తస్రావం వలన అబార్షన్ తోపాటు గర్భసంచి తొలగించాలని ఆరోపణలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ అధ్వర్యంలో వైద్యాధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. ఈమధ్య కరుణశ్రీ హాస్పిటల్ లో జరిగిన సంఘటన పట్ల ఆరా తీయగా ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించిన కేసు వివరాలను పరిశీలించి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డిఎం హెచ్ ఓ తెలిపారు.ఇటీవల నర్సంపేట పట్టణంలో నర్సంపేట న్యూరో హాస్పిటల్ ఏర్పాటు కాగా ఆ ఆసుపత్రిని పరిశీలించగా అందులో ఉండవలసిన డాక్టర్లు అందుబాటులో లేనందువలన వారి బదులుగా వేరే డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని నిర్ధారణ అయ్యిందని కాగా సిబ్బంది ద్వారా హాస్పిటల్ మేనేజ్ మెంట్ కు నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు.
వరంగల్ రోడ్డుకు గల జనని ఆసుపత్రినీ వైద్యాధికారులు ఆకస్మితంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.అలాగే ఆసుపత్రికి సంబంధించిన సేవల్లో డాక్టర్లు,పారామెడికల్ సిబ్బంది మాత్రమే సేవలందించాలని తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా అనుమతి లేని ఆసుపత్రులు నడిపిన అనుమతిలేని డాక్టర్లు వైద్యం చేసిన వారిపైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. ఎవరైనా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనవసరమైన భ్రూణ హత్యలు చేసిన మరియు అనవసర సిజేరియన్ ఆపరేషన్లు చేసిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.ఆయా ఆసుపత్రుల లోపాల వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని, కరుణశ్రీ ఆసుపత్రి నర్సంపేట న్యూరో సెంటర్ ఆసుపత్రి లకు నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ వివరించారు.ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఎల్డీ కంప్యూటర్ నాగరాజు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.