Fuel Shortage Protest in Bhupalpally
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం..
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ను సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కమిటీ వైపు నుండి సందర్శించడం జరిగింది వినియోగదారులను కలిసి మాట్లాడడం జరిగింది డీజిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది అనే ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైపల్యం వలనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఏర్పడుతుందని ప్రజలు చైతన్యవంతంగా ఎండ కట్టాలని పిలుపునిచ్చారు కేవలం లాభపేక్షతోనే ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించుతున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వము సమరు కంపెనీలు సంస్థలు కలిసి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నారని తక్షణమే రైతులను ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సామాన్య ప్రజానీకానికి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీజిల్లా కమిటీ సభ్యుడు కసర వేణి కుమార్… రాజు పాల్గొన్నారు
