Medipalli Leaders Seek Funds for Development
ఎంపీ, ఎమ్మెల్సీ నీ కలిసిన
మేడిపల్లి సర్పంచ్ వార్డుమెంబర్లు
* గ్రామభివృద్ధి కి నిధులు కేటాయించాలని MP కి విన్నపం
• మేడిపల్లి లింకు రోడ్డు విస్తరణకు ఎమ్మెల్సీ హామీ
నేటిధాత్రి, మొయినాబాద్ :
మండలంలోని మేడిపల్లి గ్రామ అభివృద్ధిపనుల కోసం,సమస్యల పరిష్కారం కోసం మేడిపల్లి సర్పంచి, మల్కాపురం శ్రీనివాస్ వార్డు సభ్యులు మంగళవారం ఎంపి కొండావిశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలను జూబ్లీహిల్స్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలను విన్నవించారు. మొయినాబాప్ మండలంలోని మేడిపల్లి గ్రామం అభివృద్ధిలో అన్ని రంగాల్లో గ్రామం ముందుకు సాగడానికి ఎంపీ, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామం నుండి గేటు వరకు మేడిపల్లి లింకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్సీని కోరడం జరిగిందని, ఎంపీ నిధుల్లో నుంచి మేడిపల్లి గ్రామానికి నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. అందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ నిధుల నుండి తక్షణమే మేడిపల్లి గ్రామపంచాయతీకి సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని, ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు.
మేడిపల్లి లింకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయటానికి కృషి చేస్తానని,
గ్రామ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ మల్కారం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ వార్డు సభ్యులు పి. రమేష్, కె. నవీన్,కే.బాలరాజ్, సిహెచ్.మధుకర్, టి. రామచంద్ర, శ్రీశైలం, ఎం.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
