పరకాల నేటిధాత్రి
బహుజన లెఫ్ట్ ఫ్రoట్ బలపర్చిన ఎంసీపీఐ
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కామ్రేడ్ సావిత్రి మాస్
ఏకగ్రీవంగాఎంపిక చేసిన బిఎల్ఎఫ్,ఎంసీపీఐ కేంద్ర కమిటీలు తెలంగాణ మలిదశ ఉద్యమకారిని,అనేక ప్రజా,విద్యార్టీ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సావిత్రి మాస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.అందుకు ఆయా కేంద్ర కమిటీలు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి.ప్రజా పోరాటలతో నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పట్ల గొంతు వినిపించే తెలంగాణ మలిదశ ఉద్యమ కారునిగా గుర్తించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా ప్రకటించిన బిఎల్ఎఫ్,ఎంసీపీఐ నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలుపారు.
అలాగే వరంగల్ పార్లమెంట్ పరిధి ఓటర్లు తనను ఆదరిస్తారని విశ్వసం వ్యక్త పరిచారు.నిస్వార్థంగా వరంగల్ పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం ఇక్కడి ప్రజలు కల్పిస్తారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.త్వరలో వరంగల్ అభివృద్ధి మ్యానిఫెస్టోతో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామని సావిత్రి మాస్ తెలిపారు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎంసీపీఐ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాస్ సావిత్రి
