Mahesh–Trisha Rumour Resurfaces
మహేష్-త్రిష ఎఫైర్..
నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. చిన్న హింట్ దొరికితే చాలు పెద్ద కథే అల్లేస్తుంటారు. అచ్చం అలాగే మహేష్ బాబు సీక్రెట్ ఎఫైర్ తాలూకు విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఓ నిర్మాత మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో మహేష్ బాబు హీరోయిన్ త్రిషతో సీక్రెట్ ఎఫైర్ నడిపించారని టాలీవుడ్ నిర్మాత నేరుగా చెప్పేశారు. అంతేకాదు వారిద్దరూ సీక్రెట్ గా ముంబైలో కలిసే వారని, ఓ రోజు ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత కనిపెట్టి ఎంతో చాకచక్యంగా ఇష్యూ క్లోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు.
నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత మనం రెగ్యులర్ గా వింటుంటాం. కాబట్టి ఎంతోకొంత మ్యాటర్ లేనిదే విషయం బయటకెలా వస్తుందనేది సదరు నిర్మాత అభిప్రాయం అని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. దీంతో మహేష్- త్రిష ఎఫైర్ అనే విషయం మరోసారి చర్చల్లో నిలిచింది.
నమ్రత శిరోద్కర్ ని కూడా ప్రేమించి పెళ్లాడారు మహేష్ బాబు. వంశీ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమాయణం నడిపించి పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో ఆ నిర్మాత చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
