kasulapia preethi…ideam rithi, కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…

కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…
వరంగల్‌ అర్బన్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో అవినీతి ఛాయలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇక్కడా…అక్కడా అనే తేడా లేకుండా అందినకాడికల్లా దోచుకోవడమే తమ ద్యేయమన్నట్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రతి యేటా కాలేజీలు అనుమతులు తీసుకోవడం, రెన్యువల్స్‌ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కాలేజీ అఫ్లియేషన్లు చేయాలన్నా, రెన్యువల్‌ కావాలన్నా కళాశాలల యజమాన్యాలు వీరి చేయి తడిపితేనే పనులు చకాచకా జరుగుతాయని లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న ఛందంగా ఆయా ఫైళ్లు మూలనపడుతాయని పలు కాలేజిల యాజమన్యాలు ఆరోపిస్తున్నాయి.
ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకుంటున్న వైనం
కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అవినీతి ఆటలకు కార్యాలయంలోని ఓ అధికారి అండదండలు అందిస్తుండటం మూలంగానే ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కో కాలేజి నుండి వేలకువేలు వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ఇంటర్మీడియట్‌ బోర్డు హైదరాబాద్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమంగా దండుకున్న డబ్బులను ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. క్యాంపు పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగమయినట్లు కార్యాలయంలో పెద్దఎత్తున ప్రచారం కొనసాగుతున్నది. క్యాంపు కార్యాలయంలో పనిచేయని వారి అకౌంట్లల్లో డబ్బులు జమ చేసినట్లు కార్యాలయ సిబ్బందితోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
                                                                    – ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి వంతపాడుతున్న ఓ అధికారి….
                                                                              వివరాలు రేపటి సంచికలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *