నిజాంపేట ,నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ కు తన వంతుగా లక్ష రూపాయల విరాళం అందజేసిన భీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన జీవనశైలితో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయిందని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం గ్రామానికి చెందిన యువకులు ఆరోగ్యమే మహాభాగ్యం పేరిట ట్రస్టులు ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్ కు విరాలలు సేకరించడం అభినందనీయమని వారికి ఎల్లవేళలా అండగా ఉండాలని అన్నారు. అలాగే వ్యాయామం చేయడం వలన శరీర దారుఢ్యం పెంపొంది ఆరోగ్య వంతంగా ఉంటారని తెలిపారు. అనంతరం విరాళా దాతకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీఆర్ఏస్ నాయకులు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ లు బాపురెడ్డి, భాజే చంద్రం బాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, చింతల స్వామి మావురం రాజు, సంగు స్వామి, ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.