భద్రాచలం నేటి ధాత్రి
ఆదివాసీ నేత కంగాల రమణకుమారి జాతీయ ఎస్టి చైర్మన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటనలో భాగంగా భద్రాచలం పిఓ ప్రాంగణంలో ఆదివాసి సమస్యలపై వినుతులను స్వీకరించారు. అందులో భాగంగా మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంగాల రమణకుమారి ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ ఎస్టి చైర్మన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్లారు. ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో పిసా,1/70 , చట్టం అగ్రవర్ణ ఆధిపత్య కులాల బడా వ్యాపారస్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని వివరించారు. ఇట్టి విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తపరిచారు. మద్యం టెండర్లు గిరిజనుల పేరు మీద పాడుకొని అగ్రవర్ణ ఆధిపత్య కులాల బడా వ్యాపారస్తులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. దీనివలన ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. ఆర్థికపరమైన నష్టం వాటిల్లుతుందని అలాగే ఈ ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులను గల్లీ గల్లీ కు ఏరులై పారిస్తున్నారని దీనివలన ఏజెన్సీ ప్రాంత యువకులు మద్యానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. అలాగే అగ్రవర్ణ ఆధిపత్య కులాలు బడా వ్యాపారస్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆదివాసులు ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకుంటే నకిలీ పత్రాలను సృష్టించి ఆదివాసీలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆమె అన్నారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని పోలీసులతో కొట్టించి కాళీ చేయించుతున్నారని విన్నవించారు 1/70 యాక్ట్ ప్రకారం భూ క్రయ విక్రయాలు, చేయకూడదని, బహుళ అంతస్తుల నిర్మాణాలు, కట్టకూడదని, చట్టం చెబుతున్న చట్టాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆమె అన్నారు, పీసా చట్టం ప్రకారం ఇసుక రీచులు ఏర్పాటుచేసి గిరిజనులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆదాయం పెంచాల్సి ఉండగా అధికారులతో రహస్య ఒప్పందాలు చేసుకొని ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుందని ఆమె విన్నవించారు. మద్యం మాఫియా ,ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా,ను అధికారుల అండదండలతో కొందరు రాజకీయ నాయకుల బలంతో యదేచుగా వారి వారి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆదివాసి ప్రాంతంలో ఆదివాసులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జాతీయ ఎస్టీ చైర్మన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. చట్టాలను అమలుపరిచే అధికారులు వారికి అండగా ఉంటున్నారని నా నోటిస్ కి వచ్చిందని తక్షణమే దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ఎవరైతే ఏజెన్సీచట్టాలను అధిక్రమిస్తారో వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.