జంకుఫుడ్ ఆరోగ్యానికి హానికరం
* కౌన్సిలర్ మంగలి కళ్యాణియాదగిరి
చేవెళ్ళ నేటిధాత్రి :
ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలోని అంగన్వాడీ 3వ సెంటర్ లో అంగన్వాడీ టీచర్ అఫియా నూర్జన్
ఆధ్వర్యంలో వంటల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందే అందుబాటులో దొరికే తాజా వివిధ ఆహారపదార్థాలు , ఆహార వైవిద్యం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా 18 వ వార్డు కౌన్సిలర్ మంగలి కళ్యాణియాదగిరి హాజరై మాట్లాడుతూ జంకుఫుడ్ వల్ల అనారోగ్య సమస్యలు తలేత్తె ప్రమాదం ఉందని అన్నారు. పిల్లలను జంకుఫుడ్ కు దూరంగా ఉంచాలని అన్నారు. పిల్లలకు పౌష్టిక పోషకాలు కలిగిన ఇంటిఆహారం మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడిసి సూపర్ వైజర్ రేవతి, అంగన్వాడీ టీచర్ అఫియా నూర్జన్,అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
