ఎర్కారం మర్డర్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్.

ఎర్కారం మర్డర్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్.

నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న ఒక కారు, ఒక బైకు, హత్య కు ఉపయొగించిన కత్తి, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట, నేటి ధాత్రి :

 

జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఏపీఎస్ సూర్యాపేట రూరల్ పరిది ఏర్కారం గ్రామ శివారు రోడ్డు కల్వర్టు క్రింద దొరికిన మృతదేహం కేసులో పోలీసులు పటిష్టమైన వేగంతమైన దర్యాప్తు చేశారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. హత్యకు గురైన వ్యక్తి ఏర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త 42 సంవత్సరాల చింతలపాటి మధు గా గుర్తించాం. కాగా మధు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సూర్యాపేటలో కుడకుడ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంట్లో నుండి వెళ్లి రాత్రి వరకు రాకపోవడం తో అతని భార్య మౌనిక శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసి వేగంగా స్పందించిన పోలీస్ డిఎస్పీ పర్యవేక్షణ, జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మధు కోసం గాలింపు చేపట్టారు. ఎర్కారం గ్రామ శివారులో కల్వర్టు క్రింద గోనే బస్తా మూటలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్యాకేసుగా మార్పు చేసి 5 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట పట్టణ కేంద్రం తాళ్ళగడ్డ లో ఏ2 సైదులు నివాసం ఉంటున్న కిరాయి ఇంటిని పోలీసులు గుర్తించడం జరిగినది. హత్య జరిగిన ఇంటి వద్ద క్లూస్ టీం, కేసు దర్యాప్తు అధికారులు అధారాలను సేకరించారు. సంఘటన జరిగిన 24 గంటలోపే హత్యకు పాల్పడిన వారిని గుర్తించడం జరిగినది. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు నిర్దారించాం. 2007 సంవత్సరంలో ఏర్కారం గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ ను హత్య చేసిన కేసులో చింతపాటి మదు ప్రధాన నిందితుడు, ఈ విషయంలో ప్రతీకారం పెంచుకున్న మిద్దే రవీందర్ కొడుకు మిద్దే జీవన్ ఈ హత్యకు పథకం పన్ని ప్రత్యక్షంగా, ప్రధానంగా ఉన్నట్లు గుర్తించినాము. ఈ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో బృందం సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల గ్రామం వద్ద జాతీయ రహదారి 65 పై ఖమ్మం హైవే టి-జంక్షన్ వద్ద ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో A1 నిందితుడు మిద్దె జీవన్ ను, A4 నిందితుడు మిద్దె ఆనంద్ లను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. విచారంలో భాగంగా తన తండ్రి మిద్దె రవీందర్ ను హత్య చేసిన విషయంలో ప్రతికారంగాను, మధు బతికి ఉంటే తనకు ప్రాణహని తప్పదు అని భావించి మధు ను ఎలాగైనా చంపాలి అని పథకం ప్రకారం హత్య చేశాము అని A1 నిందితుడు జీవన్ తెలిపినాడు. మధును హత్య చేసే విషయంలో మధుకు స్నేహితులైన, నిందితుని దూరపు భండువులైన సూర్యాపేట రూరల్ మండలం రామన్నగూడెం కు చెందిన A2 నిందితుడు చింత సైదులు, అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన A3 మేదిరి ప్రసాద్ లను జీవన్ స్నేహితులుగా చేసుకున్నాడు. వీరు ముగ్గురు కలిసి మందు దావతులు చేసుకునేవారు, మా తండ్రిని చంపిన మధును ఎలాగైనా చంపాలి అన్న విషయాన్ని సైదులు, ప్రసాదులకు జీవన్ తెలియజేసి అందుకు సహకరించాలని డబ్బు ఇస్తానని కోరాడు. అలాగే మధును చంపాలన్న విషయాన్ని జీవన్ కు తమ్ముడు వరస ఐన యార్కారం గ్రామానికి మిద్దె ఆనంద్ కు చెప్తాడు. మధు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తాడు అని కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని 2021లో ప్రయత్నించి విఫలమయ్యారు. మరొకసారి నిమ్మికల్ లో ఫంక్షన్ హల్ వద్ద హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మధును ఎలాగైనా చంపాలి అని పథకం ప్రకారం ఏ2 నిందితుడు సైదులుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాళ్లగడ్డలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇల్లు కిరాయి కడుతూ వారి ఖర్చులు కూడా జీవన్ భరిస్తున్నాడు. మధును చంపాలన్న విషయాన్ని సైదులు భార్య భవానికి తెలిపి అందుకు సహకరిస్తే మూడు లక్షలు ఇస్తానని ఒప్పించాడు. తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన కక్కిరేణి భరత్ కు మధును చంపాలన్న విషయాన్ని జీవన్ తెలియజేసి సహకరించాలని కోరాడు. తాళ్లగడ్డలో కిరాయికి తీసుకున్న ఇంట్లో సైదులు, ప్రసాద్, మధు ముగ్గురు మందు దావతులు చేసుకునేవారు. సైదులు బార్య భవాని వారికి చికెన్, మటన్ ఇతరాలు తయారు చేసి పెడుతుండేది. ఇదే క్రమంలో శుక్రవారం తేదీ 22.05.2026 మధ్యాహ్నం చేపలు, మందు తెచ్చాము దావత్ చేసుకుందామని రమ్మని సైదులు, ప్రసాద్ లు మధుకి ఫోన్ చేసి పిలవడం జరిగింది. మద్యహన్నం రెండు గంటల సమయంలో మధు కిరాయి ఇంటి వద్దకు రాగా ఈ విషయాన్ని జీవన్ కు సైదులు ఫోన్ చేసి తెలియజేసి మందు పంపమని చెప్పాడు. జీవన్ ఏ6 నిందితుడు భరత్ ద్వారా రెండు సార్లు మందు పంపించడం జరిగింది. జీవన్ కారులో జీవన్, ఆనంద్ ఇద్దరు వచ్చి ప్రభుత్వాసుపత్రి వద్ద వేచి ఉంటారు, సుమారు 7:30 గంటల సమయంలో మధు మద్యం మత్తులో ఉన్నప్పుడు అదునైన సమయం చూసి విషయాన్ని జీవన్ కు తెలుపగా జీవన్, ఆనంద్ లు ఇద్దరు కారులో మధు ఉన్న ఇంటికి చేరుకుని ఇంటిలోకి వెళ్తారు. ఇంటిలోకి వెళ్ళగానే ప్రసాద్ మధు యొక్క కాళ్లు చేతులు పట్టుకోగా అప్పటికే సిద్ధంగా పెట్టుకున్న మటన్ కొట్టే కత్తితో సైదులు మధు పై దాడి చేస్తాడు, వెంటనే సైదులు వద్ద ఉన్న కత్తిని జీవన్ తీసుకుని మధు మెడ, మొహం, భుజంపై తీవ్రంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం మృతిదేహాన్ని గోనెసంచి బస్తాలో కట్టి కారులో వేసుకొని వెళ్లి యర్కారం శివారులో కల్వర్టు కింద పడి వేయడం జరిగింది. మధు యొక్క బైకును ఆనంద్ తీసుకుని వెళ్లి బాలెంల శివారులో నయారా పెట్రోల్ బంక్ కు సమీపంలో వదిలివేయడం జరిగింది. అలాగే ప్రసాద్ బైక్ పై ప్రసాదు, సైదులు ఇద్దరు వెళ్లిపోయి హత్యకు ఉపయోగించిన కత్తిని, మధు యొక్క సెల్ ఫోను అడివేముల గ్రామ.శివారు కొద్ది దూరంలో కెనాల్ లో పడివేశారు. తదుపరి నిందితులు అక్కడి నుండి పారిపోయారు.నమ్మదగిన సమాచారంపై ఏ1, ఏ4 లను అదుపులోకి తీసుకొని వారు చెప్పిన వివరాల ఆధారంగా మరో ఏ2, ఏ3, ఏ6 ముగ్గురు నిందితులను సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈనాడు ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి నుండి ఒక బైకు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ కేసులో నిందితుల నుండి ఒక కారు ఒక బైకు హత్య చేసిన కత్తి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. కేసును అన్ని కోణాల్లో పటిష్టంగా దర్యాప్తు చేసి హంతకులకు త్వరితగతిన శిక్షలు పడేలాగా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. పిడి యాక్ట్ సైతం నమోదు చేస్తాం, ఎవరైనా చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతూ భౌతిక దాడులకు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని ఎస్ పి హెచ్చరించారు. గతంలో జరిగిన హత్య కేసులలో నేరస్తులకు జీవిత కైతే శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. పోలీస్ శాఖ నాణ్యమైన దర్యాప్తు చేస్తూ కేసులను వేగవంతంగా సాంకేతిక కోణంలో దర్యాప్తు చేస్తుందని పక్క ఆధారాలు, సాక్షాలు నమోదు చేసి కోర్టులకు పంపిస్తున్నామని త్వరితగతిన శిక్షలు అమలు అవుతున్నాయని అన్నారు. ఈ కేసులో బాగా పనిచేసి పర్యవేక్షణ చేసిన సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ ను, పట్టణ సిఐ వెంకటయ్య, రూరల్ సిఐ రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్సైలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, రూరల్ ఎస్సై బాలు నాయక్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందినీ మరియు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, టెక్నికల్ టీం ను అభినందించడం జరిగింది. ఎస్పి వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ లు ఏడుకొండలు శివతేజ, సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version