Employees Demand Release of Pending Benefits
ఉద్యోగుల బెనిఫిట్ లపై సర్కారు శీత కన్ను
పెండింగ్ బెనిఫిట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
ట్రెంగ హనుమకొండ జిల్లా అధ్యక్షులు మరుపట్ల మల్లయ్య డిమాండ్
నేటిధాత్రి , ఐనవోలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ (ట్రెంగ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మరుపట్ల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, జీపీఎఫ్ లోన్లు, పదవీ విరమణ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఈహెచ్ఎస్ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని, సీపీఎస్ రద్దు చేసి జీపీఎఫ్ విధానం అమలు చేయాలని, జీఓ 317 ప్రకారం బదిలీలను సరిచేయాలని కోరారు. అలాగే రెవెన్యూ శాఖలో పదోన్నతులు, గ్రామ రెవెన్యూ సహాయకుల నియామకాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 17న భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ట్రెంగ్ సంఘం పిలుపునిచ్చింది. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నాయకులు కోరారు.
