జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బైరి మధు గౌడ్ ఆదివారం రోజున ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి మృతి చెందడం జరిగింది. ఆదివారం ఉదయం తన స్వగ్రామం నుండి గోదావరి నది అవతల ఒడ్డు వైపు గల మంథని దగ్గర లోని గంగాపూర్ గ్రామంలో తమ బంధువుల ఇంటికి పెద్దకర్మ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్లారు.సాయంత్రం తిరుగు ప్రయాణంలో భార్యాపిల్లలు ఆటోలో ఇంటికి వెళ్ళగా మధు గౌడ్ ఒక్కడు మాత్రం తన కులవృత్తి అయినటువంటి తాటి చెట్లు ఎక్కి ఇంటికి వస్తానని చెప్పి గోదావరి నదిని దాటి వెళ్లాలని ప్రయత్నించిన క్రమంలో లోతును అంచనా వేయలేకపోవడం వల్ల నీటిలో మునిగి పోయి మరణించారని స్థానికులు తెలిపారు.ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతుకుచుండగా గోదావరి నదిలో మునిగి మృతి చెందారని తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపించారు .కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య లక్ష్మి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.