కామారెడ్డిపల్లె గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం

పరకాల నేటిధాత్రి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం, కామారెడ్డిపల్లె గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆరోగ్య శిబిరమును హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి ప్రారంభించి వృద్దులకు వైద్య సేవలు అందించారు.చైర్మన్ మాట్లాతుడు తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్,సీనియర్ సిటిజన్స్,భారత ప్రభుత్వ సహాకారంతో వయో వృద్ధులకు సేవలందించాలనే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వృద్ధులకు బిపి.షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి(121) మందికి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు.ఈ ఆరోగ్య శిబిరంలో హనుమకొండ రెడ్ క్రాస్ డాక్టర్లు కిషన్ రావు,మొహమ్మద్ తహర్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,పవన్, lరమేష్, రాజు,గ్రామస్తులు కాసగాని రాజ్ కుమార్,కొమ్మిడి మహేందర్ రెడ్డి మరియు వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *