Dustbins Installed in Zaheerabad Wards
14, 7, 6 వార్డులలో తన సొంత ఖర్చుతో చెత్తబుట్టల ను ఏర్పాటు
◆”-: సామాజిక కార్యకర్త ముహమ్మద్ ఫిర్దౌస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ – రంజాన్ మాసం ప్రారంభానికి ముందే, 14వ వార్డులోని మస్జిద్ ఖుబా సమీపంలో చెత్త బుట్టలను ఏర్పాటు చేస్తానని సామాజిక కార్యకర్త ముహమ్మద్ ఫిర్దౌస్ సర్వర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కోహిర్ ముహమ్మద్ ఇఫ్తికార్ అలీ ముహమ్మద్ రెహమత్ అలీ సమక్షంలో, 14వ వార్డులోని మస్జిద్ ఖుబా వద్ద, అలాగే 6 మరియు 7వ వార్డులలోని నూర్ ఉలూమ్ మస్జిద్ సమీపంలో ఆయన చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, సంబంధిత వార్డుల ప్రజలు తమ చెత్తను ఆయా చెత్త బుట్టలలోనే వేయాలని ముహమ్మద్ ఫిర్దౌస్ సర్వర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముహమ్మద్ అష్ఫాక్, ముహమ్మద్ అస్లాం తబ్రేజ్, ఆలం షాబాజ్, మోడల్ ముహమ్మద్ షోయబ్ తదితరులు కూడా పాల్గొన్నారు
