Water Tankers Ease Shortage in Parkal Ward
వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటి సరఫరా
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని ఒకటో వార్డులో తలెత్తిన నీటి కొరత సమస్యకు తాత్కాలిక పరిష్కారం కల్పించబడింది.ఇటీవల రోజులుగా మంచినీటి లభ్యత లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,ఒకటో వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి చొరవతో వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటు చేయబడింది.ఈ చర్యతో తాత్కాలికంగా నీటి సమస్య కొంతవరకు తగ్గినట్లు స్థానికులు తెలిపారు.సమస్య పరిష్కారానికి స్పందించిన కౌన్సిలర్‌కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బొచ్చు సతీష్,మంద నరేష్,మేకల వినయ్ తదితరులు పాల్గొన్నారు.
