Goat Gives Birth to Four Kids at Once
ఒకే కాన్పులో నాలుగు మేక పిల్లల జననం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో యాదన వేణి మల్లేష్ యజమాని యొక్క మేక ఒకే కాన్పులో 4 మేక పిల్లలకు జన్మనిచ్చింది.ఈ విశేషమైన జననంలో పుట్టిన నాలుగు పిల్లలు అందులో 2 మగవి,2ఆడవి,తల్లి మేక, పిల్లలు ఆరోగ్యంగా ఉండడం విశేషం.సాధారణంగా మేకలు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మిస్తుంటాయి.కొన్నిసార్లు మూడు పిల్లలు కూడా పుడతాయి.కానీ ఒకే కాన్పులో నాలుగు మేక పిల్లలు జన్మించడంతో ఆ యజమాని సంతోషం వ్యక్తం చేశారు.
