కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామానికి చెందిన వ్యవసాయ రైతులు పొడి భూమి సమస్యపై పినపాక ఎమ్మెల్యే పాయం మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యను విన్నపించారు గత 35 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి భూమిని 40 కుటుంబ కలిసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఈ భూమి రెండు పంటలు పండుతుందని ఈ భూమిలో కరెంటు సౌకర్యం మరియు బోరులు ఉన్నాయని ఈ భూమి ఫారెస్ట్ భూమి అంటూ గత కొంత కాలం నుండి బీట్ ఆఫీసర్స్ ఇబ్బందికి గురి చేస్తున్నారని మాపై దయవుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు మా జోలికి రాకుండా చూడాలని ఎమ్మెల్యే పాయం వినతి పత్రం అందజేశారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తగు ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే పాయం మోతే రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు