ఏ వైఎస్ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
దేశ వ్యాప్తంగా ఉన్న బహు జనులకు న్యాయం జరుగాలంటే బహు జనులు రాజ్యాధికారం చేపడితేనే సమాన న్యాయం జరుగుతుందని వారు రాజ్యాధికారం చేపట్టాలని అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మాన్య శ్రీ కాన్షీరాం* గారని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు .
శని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఆధ్వర్యంలో మాన్య శ్రీ కాన్షీరాం 91వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు పూలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాన్షీరాం గారు మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని పూర్తిగా తెలుసుకుని బహు జనులు రాజ్యాధికారం చేపడితేనే అందరికి సమాన న్యాయం జరుగుతుందని గ్రహించి బహు జనులకు రాజ్యాధికారం అందించడం కోసం సైకిల్ పై ఒంటరి పోరాటం చేశాడని తెలిపారు.. గ్రామాల్లో సైకిల్ పై తిరుగుతూ ప్రజలను చైతన్య వంతులను చేస్తు ఉత్తర ప్రదేశ్ లో దళితురాలైన మాయావతిని ముఖ్య మంత్రిని చేసిన ఘనత మాన్య శ్రీ కాన్షీరాం గారిదే అని కొనియాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి బహు జనులకు రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహు జన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని అందించి దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించిన మహొన్నత రాజకీయ శిఖరం అని కొనియాడారు. దేశానికి బహు జనులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని మహానీయుల ఆశయాల తో పాటు కాన్షీరాం సేవలు కొనసాగించడానికి నేటి యువత ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి మండల నాయకులు పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ తదితరులు పాల్గొన్నారు.