అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలి

అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు పనులను సందర్శించిన,
కేసముద్రం మండల మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు
పోలేపాక నాగరాజు సందర్శించి వారు మాట్లాడుతూ కాట్రపల్లి గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని సంఘ సభ్యులను అభినందిస్తూ భావితరాల యువతి యువకులు అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందు ఉండాలని కోరుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ నేటి యువతకు అంబేద్కర్ స్ఫూర్తిని తెలియజేయాలని ఇందుకు విద్యావంతులు మేధావులు ఈ విషయాలపై యువతకు అవగాహన కల్పించాలని వారు కోరారు అంబేద్కర్ ఏ ప్రాంతానికో ఏ వర్గానికో ఏ కులానికో మతానికో పరిమితం కాదు అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ ని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి నేటి యువత రాజ్యాంగాన్ని చదవాలి అందులో పొందుపరిచిన చట్టాలను హక్కులను రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో జరిగిన దురదృష్టకరమైన చర్యలు కొంతమంది దుర్మార్గులు కావాలని అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం దుర్మార్గమని ఇట్టి చర్యలకు పాల్పడిన ఎంతటి వారనైనా సహించేది లేదని, అట్టి వారిపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి కోరుతూ ఇప్పటిదాకా జిల్లాలో ఉన్న అంబేద్కర్ వాదులు అంబేద్కర్ యువజన సంఘాలు అందరూ, సంఘటితమై ఇట్టి చర్యలకు చర్యలకు పాల్పడుతున్న దుర్మార్గులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ పేరు ప్రతిష్టను అవమానపరిచే విధంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఎవరైనా సరే ఇట్టి చర్యలకు పాల్పడే ఎంతటి దుండగులైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంబేద్కర్ విగ్రహాలను ముట్టుకుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ అంబేద్కర్ విగ్రహాలను ముట్టుకునే ఎంతటి వారినైనా వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చింతకుంట్ల యాదగిరి, అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లే యాకాంబరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జల్లే జాన్సన్ అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు మునిగే చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version