ప్రమాదమని తెలిసినా పట్టింపేది?
– అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని
తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు వస్తుంటారు. ప్రమాద వశాత్తు చెట్టు పడుతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెట్టు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంపై పలు వురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.