ఎస్సీ ఎస్టీ బీసీ షెడ్యూల్ కులాల హష్టాల్స్ ఏర్పాటు
మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమాట్ల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మరపల్లి మల్లేష్ వి సి కె రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబలా అనిల్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో చదువుతున్న పిల్లలకు వసంతి గృహాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మండలంలో చదువుతున్న విద్యార్థులు కాలేజీ లేక దూరపుప్రాంతాలకు వెళ్లి చదువుకోడానికి ఆర్థికంగా తల్లిదండ్రుల పైన భారం పడుతూ ఉంది రాకపోకల ఇబ్బంది కలుగుతుంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీతోపాటు ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేసి నిరుపేద పిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనియెడల ఆందోళన చేస్తామని వాళ్లు పిలుపునిచ్చారు
