Doordarshan Team Inspects Soak Pits
మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని అంగన్వాడీ లో చేర్పించండి…
అంగన్వాడీ టీచర్ విక్టోరియా
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కాకతీయ కాలనీ వన్ సెంటర్ అంగన్వాడి టీచర్ విక్టోరియా అన్నారు. శనివారం అంగన్వాడి కేంద్రంలో సీబీ ఈవెంట్ లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి సూపర్వైజర్ సంధ్యారాణి పాల్గొన్నట్లు టీచర్ విక్టోరియా తెలిపారు.ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు బాలామృతంతో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి నెల పిల్లల హైట్, వెయిట్ చూపించాలని అన్నారు.ఈ కార్యక్రమానికి కాలనీవాసులు , అంగన్వాడి ఆయా తిరుపతమ్మ పాల్గొన్నారు.
