Students Take Road Safety Pledge
వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .
పాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలలో సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వనపర్తి పోలీస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ, రత్నం విద్యార్థులతో కలిసి మానవహారం పోలీసులు, వాలంటీర్లు కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు ట్రాఫిక్ నియమాలపై చర్చించి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా డి ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక చట్టం మాత్రమే కాదుఅది మన జీవితానికి రక్షణ కవచం అని అన్నారు.సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సురక్షితంగా రోడ్డు దాటే విధానం హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై బస్సుల్లో జాగ్రత్తలు పాఠశాలల వద్ద వేగ నియంత్రణ గురించి, మైనర్ల వాహనాలు నడపటం డ్రైవింగ్‌పై నిషేధం
ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు ఉంటాయని డి ఎస్పీ అన్నారు
ఈ కార్యక్రమంలో సీఐ, సుగంధ రత్నం, వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, చిన్నమ్మ తామస్, వనపర్తి టౌన్ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
